Link copied!
Sign in / Sign up
2
Shares

రోగ నిరోధక శక్తి పెంచుకోడానికి ఇలా చెయ్యండి చాలు

కాన్పు తర్వాత స్త్రీలలో సాధారణంగా రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. ఇన్ ఫెక్షన్ కలిగించే వైరస్ లతో పోరాడే తెల్లకణాల వల్ల రోగనిరోధక శక్తి వస్తుంది. కానీ కాన్పు తర్వాత తెల్లకణాల సంఖ్య తగ్గిపోవడంతో జలుబు, గొంతు ఇన్ ఫెక్షన్ వంటి స్వల్ప అనారోగ్యం కలిగే అవకాశం ఉంది. అలాంటివి రాకుండా 9 రకాలుగా జాగ్రత్తలు తీసుకోవచ్చు.

1. హాయిగా నవ్వండి

హాయిగా నవ్వితే... మన శరీరంలో కిల్లర్ సెల్స్ పెరుగుతాయి. వ్యాధి కారకాలైన వైరస్ లపై అవి పోరాడతాయి. డాక్టర్లు కూడా ఇదే చెబుతారు.

2. కాస్త మెలోడీ కావాలి

బాగా అలసిపోయిన తర్వాత మంచి సంగీతాన్ని వింటే మనసుకు హాయిగా ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉంటే రోగనిరోధక శక్తినిచ్చే ఇమ్యునోగ్లోబులిన్ విడుదలవుతుంది.

3. వ్యాయామం చేయండి

రోజుకు 30 నిముషాల చొప్పున వారానికి అయిదు రోజుల పాటు వ్యాయామం చేస్తే జలుబు చేసే అవకాశం 43 శాతం తక్కువవుతుందని బ్రిటీష్ పత్రిక తెలిపింది.

4. వ్యాక్సినేషన్ 

పిల్లలకు మాత్రమే వ్యాక్సినేషన్ అని అనుకోవడం పొరపాటు. కాన్పు తర్వాత శరీరంలో రోగనిరోధక శక్తి బాగా తగ్గిపోతుంది. ఆ సమయంలో రకరకాల వైరస్ లు సోకకుండా వ్యాక్సిన్ తీసుకోవాలి.

5. సాక్స్ వేసుకోవాలి 

కాన్పు తర్వాత శరీరం వేడి తగ్గకుండా చూసుకోవాలి. ముఖ్యంగా కాళ్లు వెచ్చగా ఉండాలి. చల్లదనం ఎక్కువైతే శరీరంలో రక్తకణాలు బిగుసుకునే ప్రమాదం ఉంది. అందుకే కాళ్లకు సాక్స్ వేసుకోవాలి. కాళ్లు వెచ్చగా ఉంటే శరీరం వెచ్చగా ఉంటుంది.

6. చేతులు కడుక్కోవాలి

 కాన్పు తర్వాత స్త్రీ ఎక్కువసార్లు అనారోగ్యానికి గురైతే, ఆరోగ్య సమస్యలు వస్తాయి. పిల్లల మలమూత్రాల వల్ల తల్లులకు అనారోగ్యం కలుగుతుంది. కాబట్టి ప్రతిసారీ చేతులు శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలి. శానిటైజర్ ను కూడా వాడవచ్చు.

7. బాగా తినాలి

వైరస్ అంటుకోకుండా ఉండాలన్నా, రోగనిరోధక శక్తి పెంపొందించుకోవాలన్నా బాగా తినాలి. తినడమంటే ఏదంటే అది తినేయడం కాదు. రోగాలు రాకుండా నిరోధించే ఉల్లిపాయలు, స్ట్రాబెర్రీ వంటి పోషకాహారం తీసుకోవాలి

8.మాటలే ఆరోగ్యం

ఒంటరిగా ఆలోచిస్తూ కూచోడం మంచిదికాదు. మీ స్నేహితులతో రోజూ మాట్లాడుతూ ఉండండి. అలా చేస్తే... ఏదో అనారోగ్యంతో ఉన్నాననే ఫీలింగ్ పోతుంది. ఇమ్యూనిటీ పెరుగుతుంది.

9. నిద్ర మానకండి 

తిండి, నిద్ర ప్రతి మనిషికీ అవసరం. మితంగా తిని, హాయిగా నిద్రపోతే ఎంతో ఆరోగ్యం. ఈ రెండూ సమంగా పాటించకుంటే జలుబు, జ్వరం వంటివి వస్తాయి.8 గంటల నిద్ర అవసరం.


Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon