Link copied!
Sign in / Sign up
289
Shares

పుట్టిన తేదీని బట్టి మీరు ఏ రంగంలో సక్సెస్ సాధించగలరో తెలుసుకోండి..

పిల్లలు పుట్టిన తర్వాత ఇంజినీర్ కావాలి, డాక్టర్ కావాలి, సినిమా యాక్టర్ కావాలి, బిజినెస్ లో బాగా రాణించాలి, కలెక్టర్ ఐతే బాగుంటుంది అని ప్రతి ఒక్కరూ తమ పిల్లల గురించి కలలు కంటూ ఉంటారు. ఇందులో తప్పేమీ లేకపోయినా మీ లక్ష్యాలను వారిపై రుద్దడం, బలవంతం చేయడం కూడా మంచిది కాదు. అయితే సంఖ్యాశాస్త్రం ప్రకారం పుట్టిన తేదీని బట్టి మీ పిల్లలకు ఈ రంగం ఐతే బాగుంటుందని చెబుతున్నారు సంఖ్యాశాస్త్రం పండితులు. మీ పిల్లలకు ఏది మంచిదో మీరే తెలుసుకోండి.

1,10,19,28 తేదీలలో పుట్టినవారు

ఈ తేదీలలో పుట్టినవారికి భయం అనేది ఉండదు. ధైర్యమే లక్ష్యంగా తాము సాధించాలనుకున్నది ఎన్ని అడ్డంకులు ఎదురైనా సాధిస్తారు. వీరు సూర్యుడిచే పాలించబడతారు కాబట్టి నాయకత్వ లక్షణాలు ఎక్కువ. వీరికి బిజినెస్ రంగం ఐతే బాగా సూట్ అవుతుంది మరియు ఇష్టపడతారు కూడా. ధీరూభాయ్ అంబానీ, ర తన్ టాటా, బిల్ గేట్స్, ముఖేష్ అంబానీ ఈ తేదీలలో జన్మించిన వారే.

2,11,20,29 తేదీలలో జన్మించిన వారు

చంద్రుడిచే వీరు పాలించబడతారు. చూడటానికి చక్కగా, అందంగా ఉంటారు. అందరిలా కాకుండా క్రియేటివిటీగా, కొత్తగా ఆలోచించడం చేస్తుంటారు.  వీరి జన్మ తేదీని బట్టి ఆర్ట్, పెయింటింగ్, సినిమా, యాక్టింగ్, ఫాషన్ డిజైనింగ్ బెటర్. అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, లియోనార్డో డికాప్రియో ఈ తేదీలలో జన్మించిన ప్రముఖులు.

3,12,21,30 తేదీలలో పుట్టినవారు

ఈ తేదీలను బట్టి బ్రహస్పతి వీరిని పాలిస్తూ ఉంటుంది కాబట్టి వీరికి ఆరోగ్యపరంగా, డబ్బు పరంగా ఎటువంటి ఇబ్బంది ఉండదు.  చాలా తెలివైన వారు. సొంతంగా వ్యాపారం చేయగలరు. బ్యాంకింగ్, ఫైనాన్స్, రిటైల్ బిజినెస్ లలో వీరు బాగా రాణించగలరు.

4,13,22,31 తేదీలలో జన్మించిన వారు

వీరిలో ఉన్న విషయం, ప్రతిభ ఒక్కసారిగా బయటకు కనిపించదు కానీ వీరు చాలా అసాధారణమైన వారు. వాళ్ళు చేసే పనిలో రిస్క్ ఉందని తెలిసి కూడా ముందుకు వెళ్తుంటారు. సమస్యలు ఎక్కువగానే ఉన్నా తట్టుకోగలరు. అయితే ఆర్ట్ లేదా యాక్టింగ్ రంగం అయితే వీరికి బాగా నప్పుతుందని సంఖ్యాశాస్త్రం చెబుతోంది.

5,14,23 తేదీలలో జన్మించిన వారు

త్వరత్వరగా అన్నిలెక్కలు చూసుకుని చివరి నిముషంలో అయినా సరే మంచి నిర్ణయాన్ని తీసుకోగలరు. చాలా తెలివైనవారు కాబట్టి రొటీన్ గా ఉండటానికి ఇష్టపడరు, అంతేకాకుండా రిస్క్ ఉండే పనులనే బాగా ఇష్టపడతారు. అలాగే ఎవరినైనా సులభంగా కన్విన్స్ చేయగలరు. అందుకని స్పోర్ట్స్, టెక్నాలజీ, మార్కెటింగ్ మంచిది. విరాట్ కోహ్లీ, మార్క్ జుకర్ బర్గ్ ఈ తేదీలలో పుట్టినవారే..

6,15,24 తేదీలలో జన్మించిన వారు

శుక్రుడు వీరిని పాలిస్తూ ఉంటాడు. చాలా అందంగా ఉంటారు మరియు తెలివైన వారు కాబట్టి ఏ రంగం అయినా వీరికి బాగా సూట్ అవుతుంది. ఐతే వీరికి ఇష్టమైన రంగం ప్రకారం స్పోర్ట్స్, యాక్టింగ్, హోటల్ బిజినెస్, హాస్పిటాలిటీ బెటర్. సచిన్, అనిల్ కపూర్ ఈ తేదీలలో జన్మించిన ప్రముఖులు.

7,16,25 తేదీలలో జన్మించిన వారు

ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి విశ్లేషణాత్మకంగా నిర్ణయాలు తీసుకుంటారు. అందరిలా కాకుండా డిఫరెంట్ గా, ఇంటెలిజెన్స్ గా ఆలోచించడం వీరికి ఉన్న మరో ప్రతిభ. అందుకని వీరికి రీసెర్చ్ చేసే విషయాలు, రెండు నిముషాలలో అయినా సరే మంచి నిర్ణయం తీసుకునే రంగం ఐతే మంచిది.

8,17,26 తేదీలలో జన్మించిన వారు

వీరికి 30 ఏళ్ళ వరకు అదృష్టం కాస్త తక్కువగా ఉంటుంది కష్టాలు ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు. ఎందుకంటే ఈ జన్మ తేదీని బట్టి శనిదేవత పాలిస్తూ ఉంటుంది. చాలా సింపుల్ గా ఉంటారు మరియు ఏదైనా విషయాన్ని డైరెక్ట్ గానే చెబుతారు.చాలా బాగా కష్టపడతారు అదే వారి సక్సెస్. అందుకని పాలిటిక్స్, రియల్ ఎస్టేట్, బిజినెస్, ఫైనాన్స్ వీరికి మంచివి. నరేంద్ర మోడీ, మన్మోహన్ ఈ తేదీలలో పుట్టినవారే.

9,18,27 తేదీలలో జన్మించిన వారు

ఈ తేదీల ప్రకారం అంగారకుడు పాలిస్తూ ఉంటుంది కాబట్టి స్పోర్ట్స్, డిఫెన్స్, కెమికల్స్, ఫైనాన్స్ రంగాలలో వీరు బాగా రాణించగలరు.

ఈ ఆర్టికల్ మీకు నచ్చితే అందరికీ SHARE చేయండి. 

.....................................................................................................

మహిళలందరికీ ఓ మంచి శుభవార్త..

Tinystep మీరు సురక్షితంగా ఉండటానికి ఎటువంటి కెమికల్స్ లేని సహజమైన ఫ్లోర్ క్లీనర్ ఉత్పత్తిని ప్రారంభించింది. మీ పిల్లల ఆరోగ్యకోసం, మీ ఇంట్లోకి ఎటువంటి క్రిములు చేరకుండా ఈ ఫ్లోర్ క్లీనర్ ఉపయోగపడుతుంది.

ఒక్కసారి మీ ఇంట్లో ఈ ప్రాడక్ట్ ను ఉపయోగించి, మీ విలువైన అభిప్రాయాన్ని తెలియపరచండి.

Tinystep ఫ్లోర్ క్లీనర్ ఆర్డర్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon