Link copied!
Sign in / Sign up
32
Shares

పసి పిల్లలకు బెస్ట్ ఫుడ్ ‘రైస్ వాటర్’ : 2 నిముషాల్లో ఎలా తయారు చేసుకోవచ్చో తెలుసుకోండి

పసి పిల్లలకు ఎటువంటి ఆహారాన్ని ఇవ్వాలో తెలియక ప్రతి తల్లి తల్లడిల్లుపోతూ ఉంటుంది. పిల్లలకు ముఖ్యంగా తల్లి పాలే ఆరోగ్యకరం. అది కూడా 6 నెలల వరకు తప్పనిసరి. ఐతే 5 నెలల తర్వాత బిడ్డకు తల్లి పాలతో పాటు రైస్ వాటర్ ను ఇవ్వడం వలన కలిగే ప్రయోజనాలు చాలామందికి తెలియవు. నిజానికి తల్లి పాల తర్వాత  బిడ్డకు అందే సాలిడ్ ఫుడ్ రైస్. రైస్ కు బదులుగా రైస్ వాటర్ పిల్లలకు ఎలా ఇవ్వాలి, ఎలా తయారుచేసుకోవాలో 2 నిముషాలలో ఇక్కడ తెలుసుకోండి.

రైస్ వాటర్ - కావలసిన పదార్థాలు - తయారీ విధానం

ముందుగా ఒక కప్పు మంచి బియ్యం మరియు రెండు కప్పుల తాజా నీటిని తీసుకుని అన్నం మెత్తగా అయ్యేంతవరకు బాగా ఉడికించాలి. బాగా మెత్తగా అయ్యిన అన్నం నుండి నీరు బయటకు వస్తుంది మరియు అన్నం మెత్తగా అవ్వడం వలన బౌల్ లో నీరు కూడా ఉంటుంది. ఈ నీటినే రైస్ వాటర్ అని అంటారు.వీటిలో పిల్లలకు కావలసిన విటమిన్స్ పుష్కలంగా ఉన్నాయి.

రైస్ వాటర్ తో పిల్లలకు కలిగే ప్రయోజనాలు

రైస్ వాటర్ ఎలా తయారుచేసుకోవాలో తెలుసుకున్నారు కదా.. దీనివలన మీ బిడ్డలకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఒక్కసారి చూడండి.

చర్మ వ్యాధులు రానివ్వదు

రైస్ వాటర్ పసిపిల్లలకు (5 నెలల తర్వాత) ఇవ్వడం వలన పిల్లల చర్మం సున్నితంగా మరియు ప్రకాశవంతంగా అవుతుంది. అలాగే చర్మానికి ఎటువంటి చర్మ వ్యాధులు రాకుండా ఉంచగలదు. పిల్లలు ఎముకలు స్ట్రాంగ్ గా ఉండేలా సహాయపడుతుంది.

రోగ నిరోధక శక్తి పెంచుతుంది

పిల్లలు త్వరగా జబ్బుబారిన పడుతుండటం జరుగుతూ ఉంటుంది కాబట్టి రైస్ వాటర్ ఇవ్వడం వలన జలుబు, జ్వరం వంటివి వ్యాపించవు. అలాగే రోజూ నీరసంగా, అలసట లేకుండా సహాయపడుతుంది. వీటిలో ఉండే విటమిన్స్, మినరల్స్ కారణంగా కడుపునొప్పి ఉండదు, పిల్లల ఎదుగుదలకు ఉపయోగపడుతుంది.

ఈ జాగ్రత్తలు పాటించండి

రైస్ వాటర్ మొదలుపెట్టాక మీ పిల్లలకు కడుపునొప్పి, జ్వరం, శ్వాస సమస్యలు, వాంతులు అవ్వడం, డైయేరియా సమస్యలు ఉంటే ముందే డాక్టర్ ను అడగండి. రైస్ వాటర్ ఇవ్వొచ్చా లేదా అని. ఎందుకంటే కొందరు పసిపిల్లలకు ఓట్స్,  బార్లీ వంటి ఆహారాన్ని తినిపించినప్పుడు ఈ సమస్యలు వస్తుంటాయి కాబట్టి..

అందరికీ SHARE చేయగలరు. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon