Link copied!
Sign in / Sign up
3
Shares

పురుషాంగం గురించి మీరు తెలుసుకోవాల్సిన 7 విచిత్రమైన విషయాలు


మీకు పురుషాంగం ఎలా ఉంటుందో, తెలిసే ఉంటుంది. పురుషాంగం గురించి పూర్తిగా తెలుసుకోవడం చాలా అవసరం. ఆడ మెగా పరస్పర శరీర భాగాల గురించి అవగాహనా కలిగి ఉండడం అనేక సమస్యలకు పరిష్కారమవుతుంది. అందుకే మీకు పురుషాంగం గురించి తెలియని చాలా విషయాలు ఇక్కడ తెలుసుకోండి…

1. అంగస్తంభన

పురుషాంగానికి అంగస్తంభన చాలా అవసరం. ఇది అందరికి తెలిసిందే కానీ, విచిత్రమేమిటంటే కడుపులోని మగబిడ్డకు కూడా అప్పుడప్పుడు అంగస్తంభన జరుగుతుందని కొన్ని స్కాన్స్ ద్వారా తేలింది.

2. సైజు చెప్పలేం

అంగం సైజు స్తంభన జరగక ముందు జరిగిన తరువాత పూర్తి బిన్నంగా ఉంటుంది. అయితే సాధారణ స్థితిలో పెద్ద సైజు లో వున్నా అంగం, స్తంభన తరువాత కూడా అంతే పెరుగుతుంది అని చెప్పలేం. చిన్న సైజు అంగం స్తంభన తరువాత పెద్ద సైజు అవచ్చు.

3. సున్నితం

అంగం లోని తల భాగం చాలా సున్నితంగా ఉంటుంది. సెక్స్ చేసే సమయంలో, దీని మీద జరిగే రాపిడి పురుష స్కలనానికి కారణం అవచ్చు.

4. కుచించుకుపోవడం

అవును పురుషాంగం వివిధ కారణాల వలన కుంచించుకు పోతుంది. పురుష అంగంలో రక్త ప్రసరణతగ్గినప్పుడు, నాగం సెంటి మీటరు మేరకు తగ్గుతూ ఉంటుంది.

5. విరిగిపోతాయి

పురుషాంగంలో ఎముకలు లేకపోయినా, అది విరిగిపోయే అవకాశం ఉంది. విపరీతమైన సెక్స్ చేయడం. స్తంభించిన అంగంతో కింద పడడం, ఇందుకు కారణాలు.

6. వీర్యం అంటే

వీర్యం అంటే ఏంటో మీకు తెలిసే ఉంటుంది, కాని పురుష వీర్యంలో ఏముంటుందో తెలుసుకోండి. పురుష వీర్యం 96 శాతం నీరు, 2 శాతం వీర్య కణాలు. మిగతా 2 శాతం వివిధ విటమిన్లు, పోషకాలు, ఎంజైములు ఉంటాయి. ఇవన్నీ వీర్య కణానికి రక్షణ కల్పిస్తాయి.

7. 6 సెకండ్లు మాత్రమే

శృంగార చివరి అంకం అయిన భావప్రాప్తి పురుషలకు 6 సెకండ్లు మాత్రమే ఉంటుంది. కానీ మహిళలకు మాత్రం భావప్రాప్తి 23 సెకండ్ల వరకు ఉండచ్చు. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon