Link copied!
Sign in / Sign up
7
Shares

బెస్ట్ వైఫ్ కు ఉండాల్సిన 5 అర్హతలు, లక్షణాలు..

మహిళ జీవితం పెళ్లికి ముందు ఒకలా, పెళ్లి తర్వాత మరోలా మారిపోవడం ప్రతి ఒక్కరి జీవితంలో ఉండటం సర్వ సాధారణమే. అయితే ఇంట్లో ఉన్నంత చనువు అత్తింట్లో అన్ని చోట్ల దొరక్కపోవచ్చు. కానీ ఎన్ని సమస్యలున్నా భార్యభర్తలు సంతోషంగా ఉంటేనే వారి  దాంపత్య జీవితం సుఖంగా ఉంటుంది. ఒక ఇల్లు చక్కగా ఉంది అంటే మొదట అందరూ చెప్పుకునేది ఆ ఇంటి మహాలక్ష్మి అయిన కోడలు గురించే. ఇంటికే కొత్త కళను, ఆనందాన్ని తీసుకువస్తున్న మహిళకు అంటే ఉత్తమమైన భార్యకు ఉండాల్సిన లక్షణాలు ఏంటో మీరే చూడండి…

మీ భర్తకు కావల్సినది ఇవ్వాలి..

ప్రస్తుతం చాలామంది భార్యాభర్తలు తమ కుటుంబం కోసం ఉద్యోగాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇక్కడ నేను ఎక్కువ నువ్వు తక్కువ అని చేసుకోకుండా మీ భర్తకు ఏం కావాలో చూసుకోండి. పెళ్ళికి ముందు ఫ్రెండ్స్ తో బాగా కలిసి తిరిగిన మీ ఆయన వారిని కొంచెం మిస్ అవుతూ ఉండవచ్చు. అందుకని ఎప్పుడు మీతోనే, ఇంట్లోనే కాకుండా ఇంకా మీ భర్తకు ఆనందాన్ని ఇచ్చే విషయాలు ఏంటో అడిగి తెలుసుకోండి.

నవ్విస్తూ ఉండాలి

ఎన్నో టెన్షన్స్ నుండి నలిగిపోయి ఇంటికి వచ్చిన మీ భర్తకు మీరే అసలైన సంతోషం. అందుకని ఎప్పుడు మీ నుండి మీ ఆయనకు టెన్షన్ లేకుండా, మీ ఆయనను మీ కుటుంబాన్ని నవ్విస్తూ, నవ్వుతూ ఉండాలి. అలాగే అప్పుడప్పుడు జోక్స్ వేయడం చేయాలి. ఎంత పెద్ద సమస్య వచ్చినా నేనున్నాను అనే భరోసా ఇవ్వాలి.

బాధ్యతగా ఉండాలి

మీరు గొప్పగా, ఉన్నతంగా ఉండాలి మీ కుటుంబం గౌరవంగా ఉండాలి అంటే భార్యల చేతుల్లోనే ఉంటుంది. భర్త సంపాదన, పిల్లల భవిష్యత్ గురించి ఆలోచిస్తూ ఉండవచ్చు. కానీ మీరు మాత్రం ప్రతి ఒక్క విషయంలో ప్రణాళికగా, బాధ్యతగా వ్యవహరించాలి. మీరు తీసుకునే ఒక్కో నిర్ణయం మీ కుటుంబానికి చాలా ఉపయోగపడుతుంది. మీ ఆయన ఏదైనా విషయంలో తప్పు చేస్తుంటే ఆయన్ను నిలదీసి అడగటం తప్పేమీ కాదు. 

అందంగా, ఆకర్షణీయంగా కనిపించాలి

ప్రతి భర్త తన భార్య ఎంతో అందంగా ఉండాలి అనుకుంటాడు. బయటకు వెళ్లిన ఇంటికి వచ్చిన మీ ఆయన మిమ్మల్ని చూడగానే తనకున్న టెన్షన్స్ అన్నిటినీ మర్చిపోవాలి. అంటే మీ ముఖ్యం ఎప్పుడు కాంతివంతంగా మెరిసిపోతూ ఉండాలి. అలా పడకగదిలో భర్త కోరుకునే సుఖాన్ని భార్యగా అందించాలి.

మీ ఆయన ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో..

కొందరు మహిళలు భర్తతో మాత్రమే సంతోషంగా వ్యవహరిస్తూ ఉంటారు.  భర్త కుటుంబం అన్నా, ఆయన ఫ్రెండ్స్ అన్నా ఎందుకో సరైన కారణం లేకపోయినా అయిష్టంగా ఉంటారు. అది భర్తలకు చాలావరకు నచ్చకపోవచ్చు. ఏదైనా సమస్య  ఉంటే మీ భర్తతో దీని గురించి చెప్పుకోవాలి కానీ అలా వారిని దూరంగా బయటివాళ్లలా చూడటం మీ భర్తకు ఇష్టం ఉండదు.. ఎప్పుడు నిజం మాట్లాడుతూ నిజాయితీగా వ్యవహరించాలి. 

బెస్ట్ వైఫ్ కు ఉండాల్సిన అర్హతలు, లక్షణాలలో ఇవి చాలా ముఖ్యమైనవి. ఈ లక్షణాలు మీలో ఉంటే LIKE మరియు SHARE చేయండి. మీరు ఏమైనా చెప్పాలి అనుకుంటే COMMENT చేయవచ్చు..  

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon