Link copied!
Sign in / Sign up
28
Shares

రాగి ముద్ద : రాయలసీమ స్పెషల్, ఎలా తయారుచేసుకోవాలో చూడండి..

cover image source : y.itimg.com

రాగి ముద్దను, రాగి సంగటి, ముద్ద, సంగటి అని ఇలా పిలుస్తూ ఉంటారు. రాగి ముద్దను ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ ప్రాంతంలో, ఉత్తర కర్ణాటక మరియు తమిళనాడు రాష్ట్రాలలో ఇష్టంగా తయారు చేసుకునే ఆరోగ్యాన్ని ఇచ్చే వంటకం. రాయలసీమ ప్రాంతంలో రాగి ముద్దను ఎక్కువగా నాటుకోడి పులుసు, వేరుశెనగ పచ్చడితో తింటూ ఉంటారు. ప్రస్తుతం ఆరోగ్య నిపుణులు చెబుతున్న సలహాల మేరకు రాగిముద్ద చాలా ఆరోగ్యకరం, ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉండవు. బీపీ, షుగర్ కంట్రోల్ లో ఉంటాయని చెబుతుండటంతో పట్టణాలు, నగరాలలో కూడా రాగిముద్దను హోటల్లో తయారుచేసి వడ్డిస్తున్నారు. ఆరోగ్యానికి మేలు చేసే రాగి సంగటిని ఎలా తయారు చేసుకోవాలి? రాగి ముద్ద వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి వివరంగా ఇక్కడ తెలుసుకుందాం..

1.రాగి ముద్దకు కావాల్సిన పదార్థాలు 

2.రాగి ముద్ద ఎలా తయారు చేసుకోవాలి?

3.రాగి ముద్దతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు 

రాగి ముద్దను ఒకప్పుడు మన పూర్వీకులు, పెద్దలు ఎంతో ఇష్టంగా తినేవారు. అయితే రానురాను ఈ వంటకంపై ప్రస్తుతం తరానికి ఆసక్తి తగ్గుతూ వచ్చింది. అయితే ఇప్పుడు తక్కువ వయస్సులోనే ఎక్కువగా అనారోగ్య సమస్యలు వస్తుండటంతో మళ్ళీ రాగి ముద్దను చాలా ఇష్టంగా భుజిస్తున్నారు. ఆకలిని తీరుస్తూ, ఆరోగ్యాన్ని ఇస్తున్న రాగి ముద్దను తయారు చేసుకోవడానికి ఏమేం కావాలి, ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.. రాగిముద్ద లేదా రాగి సంగటి ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకునేముందు పిల్లలు ఇష్టంగా తినే రాగి గంజి 5 నిముషాలలో ఎలా చేసుకోవాలో ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోగలరు..

1.రాగి ముద్దకు కావాల్సిన పదార్థాలు 

*వరి నూకలు లేదా బియ్యం నూకలు - అర కిలో 

*రాగులను మిషన్ పట్టి తీసిన పిండి (రాగి పిండి) - 5 టేబుల్ స్పూన్లు 

*ఉప్పు - తగినంత 

*నీరు -1:2 

2.రాగి ముద్ద ఎలా తయారు చేసుకోవాలి?

మనం సాధారణంగా బియ్యంతో అన్నం ఎలా వండుకుంటామో అదే విధంగా రాగి ముద్దను చేసుకోవడమే. ఇది చాలా సులభం కూడా. అయితే రాగిముద్దలో రాగిపిండిని కలుపుకోవడం మాత్రమే. 

- ముందుగా బియ్యం నూకలను ఒక పాత్రలోకి తీసుకుని 30 నిముషాల పాటు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత అన్నం వండుకునే ఒక గిన్నెలోకి బియ్యం నూకలు మరియు 1:2 నిష్పత్తిలో నీరు వేసి ఉడికించాలి. నీరు ఎక్కువగా వేయటం వలన పలుచగా తయారవుతుంది. అలాగే నీటిని తక్కువగా కూడా వేసుకోకూడదు. ఉండలుగా మారే అవకాశం ఉంది. 

- బియ్యం నూకలు బాగా ఉడికిన తర్వాత కాస్త మంటను తగ్గించుకుని అందులో 5 టేబుల్ స్పూన్ల రాగిపిండిని వేసుకోవాలి. రాగిపిండిని కొన్ని నిముషాల పాటు ఉడికించి, ఒకేచోట ఉండేలా కాకుండా బియ్యం నూకలతో బాగా కలిసేలా కలియబెట్టుకోవాలి. 

- బియ్యం నూకలు మరియు రాగి పిండిని ఉడికించుకున్న తర్వాత కిందకు దించుకుని మళ్ళీ కాస్త రాగిపిండి అందులో వేసి మొత్తం కలియపెట్టుకోవాలి. ఎక్కడైనా పలుచగా లేదా ఉండలుగా ఉంటే కలిసిపోతుంది కాబట్టి. 

- ఇలా మొత్తం కలియబెట్టిన తర్వాత అరచేయి మోతాదుకంటే ఎక్కువగా తీసుకుని ముద్దలుగా చేసుకోవాలి. చేతులకు వేడి తగలకుండా చల్లని నీటితో తడుపుకుంటూ ముద్దలుగా చేసుకోవాలి. ఇలా ముద్దలు చేసుకున్న తర్వాత ఒక్క ప్లేట్ లో ఉంచుకోవాలి. దీంతో మీరు ఇష్టపడే రాగిముద్ద లేదా రాగి సంగటి రెడీ అయినట్లే. మీ ఇంటిల్లిపాదికీ ప్రేమగా వడ్డించండి. 

- రాగి ముద్దలోకి ఎక్కువగా నాటుకోడి పులుసును చేసుకుని ఆరగిస్తూ ఉంటారు. నాన్ వెజ్ శాఖాహారులు వేరుశనగలతో పచ్చడి చేసుకుని అందులో కాస్త నెయ్యి వేసుకుని ఆరగిస్తే కలిగే సంతోషం మాటల్లో చెప్పలేం. అలాగే పప్పు లేదా మునక్కాయలతో పులుసు చేసుకున్నా బాగానే ఉంటుంది.  అలాగే మీ పిల్లలు ఆహారం సరిగ్గా తినడం లేదా, అయితే ఒక్కసారి ఈ 5 రకాల అంబలిలను ఎలా చేసుకోవాలో ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోండి.. 

3.రాగి ముద్దతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు 

రాగిముద్ద లేదా రాగి సంగటి ఎలా తయారు చేసుకోవాలో, ఎంత సులభతరమో చూశారు కదా, రాగిముద్దను ఆహారంగా తీసుకోవడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇక్కడ వివరంగా చూడండి..

ఎముకలకు బలం : రాగిలో కాల్షియం ఎక్కువ మోతాదులో ఉండటం వలన ఎముకలు, పళ్ళు  చాలా బలంగా, గట్టిగా ఉండటానికి తోడ్పడుతుంది. ప్రస్తుతం మనం తీసుకునే ఆహారం సరైన విధంగా లేకపోవడం వలన ఎముకలు బలంగా లేకపోవడం మరియు పళ్ళు బలహీనంగా ఉండటం వలన ఊడిపోవడం జరుగుతూ ఉంటాయి. అయితే వారానికి రెండుసార్లు రాగిముద్ద లేదా రాగి అంబలి తీసుకోవడం వలన ఎముకలు బలంగా ఉంటాయి. 

డయాబెటిస్ : ప్రస్తుతం చాలామందిని ఇబ్బందిపెడుతున్న సమస్య డయాబెటిస్. డయాబెటిస్ కంట్రోల్ లో ఉండటానికి ఉదయం బ్రేక్ ఫాస్ట్ సమయంలో లేదా మధ్యాహ్నం లంచ్ లో రాగిసంగటిని మీ డైలీ ఫుడ్ గా తీసుకోవడం వలన షుగర్ లెవెల్స్ ను నియంత్రణలో ఉంచుకోవచ్చు. 

యవ్వనంగా కనిపించాడానికి : వయస్సు తక్కువగా ఉన్నాసరే కొందరిలో చర్మం సాగుతూ ఉండటం, కళ్లకింద నల్లని మచ్చలు చారలు ఉండటం వలన వయస్సు పైబడినట్లుగా కనిపిస్తారు. రాగిముద్దను తీసుకోవడం వలన యవ్వనంగా, అందంగా కనిపిస్తారు. ఇందులో ఎమినో ఆసిడ్స్ అయిన మెతోనిన్ మరియు లైసిన్ ఉండటమే ఇందుకు కారణం. ఇందులో ఉండే విటమిన్ D కారణంగా శరీరానికి కావాల్సిన కాల్షియం అందుతుంది. అలాగే మీ పిల్లల సంపూర్ణ ఎదుగుదల కోసం ఈ 3 ఉత్తమమైన ఆహారాలను ట్రై చేసి చూడండి.. 

బరువు : రాగిలో ఫైబర్ శాతం బాగా ఉండటం వలన బరువును పెంచకుండా వెయిట్ కంట్రోల్ లో ఉండటానికి తోడ్పడుతుంది. రక్తంలో షుగర్ స్థాయిని నియంత్రణలో ఉంచుతుంది మరియు మీ బరువు పెరగకుండా సాధారణంగా ఉండేలా ఉపయోగపడుతుంది. 

సో, చూశారు కదా.. రాగిముద్ద లేదా రాగిసంగటిని ఎలా తయారు చేసుకోవాలో, రాగి వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మరియు మీ పిల్లలకు ఆరోగ్యాన్ని, శక్తిని ఇచ్చే రాగి జావ, రాగి అంబలి ఆహారాల గురించి.. ఈ విషయాలు మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి, ఇంకా మరింత సమాచారం కోసం మాకు కామెంట్ చేయండి..

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon