Link copied!
Sign in / Sign up
0
Shares

పెళ్లి కూతురు కాలితో బియ్యంను ఎందుకు నెట్టిస్తారో తెలుసా..!

భారతదేశం సంస్కృతీ, సాంప్రదాయాలకు కొలువైనది. ఎన్నో ఆచారాలు, మరెన్నో పద్ధతులు. ముఖ్యంగా పెళ్లి సమయంలో ఇలాంటి పద్ధతులను, సాంప్రదాయాలను మన పెద్దలు కొన్ని సంవత్సరాల నుండి ఫాలో అవుతున్నారు. అయితే ప్రస్తుత రోజుల్లో ఈ సాంప్రదాయాలు కాస్త తగ్గినా, అక్కడక్కడ పాటిస్తున్నారు కూడా. అటువంటి పద్ధతులలో కొత్తగా పెళ్లి అయిన పెళ్లి కూతురు వరుడి ఇంట్లోకి అడుగుపెడుతున్నప్పుడు వధువు కాలిచే గడప దగ్గర బియ్యం పెట్టి నెట్టమంటారు. ఇలా ఎందుకు చేస్తారో మీలో కొందరికి తెలిసి ఉండవచ్చు, మరికొందరికి తెలియకపోయుండవచ్చు. అయితే ఈ విషయాలు ఎప్పటికైనా తెలుసుకోవాల్సినవి కాబట్టి మీరు గుర్తుపెట్టుకుని తెలియనివాళ్లకు చెప్పండి.

పెళ్లి కూతురితో బియ్యం ఎందుకు నెట్టిస్తారు..!!

మనదేశం సంస్కృతీ సాంప్రదాయాలకు పెట్టింది పేరుగా అంటారు. అందులో పెళ్ళికి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఒకరి ఆచారాలు, పద్ధతులు మరొకరు తెలుసుకుని పెళ్లిని ఓ ఘనమైన కార్యంలా చేస్తారు. ఈ పెళ్లి కార్యక్రమం ముగిసిన తర్వాత వరుడితో పాటు వధువును పెళ్లి కుమారుడి ఇంటికి తీసుకువస్తారు. అత్తగారింట్లోకి మొదటిసారి అడుగుపెడుతున్న వధువును గడప దగ్గరే ఆపి, ఒక కలశంలో గడప వద్ద బియ్యం లేదా వరిని ఉంచి కాలితో నెట్టి మొదటి అడుగు లోపల పెట్టమంటారు. ఇలా చేయడం వెనుక కారణం లేకపోలేదు, గడపపై కలశంలో ఉన్న బియ్యం కాలితో నెట్టి ఇంట్లోకి అడుగుపెట్టడం వలన లక్ష్మీదేవిని ఇంట్లోకి తీసుకువచ్చినట్లుగా భావిస్తారు. ఇలా వధువుతో చేయించడం వలన ఆ ఇంట్లో సిరి సంపదలు, సంతోషాలు ఎప్పటికీ కొలువై ఉంటాయని చెబుతున్నారు పండితులు.

పెళ్లి కూతురిచే దీపం..

 

పెళ్లికూతురు కాలితో బియ్యం నెట్టించిన తర్వాత పూజగది వరకు పట్టువస్త్రాన్ని పరిచి వధువుచేత దీపం వెలిగిస్తారు అత్తగారు. ఈ విధంగా చేయడం వెనుక కూడా కారణం లేకపోలేదు. ఇలా చేయడం వలన ఆ లక్ష్మీ కటాక్షం ఇంట్లోకి వస్తుందని మన పెద్దలు, పండితులు చెబుతున్నారు. ఈ ఆచారాన్ని ఇప్పటికీ మనవాళ్ళు పాటిస్తున్నారు కూడా. ఈ విషయాలు చాలామందికి తెలియకపోయుండవచ్చు. ఎక్కడికి వెళ్లినా సరే మన సంస్కృతీ, సాంప్రదాయాలను మరిచిపోకండి.

.....................................................................................................

మహిళలందరికీ ఓ మంచి శుభవార్త..

Tinystep మీరు సురక్షితంగా ఉండటానికి ఎటువంటి కెమికల్స్ లేని సహజమైన ఫ్లోర్ క్లీనర్ ఉత్పత్తిని ప్రారంభించింది. మీ పిల్లల ఆరోగ్యకోసం, మీ ఇంట్లోకి ఎటువంటి క్రిములు చేరకుండా ఈ ఫ్లోర్ క్లీనర్ ఉపయోగపడుతుంది.

ఒక్కసారి మీ ఇంట్లో ఈ ప్రాడక్ట్ ను ఉపయోగించి, మీ విలువైన అభిప్రాయాన్ని తెలియపరచండి.

Tinystep ఫ్లోర్ క్లీనర్ ఆర్డర్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

We have a great opportunity for you. You can EARN up to Rs 10,000/- every month right in the comfort of your own HOME. Sounds interesting? Fill in this form and we will call you.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon