Link copied!
Sign in / Sign up
115
Shares

మీరు పుట్టిన వారం బట్టి మీ వ్యక్తిత్వం, మనస్తత్వం గురించి తెలుసుకోవచ్చు

సహజంగా ప్రతి ఒక్కరికీ తమ గురించి ఇతరులు ఏమనుకుంటున్నారు, నా జీవితం ఎలా ఉండబోతుంది..అనే విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటారు. జ్యోతిష్యం, హస్త సాముద్రికం..ఇలా తమ భవిష్యత్ ను తెలిపే అన్ని విషయాల గురించి చెక్ చేస్తూ ఉంటారు.  ఆస్ట్రాలజీ ప్రకారం మీరు పుట్టిన వారాన్ని బట్టి మీ స్వభావం  ఎలా ఉంటుందో సులభంగా తెలుసుకోవచ్చు అంటున్నారు. మీ రాశి కూడా ఈ రోజుపై ప్రభావం చూపిస్తుంది కూడా..

సోమవారం

ఈ రోజు జన్మించిన వారి ప్రకారం వీరికి ఒకరిపై ఆధారపడి బ్రతకడం ఇష్టం ఉండదు. సంతోషాన్ని అందరితో పంచుకుంటారు గానీబాధను మాత్రం ఒక్కరే అనుభవిస్తారు. ఏ రంగం ఎంచుకున్నా సరే అందులో నాయకుడిగా ముందుండి నడిపిస్తారు. తెలియని వయస్సులో ఏదైనా ఎవరైనా చెబుతుంటే నచ్చదు కానీ, జ్ఞానం గొప్పదనాన్ని మాత్రం ముందుముందు అర్థం చేసుకుంటారు.

మంగళవారం

ఎప్పుడు తమ గురించే కాకుండా తమ చుట్టుపక్కల గురించి కూడా ఆలోచిస్తూ ఉంటారు. తమకు తెలియని కొత్త విషయాల గురించి తెలుసుకోవడానికి బాగా ఆసక్తి కనబరుస్తూ ఉంటారు. ప్రతి విషయంలోనూ నిజాయితీగా ఉంటారు కాబట్టి ఎటువంటి సమస్య వచ్చినా, ఎవరైనా సరే విమర్శించినా సున్నితంగా తీసుకుంటారు, చిరునవ్వు చిందిస్తారు.

బుధవారం

ఈ రోజు జన్మించిన వారి ప్రకారం వీరు ఎప్పుడు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఆధ్యాత్మిక చింతన, దేవుడిపై భక్తి ఎక్కువే. తమ తెలివి తేటలను నమ్ముకుని ముందుకు వెళతారు. ఎవరో చెప్పారు కదా అని గుడ్డిగా వెళ్ళరు.

గురువారం

అందరినీ కలుపుకుని పోవడం అంటే చాలా ఇష్టం. కోపం, గొడవలంటే పడదు. ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉంటారు. చిరునవ్వుతో ఏదైనా సాధించవచ్చు అనుకునే స్వభావం. కష్టపడేతత్వం ఎక్కువ మరియు ప్రతి క్షణం చురుగ్గా ఉంటారు.

శుక్రవారం

శుక్రవారం రోజు జన్మించిన వారు అందరితోనూ సహజంగా ఉండటానికి ఎక్కువగా ఇష్టపడతారు. కొందరిలా వారికి నిజ జీవితంలో కూడా నటించడం అంటే ఇష్టం ఉండదు. ఎదుటివాళ్ళు చెప్పే విషయాలను చాలా త్వరగా నమ్మేస్తారు. చాలా క్రియేటివిటీగా ఆలోచిస్తారు. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరితోనూ ఒకే విధంగా నడుచుకుంటారు.

శనివారం

ఈ రోజు జన్మించిన వారికి వీళ్ళు చేసే ప్రతి పనిలో కుటుంబ సభ్యులు అండగా, తోడుగా, వెన్నుదన్నుగా నిలుస్తారు. యవ్వన వయస్సులో కొన్ని సమస్యలు ఎదుర్కున్నా తమ భవిష్యత్ గడిచేకొద్దీ ఉజ్వలంగానే ఉంటుంది. వ్యవసాయం, వ్యవసాయం గురించి తెలుసుకోవడం అన్నా, ఆ దిశగా వెళ్లడం అన్నా ఆసక్తి ఎక్కువ. పెద్దగా మాట్లాడరు. చాలా సున్నితమైన మనస్సు కలిగినవారు మరియు అందంగా ఉంటారు.

ఆదివారం

తమ కుటుంబం సంతోషం కొరకు ఎంత కష్టమైనా సరే ఎంతో ఇష్టంగా చేస్తారు. చదువు మరియు ఆర్ట్స్ రంగాలలో వీరు పుట్టినరోజు ప్రకారం విజయం ఉంటుందని అంటున్నారు. కొన్ని సమస్యలు కొంతకాలం వీరి జీవన అభివృద్ధికి అడ్డుపడినా నెమ్మదిగా విజయం సాధించగలరు. ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. శక్తివంతమైన వారు మరియు కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడం అంటే ఆసక్తి ఎక్కువ.

పైన చెప్పుకున్నట్లు ఇందులో మీరు పుట్టినరోజు ప్రకారం అవును నిజమే అనిపిస్తే అందరికీ SHARE చేయగలరు.  

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon