Link copied!
Sign in / Sign up
17
Shares

‘రవ్వ లడ్డు’ ఎలా చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారో తెలుసుకోండి : చాలా ఈజీ కూడా..

మన తెలుగు వాళ్ళు రుచికరమైన వంటలు చేయడంలో బాగా చెయ్యి తిరిగిన వారు. ఏ వంటకం చేసినా సరే కమ్మకమ్మగా భలే రుచికరంగా ఉంటాయి. ప్రస్తుతం చాలామందికి స్వీట్స్ చేసుకోవడంలో కొంత ఇబ్బంది పడుతున్నారు. అందుకని మనవాళ్ళు ఇష్టంగా తినే రవ్వలడ్డును రుచికరంగా పదే పది నిముషాలలో  ఎలా తయారు చేసుకోవచ్చో చూడండి.

రవ్వలడ్డు తయారీకి కావలసిన పదార్థాలు :

బొంబాయి రవ్వ - ఒక కప్పు (250 గ్రాములు లేదా అంతకంటే ఎక్కువ)

పంచదార -400 గ్రాములు

ఎండు కొబ్బరి -అరకప్పు

జీడిపప్పు -50 గ్రాములు

నెయ్యి-250 గ్రాములు

కిస్ మిస్, యాలకులు- 10 గ్రాములు

పాలు - ఒక కప్పు

రవ్వలడ్డు తయారీ విధానం :

⇛ముందుగా ఒక పాన్ తీసుకుని అందులో కొంచెం నెయ్యి వేసి వేడి అయిన తర్వాత అందులో జీడిపప్పు, కిస్ మిస్ వేసి వేయించాలి. ఇలా వేయించిన జీడిపప్పును పక్కన పెట్టుకోవాలి.

⇛పంచదార మరియు యాలకులను మిక్సీ పట్టుకుని ఒక గిన్నెలో పెట్టుకోవాలి.

⇛నెయ్యిని కడాయిలో వేసుకుని అందులో రవ్వను వేసి ఉడికించాలి. ఇలా రవ్వను ఉడికించిన తర్వాత రంగు మారేంతవరకు ఉంచాలి. ఆ తర్వాత అందులో పంచదార, యాలకుల మిశ్రమం, ఎండు కొబ్బరి, జీడీపప్పు, కిస్ మిస్ లను వేసి కలుపుకోవాలి.

⇛ఇలా కలిపిన తర్వాత చివరిగా ఆ మిశ్రమంలో పాలు కలుపుకుని ఉడికించుకోవాలి.

⇛బాగా ఉడికిన తర్వాత పొయ్యి మీద నుండి కిందకు దించి చేతులకు కాస్త నెయ్యి  రాసుకుని గోరు వెచ్చగా ఉన్నప్పుడు ఉండలుగా  చేసుకోవాలి. దీంతో కమ్మనైన రవ్వలడ్డు రెడీ అయినట్లే.

రవ్వలడ్డులు పిల్లలే కాదు పెద్దలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఈ తయారీ విధానం మీకు నచ్చితే అందరికీ SHARE చేయండి. 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon