Link copied!
Sign in / Sign up
8
Shares

రెండో సంతానం కోసం ప్లాన్ చేసుకునేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన 5 ముఖ్యమైన విషయాలు


మీరు రెండో సంతానం కోసం ప్లాన్ చేసుకుంటున్నారా? కొత్తగా పుట్టే బిడ్డకోసం ఎదురుచూస్తున్నారా? మరో బిడ్డకు జన్మనివ్వడానికి సిద్ధంగా ఉన్నారని అనుకుంటున్నారా? కానీ గర్భంధరించాలి అని నిర్ణయించుకునే ముందు, మీరు కొన్ని విషయాల గురించి తప్పకుండా ఆలోచించాలి. ఇద్దరి బిడ్దల మధ్య వయసు తేడా, వారిద్దరూ కలిసి ఎదిగే క్రమంలో, వారి మీద ప్రభావం చూపిస్తుంది. అలాగే రెండో సంతానం కోసం సిద్ధపడేటప్పుడు తెలుసుకోవాల్సిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. వాటి గురించి ఇక్కడ తెలుసుకోండి….

1. ఆర్ధిక పరిస్థితులు

ఈ 21వ శతాబ్దంలో సంపాదన ఎప్పుడు ఖర్చులకు లొంగిపోతుంది. పిల్లల కోసం మనం తీసుకునే ప్రతి జాగ్రత్త, కొనే ప్రతి వస్తువు మీ చేత డబ్బు ఖర్చుపెట్టిస్తుంది. అందుకే రెండో సంతానం కోసం సిద్ధమయ్యేటప్పుడు ఆర్ధిక విషయాలను దృష్టిలో పెట్టుకోండి. డబ్బు సమకూర్చుకున్నాక సంతానం కోసం ప్లాన్ చేసుకోండి.

2. మొదటి ప్రెగ్నన్సీలో సమస్యలు

రెండో సంతానం కోసం ప్లాన్ చేసుకునేటప్పుడు, మీరు మొదటి ప్రెగ్నన్సీ సమయంలో లేదా కాన్పులో, ఎదురుకున్న సమస్యలను దృష్టిలో పెట్టుకోవాలి. మీ గైనకాలోజిస్ట్ ను కలిసి తీసుకోవలసిన జాగ్రత్తల గురించి అడిగి తెలుసుకోండి. ఒకవేళ మీ మొదటి కాన్పు సిజేరియన్ అయితే, రెండవ కాన్పు మాములు కాన్పు అయ్యే అవకాశాల గురించి అడిగి తెలుసుకోండి.

3. పని భారం

మొదటి సంతానం కోసం చాలా మంది తమ జాబ్స్ కి కొంత కాలం విరామం ఇస్తారు. పిల్లలకు కొంత వయసు వచ్చాక మళ్ళి జాయిన్ అవుతారు. పని భారం పెరుగుతుంది, అలాగే ఇంట్లో పిల్లల అవసరాలని కూడా తీర్చాలి. రెండో సంతానాన్ని ప్లాన్ చేసుకుంటప్పుడు, ఈ సమస్య గురించి కూడా ఆలోచించాలి. ఇలాంటి పరిస్థితిలో మీరు ఎవరికీ సరైన న్యాయం చేయలేరు.

4.మొదటి బిడ్డకు ఏమైనా సమస్యలు ఉన్నాయా

మీ మొదటి బిడ్డకు ఏదైనా ఆరోగ్య సమస్యలు, ఎదుగుదల లోపాలు, మానసిక సమస్యలు ఉంటే. మీరు ఆ బిడ్డ కోసం ఎక్కువ సమయం కేటాయించాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితిలో రెండో సంతానం గురించి నిదానంగా ప్లాన్ చేసుకోవడం మంచిది.

5. మీకు నిజంగా రెండొవ సంతానం కావాలా

మీ బంధువుల్లో అందరికి ఇద్దరు పిల్లలు ఉన్నరానో, మగపిల్లాడు పుడితే బాగుంటుందనో, ఇలా రెండో సంతానం కోసం నిర్ణయం తీసుకోవద్దు. ఇంకో బిడ్డతో మీ కుటుంబం సంపూర్ణం అవుతుంది అని మీకు అనిపిస్తే, రెండో సంతానం కోసం సిద్దపడండి.   

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
100%
Like
0%
Not bad
0%
What?
scroll up icon