Link copied!
Sign in / Sign up
77
Shares

3 నెలల చిన్నారి ప్రాణాలు తీసిన ‘రాగి మాల్ట్’ : పిల్లలకు ఏ ఆహరం ఇవ్వాలో తెలుసుకోండి

అప్పుడే పుట్టిన పిల్లలకు, చిన్న వయస్సు ఉన్నవారికి అసలు ఎటువంటి ఆహారాన్ని ఇవ్వాలి, ఏ ఆహార పదార్థాలకు దూరంగా ఉంచాలో  ఇది వరకే మనం టైనీ స్టెప్ లో పిల్లల ఆహారం గురించి వివరంగా చెప్పుకున్నాం. ఐతే అభం శుభం తెలియని 3 నెలల పసికందు రాగి మాల్ట్ గొంతులో అడ్డుపడి ఊపిరి ఆడకపోవడంతో ప్రాణాలు విడిచింది. అసలేం జరిగిందో తెలిస్తే మనస్సు చలించిపోతుంది. ప్లీజ్ ఇలా ఎవరూ చేయకుండా అందరికీ తెలిసేలా SHARE చేయగలరు.

బేబీ ఫుడ్ అనుకుని అమ్మ పెట్టింది

కడుపు చీల్చుకు పుట్టిన బిడ్డను ఆరోగ్యాన్ని చూసుకోవాలని మీ చిన్నారికి రాగి మాల్ట్ బాగా సరిపోతుందని ఎవరో చెప్పడంతో రాగి మాల్ట్ తయారుచేసి బిడ్డకు తినిపించింది ఆ తల్లి. ఐతే అది జిగటగా లేదా గట్టిగా ఉండటం వలనేమో మింగలేక గొంతులోనే ఉండిపోయింది. దీంతో పాప శ్వాస తీసుకోవడం కష్టమైంది. తమ కూతురు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండటంతో వెంటనే హాస్పిటల్ కు తీసుకువెళ్లినా ఉపయోగం లేకపోయింది.

మాగాడి తాలూకాలోని హోసపాళ్యలో జరిగిన సంఘటన..

నెలన్నర క్రితం బెంగుళూర్ కు దగ్గరలోని మాగాడి తాలూకా, రామనగర పరిధిలోని హొసపాళ్య గ్రామంలో ఈ విషాదం చోటు చేసుకుంది. ఈ చిన్నారి తల్లితండ్రులు మంజునాథ్, ధనలక్ష్మి వ్యవసాయం చేస్తూ జీవనం చేస్తున్నారు. పాపం, ఎవరో బంధువులు రాగి మాల్ట్ మీ బిడ్డకు పట్టిస్తే మంచిదని  చెప్పడంతో బేబీ ఫుడ్స్ గురించి తెలియని ఆ తల్లి అలాగే చేసింది. చివరికి ఆ రాగి మాల్ట్ గొంతులో చిక్కుకుని ప్రాణాలు విడవాల్సి వచ్చింది. మాగాడి లోని గవర్నమెంట్ హాస్పిటల్ కు పాపను వెంటనే తీసుకువెళ్లగా కొన్ని నిముషాలలోనే కన్నుమూసింది. ఆరు నెలల వరకు చిన్నర్లకు లిక్విడ్ ఫుడ్స్ ఇవ్వాలని గట్టిగా ఉండే ఈ పదార్థాలు ఇస్తే ఇలాగే నష్టం జరుగుతుందని డాక్టర్లు చెప్పారు.

ఇటువంటి సంఘటన మరొకరి ఇంట్లో జరగకుండా మరో పసిప్రాణం పోకుండా ఉండాలంటే అందరికీ SHARE చేయగలరు. 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon