Link copied!
Sign in / Sign up
6
Shares

డెలివరీ తరువాత ప్రతి మహిళకు ఎదురయ్యే 6 సమస్యలు వాటి పరిష్కారాలు

ప్రసవం తరువాత కూడా కొన్ని సమస్యలు దాదాపు సంవత్సరం పాటు మనల్ని వెంటాడుతాయి. వాటి నుండి మనం కోలుకోవడానికి అనుకున్నదానికన్నా ఎక్కువ పట్టవచ్చు. కానీ ఈ సులభమైన 6 మార్గాల ద్వారా సులువుగా ప్రసవానంతర సమస్యలను నివారించుకోవచ్చు.

1. ప్రసవానంతర డిప్రెషన్

ఒత్తిడితో కూడిన గర్భం ఉన్నవారిలో ప్రసవానంతర డిప్రెషన్ సాధారణంగా ఉంటుంది. మీరు మనోరోగ వైద్యుడితో మాట్లాడాలి, అణగారిన భావాలను తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. మీ భర్తతో మీ భావాలను పంచుకొని కొంత సహాయంగా ఉండమని అడగండి.

2. సి-సెక్షన్ గాయం

మీకు C- సెక్షన్ జరిగి ఉంటే, గాయం యొక్క శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. మొదటి కొన్ని నెలలు అత్యంత శ్రద్ధ అవసరం. ఆ ప్రాంతంలో మీకు దురద అనిపించవచ్చు కానీ దానిని తాకకుండా ఉండేందుకు ప్రయత్నించండి. గాయాన్ని వేగంగా నయం చేయడానికి పసుపు, కలబంద లేదా తులసి యొక్క సారాన్నీ ఉపయోగించండి. ఇన్ఫెక్షన్ అయితే మీ రొమ్ము పాల మీద ప్రభావం చూపే అవకాశం ఉంది కావున తగిన జాగ్రత్తలు తీసుకోండి.

3. ఆహారం

మీరు తినే ఆహారం గాయం మనడంలో మరియు మీ ఆరోగ్య విషయంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. మీ రోజువారీ పోషకాహార ఆహార పదార్ధాల కలిగిన ఆహరం తీసుకోవడం అవసరం. ఫైబర్, ఐరన్, విటమిన్లు మరియు పోషకాలు మీ రోజు వారి ఆహారానికి జత చేర్చండి, ఎందుకంటే అవి మీకు లాభదాయకం మరియు మీ బిడ్డకు కూడా తల్లిపాలు సంపూర్నంగా వస్తాయి.

4. బేసిక్స్ తెలుసుకోవడం

మీరు గర్భధారణ మరియు దాని తరువాత వచ్చిన ఫలితాలపై మీ పరిశోధన చేయటం చాలా ముఖ్యమైనది. గర్భం మరియు దాని ప్రభావం చాలా సున్నితమైన అంశం కావున మీ శరీరంలో జరిగే మార్పుల గురించి మీకు ఒక అవగాహన ఉండటం చాలా ముఖ్యం.

5. ప్రసవానంతర ఆందోళన

ప్రసవానంతరం ఆందోళన అత్యంత సాధారణమైనది. నిద్రలేని రాత్రులు అపారమైన పని మరియు ఒత్తిడి చాలా ఇబ్బందికి గురి చేస్తాయి. పెరుగుతున్న ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. మీరు తగినంత విశ్రాంతి పొందుతున్నారని నిర్ధారించుకోవాలి. ప్రసవానంతర ఆందోళనను అధిగమించడానికి తగిన విశ్రాంతి అవసరం.

6. వ్యాయామం

ప్రతిరోజు యోగా చేయడం వలన ప్రసవానంతర సమస్యలు సులువుగా తొలగిపోతాయి. యోగ ఒత్తిడిని తగ్గించి ఆహ్లాదకరమైన జీవితం పొందడానికి అద్భుతమైన మార్గం. కొన్ని రోజులు చేసి చుడండి ఫలితం మీకే తెలుస్తుంది. కఠినమైన వ్యాయామాలకు కొత్త కాలం దూరంగా ఉండటం మంచిది. 

.....................................................................................................

మహిళలందరికీ ఓ మంచి శుభవార్త..

Tinystep మీరు సురక్షితంగా ఉండటానికి ఎటువంటి కెమికల్స్ లేని సహజమైన ఫ్లోర్ క్లీనర్ ఉత్పత్తిని ప్రారంభించింది. మీ పిల్లల ఆరోగ్యకోసం, మీ ఇంట్లోకి ఎటువంటి క్రిములు చేరకుండా ఈ ఫ్లోర్ క్లీనర్ ఉపయోగపడుతుంది.

ఒక్కసారి మీ ఇంట్లో ఈ ప్రాడక్ట్ ను ఉపయోగించి, మీ విలువైన అభిప్రాయాన్ని తెలియపరచండి.

Tinystep ఫ్లోర్ క్లీనర్ ఆర్డర్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon