Link copied!
Sign in / Sign up
41
Shares

పుట్టిన తేదీని బట్టి మీ పిల్లలు ఏ రంగంలో సక్సెస్ సాధించగలరో ముందే తెలుసుకోవచ్చు

పిల్లలు పెద్దయ్యాక వారికి ఇష్టంలేని పని లేదా నచ్చని రంగంలో చేర్పించి వారి జీవితం సరైన దారిలో వెళ్లకపోతుంటే ప్రతి తల్లితండ్రులకు బాధగానే ఉంటుంది. ఐతే సంఖ్యాశాస్త్రం (న్యూమరాలజీ) ప్రకారం పుట్టిన తేదీని బట్టి పిల్లల కెరియర్ ఏ రంగంలో అయితే బాగుంటుంది, ఎక్కడ సక్సెస్ సాధించగలరో చెబుతున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీ పిల్లల పుట్టిన తేదీని బట్టి చెక్ చేసుకోండి..

1,10,19,28 తేదీలలో పుట్టిన వారు

ఈ తేదీలలో జన్మించిన వారి ప్రకారం సూర్యుడు వీరికి పాలకుడిగా చెబుతున్నారు. పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలు పుణికి పుచ్చుకోవడం,  రిస్క్ అని తెలిసినా కూడా ఏ పని అయినా చేసేందుకు, క్లిష్ట పరిస్థితుల్లో అందరికీ ఉపయోగపడే విధంగా నిర్ణయాలు తీసుకోగలరు కాబట్టి, వీరికి బిజినెస్ రంగం ఐతే చాలా బాగుంటుందట.

2,11,20,29 తేదీలలో జన్మించిన వారు

ఈ జన్మ తేదీల ప్రకారం వీరికి చంద్రుడు పాలకుడిగా ఉన్నారు. న్యూమరాలజీ ప్రకారం వీరికి చిన్నతనం నుండే డిఫరెంట్ గా చేయాలి అని ఆలోచించే స్వభావం, క్రియేటివిటీగా చేసే పనులలో ఐతే వీరికి పర్ఫెక్ట్. ఫ్యాషన్, ఆర్ట్స్, ఎంటర్ టైన్ మెంట్, యాక్టింగ్, డిజైనింగ్ వంటి రంగాలలో మంచి సక్సెస్ లభిస్తుంది.

3,12,21,30 తేదీలలో పుట్టిన వారు

సూర్య కుటుంబంలో పెద్దదైన బృహస్పతి ఈ జన్మ తేదీల ప్రకారం వీరికి పాలకుడిగా చెబుతున్నారు. సహజంగానే వీరు ధైర్య లక్షణాలు కలిగిన వారు, ధృడమైన వారు కాబట్టి వీరికి బ్యాంకింగ్, ఫైనాన్స్, రిటైల్ బిజినెస్ రంగాలు ఐతే బాగా ఉంటాయని చెబుతున్నారు.

4,13,22,31 తేదీలలో జన్మించిన వారు

ఈ తేదీలలో జన్మించిన వారు అసాధారణ వ్యక్తులు మరియు చాలా ప్రత్యేకమైన వారు. ఐతే వీరు తీసుకునే క్షణిక నిర్ణయాల వలన ఇబ్బందులలో పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట. జూదం వంటి చెడుదారులు తొక్కే అవకాశం ఉందని చెబుతున్నారు. వీరికి యాక్టింగ్, ఆర్ట్స్ రంగాలు ఐతే మంచి విజయం సాధించగలరని చెబుతున్నారు.

5,14,23 తేదీలలో పుట్టిన వారు

పుట్టుకతోనే వీరు చక్కని భావవ్యక్తీకరణ నైపుణ్యం కలిగిన వారు మరియు చివరి నిముషంలో అయినా సరే మంచి నిర్ణయం తీసుకుని అందరినీ ఆనందపరచగలరు. అందుకని వీరికి బిజినెస్, టెక్నాలజీ, స్పోర్ట్స్, మార్కెటింగ్ ఐతే పర్ఫెక్ట్ గా ఉంటాయని చెబుతున్నారు. ఎందుకంటే వీరికి రొటీన్ గా చేసే పనులు అంటే పెద్దగా ఇష్టం ఉండదు.

6,15,24 తేదీలలో జన్మించిన పిల్లలు

న్యూమరాలజీ ప్రకారం వీరిని శుక్రుడు పాలిస్తూ ఉంటాడు. కాబట్టి చాలా ఆకర్షణీయంగా ఉంటారు. హోటల్ లేదా రెస్టారెంట్స్ బిజినెస్, ఎంటర్ టైన్ మెంట్ రంగాలలో ఐతే మంచి సక్సెస్ లభిస్తుందట. చిన్నతనం మంచి పేరు, ప్రఖ్యాతులు తెచ్చుకోవాలనే ఆశ ఉంటుంది.

7,16,25 తేదీలలో పుట్టిన పిల్లలు

చిన్నతనం నుండే తెలియని వాటి గురించి బాగా తెలుసుకోవడం, పరిశోధనలు, రిపేర్లు చేస్తుంటారు. వినూత్నంగా మరియు సృజనాత్మకంగా ఆలోచిస్తూ ఉంటారు. అందుకని వీరికి రీసెర్చ్ సెంటర్స్ వంటి రంగాలలో ఐతే జీవితం బాగుంటుందని చెబుతున్నారు.

8,17,26 తేదీలలో జన్మించిన వారు

ఈ తేదీలలో జన్మించిన వారి ప్రకారం వీరికి శని పాలకుడని, యుక్తవయస్సు దాటిన కొన్నేళ్ల వరకు శని ప్రభావం ఏదో రూపంలో అడ్డుగా ఉంటుందని అంటున్నారు. వీరు చూడటానికి చాలా సింపుల్ గా ఉంటారు, ఏదైనా చెప్పాలనుకుంటే ముఖం మీదే చెప్పే వ్యక్తిత్వం. ఏదైనా సరే కష్టపడే చేసే వ్యక్తిత్వం కాబట్టి ఆలస్యంగానైనా సరే సక్సెస్ వస్తుంది. పాలిటిక్స్, రియల్ ఎస్టేట్, ఫైనాన్స్ రంగాలు వీరికి సక్సెస్ అందిస్తాయి.

9,18,27 తేదీలలో పుట్టిన పిల్లలు

ఈ జన్మ తేదీల ప్రకారం అంగారకుడు వీరికి పాలకుడిగా ఉంటారు. వీరు స్పోర్ట్స్ లో బాగా రాణించగలరు. ప్రపంచంలో స్పోర్ట్స్ లో ఫేమస్ అయిన వారు ఈ తేదీలలో జన్మించినవారే. స్పోర్ట్స్ లలో కాకుండా డిఫెన్స్, కెమికల్స్, రియల్ ఎస్టేట్ రంగాలలో రాణించగలరు.

న్యూమరాలజీ ప్రకారం చేసిన పరిశోధనలను బట్టి ఈ సమాచారం ఇస్తున్నాం..ఎవరినీ బాధపెట్టాలని కాదు, మీకు నచ్చితే SHARE చేయండి..    

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon