Link copied!
Sign in / Sign up
6
Shares

భార్యలు ఈ 4 పనులు చేయడం వలన తమ భర్తలకు దూరమవుతారు..!

20-25 ఏళ్ళ వరకు ఒక కుటుంబానికి దగ్గరగా ఉండి, పెళ్లి అనే బంధంతో మరొకరి ఇంటికి వెళ్లేలా చేసేదే పెళ్లి. పెళ్లి తర్వాత వధువు ఆలోచనలు అత్తవారింట్లో నచ్చడానికి కాస్త సమయం పట్టినా, అక్కడ నడుచుకునే విధానం అందరికీ నచ్చితే మాత్రం మిమ్మల్ని ఎంతో గౌరవంగా చూసుకుంటారు. ఇదిలా ఉంచితే సాఫీగా సాగిపోతున్న దాంపత్య జీవితంలో అప్పుడప్పుడు చిన్నచిన్న గొడవలే మీ బంధం దూరం కావడానికి కారణమవుతుంది.  అందుకు కారణం మహిళలు చేస్తున్న ఈ పనులే కారణం. ఆ పనులేంటో మీరు తెలుసుకోండి. మీ దాంపత్య జీవితం సంతోషంగా ఉండేలా చూసుకోండి…

పక్కింటి వాళ్ళతో మీ సంసారం గురించి..

చాలామంది మహిళలు చేస్తున్న తప్పు ఇదే. మీ దాంపత్య జీవితంలో ఎదురయ్యే సంఘటనలు మీ ఆయనతో కాకుండా పక్కింటి వాళ్ళతో చెప్పడం వలన మీ ఆయన గురించి వాళ్ళు తప్పుగా అనుకోవడం, వాళ్ళు మీ భర్తతో మీరు చెప్పిన విషయాల గురించి మాట్లాడటం వలన మీ దాంపత్య జీవితంలో గొడవలు వస్తాయి. పక్కింటి వాళ్లతో మాట్లాడాలి అనుకుంటే వేరే ఏదైనా మాట్లాడుకోండి గానీ మీ సంసారం గురించి తక్కువగా చెప్పుకోకండి.

భర్త సంపాదనను పోల్చి చూడటం

ఏ చెట్టుకు అంత గాలి అన్నట్లు, ఏ ఉద్యోగానికి అంత సంపాదన అన్నట్లుగా ఉండాలి గానీ పక్కింటి వాళ్ళు, పొరిగింటి వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారు, ఎంత దర్జాగా ఉన్నారో చూడండని మీ భర్తను వేలు పెట్టి చూపించకండి. అది మీ భార్యభర్తల మధ్య చిన్నచిన్న చినుకులా మారి పెద్ద పెద్ద గొడవలకు దారి తీస్తుంది. మిమ్మల్ని ప్రేమగా సంతోషంగా ఉన్నదాంట్లో చూసుకుంటున్నాడో అనేదే చూడాలి.

ప్రతి చిన్న విషయానికి గొడవ పడటం

భార్యాభర్తల మధ్య ముద్దు ముద్దు మాటలు, చిలిపి అల్లర్లు, అందమైన గొడవలు, ప్రేమానురాగాలే ఉండాలి. అంతకుమించి, ఇంటికి వచ్చిన మీ భర్తకు ఇరిటేట్ తెప్పించేలా మాట్లాడటం, చిరాకు పెట్టుకోవడం, చిన్న విషయానికి కూడా గొడవ పడటం మీ దాంపత్య జీవితంలో గొడవలకు దారి తీస్తుందే తప్ప సంతోషాన్ని ఇవ్వదు. ఈ విషయాలు పక్కవాళ్ళతో మీరు పంచుకుంటే మిమ్మల్ని ఇంకా తక్కువచేసి చూస్తారు కూడా.

పిల్లల ముందు ఇలా చేయకూడదు, చెప్పకూడదు

చాలామంది దంపతులు తమకు తెలియకో పిల్లల ముందు గొడవ పడటం, పిల్లలతో మీ నాన్న వేస్ట్, మీ అమ్మ అంతేలే కోపం తెచ్చుకోవడం, తిట్టడం, కొట్టడం తప్ప ఇంకేమీ రాదు అని పిల్లలతో చెప్పడం వలన మీలో ఎవరో ఒకరిపై పిల్లలకు గౌరవం తగ్గిపోయి అయిష్టం మరియు కోపం పెరుగుతుంది. అందుకే ఏ సమస్య ఉన్నా మీ ఇద్దరే పరిష్కరించుకోవాలి. ఆ సమస్యలోనే సంతోషాన్ని ఇచ్చే దారి వెదుక్కుకోవాలి.

ఇది ప్రతి ఒక్క దంపతులకు ఉపయోగపడే విషయమే కాబట్టి అందరికీ SHARE చేయండి. మీ సంతోషమే మా ఆనందం.  

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon