Link copied!
Sign in / Sign up
7
Shares

పులిపిరి కాయలు ఎందుకు వస్తాయి..? 2 రోజుల్లో వీటిని తొలగించే ఇంటి చిట్కాలు

పులిపిరి కాయలు.. వీటినే వార్ట్స్, ఉలిపిరి కాయలు అని కూడా అంటారు.  ఇవి శరీరంపై ముఖం, మెడ, కాళ్ళ మడమల మధ్య, చెస్ట్,  చంకలలో ఉండి చాలా అసౌకర్యంగా ఉంటాయి. ఇవి నొప్పిని ఐతే కలిగించవు గానీ చూసేటప్పుడు మాత్రం కాస్త ఇబ్బందికరంగా ఉంటాయి. అయితే ఈ పులిపిరి కాయలు ఎందుకు వస్తాయి?  వీటిని ఎలా దూరం చేసుకోవాలో తెలుసుకుందాం..

పులిపిర్లు ఎందుకు వస్తాయి..!!

పులిపిర్లు సాధారణంగా యుక్త వయస్సులో ఎక్కువగా వస్తుంటాయి. అయితే దీనికి ప్రధాన కారణం వైరస్ అని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. చూడటానికి ఇబ్బందికరంగా ఉండే వీటిని తొలగించడానికి ఏం చేయాలో ఇక్కడ తెలుసుకోండి.

వెల్లుల్లి

పులిపిర్లను గిల్లకుండా సహజంగా తొలగించాలంటే రెండు వెల్లుల్లి రిబ్బలను తీసుకుని గుజ్జుగా చేసుకోవాలి. ఈ పేస్ట్ ను పులిపిర్లపై ఉంచి టేప్ అంటించాలి. చుట్టుపక్కల చర్మానికి తాకకుండా చూసుకోవాలి. ప్రతి రోజూ రెండు పూటలా రెండు వారాల పాటు ఇలా చేస్తే సహజంగా పులిపిర్లు తొలగిపోతాయి.

అరటిపండు

పులిపిర్లను సహజంగా తొలగించే మరో సహజమైన చిట్కా అరటిపండు తొక్క. రాత్రి పడుకునేముందు అరటిపండు తొక్కలో కాస్త చిన్న ముక్కను తీసుకుని పులిపిర్లపై ఉంచి దాని చుట్టూ టేప్ వేసి అతికించాలి. ఇలా చేయడం వలన త్వరగా ఈ సమస్య నుండి బయటపడవచ్చు.

ఆముదం

ఆముదం చుక్కలను పులిపిర్లపై రాసి మసాజ్ చేసుకోవడం వలన మంచి ఫలితం ఉంటుంది. లేదా ఆముదాన్ని పులిపిర్లపై ఉంచి టేప్ వేసి అంటించాలి. ఇలా కొన్ని రోజుల పాటు చేసినా మంచి ఫలితం ఉంటుంది.

బంగాళదుంప

బంగాళాదుంపలను కట్ చేసుకుని పులిపిర్లు ఉన్నచోట రుద్దటం చేయాలి.  ఇలా రోజుకు రెండుసార్లు చేసినట్లయితే మంచి ఫలితం ఉంటుంది.

ఇలా చేయకూడదు

కొంతమంది పులిపిర్ల వలన చాలా ఇబ్బందిగా ఫీలవుతూ పదునుగా ఉండే ఇనుప ముక్కలు లేదా చేతులతో గిల్లడం, రక్కడం చేస్తుంటారు. ఇంకొందరు అగరబత్తితో పులిపిర్లను కాల్చడం చేస్తుంటారు కూడా. ఇలా ఎప్పుడు చేయకండి, ఇవి ఇబ్బందికరంగా మారతాయి కూడా. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon