Link copied!
Sign in / Sign up
8
Shares

రాశి ప్రకారం 2018 లో మీ కుటుంబంలో జరగబోయే మార్పులు : ముందే తెలుసుకోండి

కొత్త సంవత్సరంలో అంతా మంచిగా జరగాలని, కుటుంబంలో ఎటువంటి సమస్యలు, ఇబ్బందులు కలగకుండా అంతా సంతోషంగా సాగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఉంటారు. ఐతే మీకు తెలియకుండానే మీ జీవితంలో ఎటునుండి వస్తాయో కానీ సమస్యలు మిమ్మల్ని చుట్టివేసి ఇబ్బందుల్లో పడివేస్తుంటాయి. అయితే ఇక్కడ మీ రాశి ప్రకారం 2018లో మీ కుటుంబంలో ఎటువంటి మార్పులు జరగనున్నాయో ముందే తెలుసుకుని జాగ్రత్త పడాలని కోరుకుంటూ…

మేష రాశి

ఈ రాశి ప్రకారం మీరు చాలా సున్నితమైన మనస్తత్వం కలవారు కాబట్టి నిర్ణయాలు తీసుకునే విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. మీకు ఇష్టమైన వాళ్లకు ఏదైనా బాధ కలిగినా, సమస్య ఎదురైనా అందుకు కారణమైన వారిపై కఠినంగా ఉంటారు. అందువలన వారి నుండి సమస్యలు ఎదురుకాకుండా మీరు ప్రశాంతంగా సరైన నిర్ణయాలు తీసుకోవాలి.

వృషభ రాశి

తమకు ఇష్టమైన వారితో ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడతారు. మీకు ఇష్టమైన వారికోసం ఏదైనా సరే త్యాగం చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. ఇది మంచి విషయమే కానీ మీతో పాటు మిమ్మల్నే నమ్ముకున్న కుటుంబ సభ్యుల గురించి కూడా ఆలోచించడం చేయాలి. మీ భాగస్వామి మిమ్మల్ని బుజ్జగించాలని, ఎక్కువగా మీతోనే ఉండాలని కోరుకుంటారు.

మిధున రాశి

ఈ రాశి ప్రకారం మీరు చాలా నమ్మకస్తులు. ఎవరినైనా సరే గుడ్డిగా నమ్మడం, ఆ తర్వాత బాధపడటం. అందుకని ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. ఏ విషయాన్ని అయినా సరే సులువుగా తీసుకోవడం, మీ చుట్టూ ఉన్నవాళ్లను నవ్విస్తూ ఉండే గుణం మీలో ఉండటం వలన అందరూ మీరు సంతోషంగా ఉండాలని కోరుకుంటారు.

కర్కాటకము

మీ కుటుంబంతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్థిరపడాలని కోరుకుంటున్న మీకు వచ్చే సంవత్సరం బాగా కలిసి వస్తుందని, ఇప్పటివరకు మిమ్మల్ని వెంటాడిన మీ కష్టాలు మీ నుండి దూరం అవుతాయని జాతక నిపుణులు చెబుతున్నారు. నిజమైన ప్రేమ అంటే మీకు ఈ సంవత్సరంలో తెలిపే క్షణాలు చాలానే ఉన్నాయి.

సింహ రాశి

ఈ రాశి ప్రకారం మీకు తెలిసిన విషయాన్ని కడుపులో, నోట్లో దాచుకోలేకపోవడం, అందరితో ఓపెన్ గా మాట్లాడే స్వభావం కారణంగా, మీకు తెలియకుండానే గొడవలు వచ్చే ప్రమాదం ఉంది. అందుకని ఆచితూచి అడుగువెయ్యండి, ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు మరియు ఇతరుల గురించి ఆలోచించేటప్పుడు. అందరినీ ఒకే విధంగా చూడటం మీలో ఉన్న ఉత్తమ గుణం.

కన్య రాశి

పిల్లల కోసం ఎదురుచూస్తున్నట్లయితే వచ్చే సంవత్సరంలో ఈ రాశి వారికి పిల్లల యోగం ఉందని, ఆ ఇంట సంతోషాలు నెలకొంటాయని చెబుతున్నారు. ఐతే ఎక్కువ సమయం ఒంటరిగా గడపడానికి ఇష్టం ఉండటం వలన మీ గురించి మీ బంధువులు, స్నేహితులు మీతో మాట్లాడటానికి కొంచెం దూరంగా ఉంటారు కాబట్టి. ఆ దిశగా ఆలోచించండి.

తుల రాశి

ఈ రాశి ప్రకారం కుటుంబం అంటే చాలా చాలా ఇష్టం. ఎక్కువ ఎమోషనల్ గా ఉంటారు. ఏదైనా సమస్య వస్తే అస్సలు తట్టుకోలేరు. అలాగే మీ ఇష్ట ప్రకారం ఏదైనా పని జరగకపోతే ఏమీ అనుకోకండి. ఇతరులు ఇష్టాన్ని గౌరవించడంలో కలిగే సంతోషాన్ని, కిక్ ను ఆనందించండి.

వృశ్చికం

మీరు ఎన్నో రోజులుగా కలలు కంటున్న సొంత వాహనం, సొంత ఇల్లు ఈ సంవత్సరంలో వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయట. మీ ఇష్టాలు, ఆశయాలు తీరే సంవత్సరం కనుక మీరు దేని గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఆర్థికంగా బాగానే ఉంటారు. ఐతే పొదుపు విషయంలో జాగ్రత్తగా ఉండండి.

ధనస్సు

కుటుంబం, స్నేహితులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. అలాగే మీరు ఎప్పటినుండో వెళ్లాలనుకుంటున్న పుణ్యక్షేత్రాలు, ప్రదేశాలు చుట్టివస్తారు. ఈ రాశి ప్రకారం మీలో ఉన్న మంచి గుణం అందరితో నిజాయితీగా ఉండటం.

మకర రాశి

పిల్లల భవిష్యత్ గురించి ఎప్పుడు కంగారు పడుతూ ఉంటారు. మీరు తీసుకునే నిర్ణయాల వలన వచ్చే సంవత్సరం నుండి మీ పిల్లల భవిష్యత్ మంచిదారిలో నడిచే అవకాశాలు బాగా ఉన్నాయి. మీకు మీ ఆయనకు ఎటువంటి గొడవలు లేకుండా సంతోషంగా ఉంటారు.

కుంభ రాశి

స్నేహానికి ఎక్కువ విలువనిస్తారు. ఏ పనైనా, విషయం ఏదైనా సరే మీరే ముందుండి నడిపిస్తారు. ఇలా జరుగుతున్నప్పుడు కొన్నిసార్లు ఇబ్బందులు, అనవసరపు మాటలు వస్తున్నా వెనక్కు తగ్గకండి. ఎందుకంటే మిమ్మల్ని గౌరవించేవాళ్ళు, మీ నిర్ణయాలకు ప్రాధాన్యత ఇచ్చేవారే ఎక్కువ.

మీనము

పిల్లలు, మీ భాగస్వామి పట్ల ప్రేమ ఎక్కువ. ఎప్పుడు వారి గురించే ఆలోచిస్తూ ఉండటం, వారితోనే గడపడానికి ఇష్టపడుతూ ఉంటారు. అలాగే మీ ఆరోగ్యం గురించి కూడా కొంచెం జాగ్రత్తగా వ్యవహరించండి. మీ కుటుంబం గురించి పట్టించుకుంటూ మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. అలాగే పొదుపు విషయంలో కొంచెం జాగ్రత్త వ్యవహరించండి.

మాకు తెలిసిన సమాచారాన్ని మీకు అందిస్తున్నాము. మిమ్మల్ని, మీ మనస్సును బాధపెట్టాలని కాదు. గమనించగలరు… 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon