Link copied!
Sign in / Sign up
0
Shares

పుట్టుకతోనే కళ్ళు లేని పాప, 2 ఏళ్ళ తర్వాత అమ్మను చూస్తూ ఎలా చలించిపోయిందో చూడండి

ఈ ప్రపంచంలో దేవుడు ఉన్నాడు అని నేనెప్పుడూ నమ్మలేదు, పుట్టుకతోనే కంటిచూపు లేక చెవులు వినిపించని నా 2 రెండేళ్ల కూతురికి ఏదో అద్భుతం జరిగినట్లు తన కళ్ళతో నన్ను చూడటం, తనకు నేనే చెప్పే మాటలు వినిపించడం, నాతో మాట్లాడిన తర్వాత మొదటిసారి దేవుడు ఉన్నాడు అనిపించింది. ఇది నా జీవితంలో, నా కూతురి జీవితంలో జరిగిన గొప్ప అద్భుతం అంటూ 2 సంవత్సరాల తర్వాత తన కూతురికి కంటి చూపు తిరిగి రావడంతో సంతోషంగా చెబుతోంది ఈ చిన్నారి తల్లి.

పుట్టుకతోనే కంటి చూపు లేదు, చెవులు వినిపించవు

ఈ ఫొటోలో కనిపిస్తున్న ఈ చిన్నారి పేరు నికొల్లీ పెరేరియా, బ్రెజిల్. పుట్టుకతోనే పేడియాట్రిక్ గ్లూకోమా అనే వ్యాధి కారణంగా కళ్ళలో, చెవులలో ఫ్లూయిడ్ ఉండిపోయింది. దీనివలన కంటి చూపు కనిపించలేదు, చెవులు వినిపించలేదు. తన తల్లిని చేతులతో తాకుతూ తల్లి స్పర్శను మాత్రం అర్థం చేసుకునేది. తన కూతురిని ఈ స్థితిలో చూసి ఆ తల్లి కన్నీరుమున్నీరు అయ్యింది. 

2 ఏళ్ళ అద్భుతం జరిగింది

తన కూతురికి చూపు రాగలదు, మాట్లాడగలదు అని కొంతమంది వైద్యులు చెప్పడంతో ఆ నమ్మకంతోనే ఏం చేయడానికైనా సిద్ధమైంది నికొల్లీ తల్లి. తన దగ్గర ఆపరేషన్ కు సరిపడా డబ్బులు లేకపోయినా ఫండ్ రైజింగ్ ద్వారా తన బాధను సోషల్ మీడియా అయిన ఫేస్ బుక్ ద్వారా చెప్పుకుంది. అంతర్జాతీయ పిల్లల సంరక్షణ వారు కూడా ఇందుకు సపోర్ట్ గా నిలవడంతో 3 గంటల సుదీర్ఘ ఆపరేషన్ తర్వాత ఈ చిన్నారికి చూపు వచ్చింది.

కళ్ళు వచ్చాక అమ్మతో..వీడియో 

పుట్టిన 2 ఏళ్ళ వరకు తల్లి చెప్పే మాటలు వినలేక, తల్లిని చేతి స్పర్శ లేదా హత్తుకుని మాత్రమే అమ్మ ప్రేమను పొందుతూ కంటి చూపు లేక ఇబ్బందిపడిన ఈ చిన్నారి, తనని చూస్తూ తనతో మాట్లాడుతుంటే దేవుడు ఉన్నాడు అంటూ కూతురిని గుండెలకు హత్తుకుని ఆనందభాష్పాలు పెట్టుకుంది. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon