Link copied!
Sign in / Sign up
1
Shares

ఒకే నెలలో పుట్టిన పిల్లలకు ఒకే జబ్బులు వస్తాయా? పుట్టిన నెల మీ పిల్లల ఆరోగ్యంపై ఎలా ప్రభావం చూపుతుంది..!!

పిల్లల గురించి, వారి భవిష్యత్ ఎలా ఉంటుందో తెలుసుకుని ఆ విధంగా ప్లాన్ చేసుకునేవారు తల్లితండ్రులు. పిల్లలు పుట్టిన నెలను బట్టి, సమయం, రాశి ప్రకారం, జాతకాలు చూపించడం, హస్త సాముద్రికం ..ఇలా ఇప్పుడు కూడా ఫాలో అవుతూనే ఉన్నారు. ఐతే పుట్టిన నెల ప్రకారం పిల్లల ఆరోగ్యంపై ఎటువంటి ప్రభావాన్ని చూపెడుతుంది. పిల్లలకు జన్మను ఇవ్వడానికి సరైన నెల ఏంటని తాజాగా జరిపిన పరిశోధనల ప్రకారం కొన్ని ముఖ్యమైన వివరాలు మీకోసం..

ఒకే నెలలో పుట్టిన పిల్లలకు ఒకే జబ్బులు

1900-2000 సంవత్సరాల మధ్యలో 1,749, 4000 పిల్లలు జన్మించగా, వారు పుట్టిన నెలను కూడా రికార్డ్ చేసి పెట్టుకున్నారు. ఆశ్చర్యపరిచే నిజం ఏంటంటే దాదాపు చాలామందికి ఒకే నెలలో జన్మించిన పిల్లలకు ఒకే రకమైన జబ్బులతో బాధపడ్డారట. మొత్తం 1688 జబ్బులలో, 55 శాతం ఒకే నెలలో జన్మించిన వారు ఒకే రకమైన జబ్బులతో ఇబ్బందికి గురయ్యారని తెలిసింది. అలాగే మే-జులైలలో జన్మించిన వారు అక్టోబర్ -నవంబర్ నెలలలో జన్మించిన వారికంటే ఆరోగ్యంగా ఉన్నారని తెలిసింది.

ఏ నెలలో పిల్లలు పుట్టడం ఆరోగ్యకరం

ఆరోగ్య పరిశోధకులు తెలిపిన తాజా సమాచారం ప్రకారం నవంబర్ - ఫిబ్రవరి నెలలలో జన్మించిన పిల్లలతో పోలిస్తే ఏప్రిల్ -జులై నెలలలో పుట్టిన పిల్లలు టైప్ 1 డయాబెటిస్ తో బాధపడుతున్నారని తెలిపారు. ఇక చలికాలంలో జన్మించిన పిల్లలకు ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగా ఉంటుందని, ఆస్తమా సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి ఈ పిల్లలను కంటికి రెప్పలా అనుక్షణం కాపాడుకుంటూనే ఉండాలి. మిగతా నెలలలో పుట్టిన పిల్లలకన్నా వీరికి రోగ నిరోధక శక్తి చిన్న వయస్సులో తక్కువగా ఉండటమే ఇందుకు కారణం.

ఇది తప్పకుండా చదవండి

పైన చెప్పుకున్నట్లుగా ఏ నెలలో పిల్లలకు జన్మను ఇవ్వడం మంచిది, ఫలానా నెలలో పుట్టిన పిల్లలకు ఈ జబ్బులు వస్తాయని చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు. జాతకాలు, హస్త రేఖల ద్వారా ఎలా ఐతే నమ్ముతున్నారో వాటికంటే ఎక్కువగా కొన్ని లక్షల మంది చిన్నారులపై ఆరోగ్య పరిశోధకులు జరిపిన పరిశోధనల బట్టి, వారు రికార్డ్ చేసిన విషయాలను బట్టి చెబుతున్నదే. ఇలా ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే మీరు మంచి  ఆహారం, మంచి నిద్ర మరియు వర్కౌట్స్ అవసరం. పుట్టిన పిల్లలను జాగ్రత్తగా చూసుకోవడం అంతకన్నా ముఖ్యం.. దయచేసి అందరికీ SHARE చేయండి. 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

We have a great opportunity for you. You can EARN up to Rs 10,000/- every month right in the comfort of your own HOME. Sounds interesting? Fill in this form and we will call you.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon