ప్రైవేట్ భాగాలలో జుట్టును తొలగించేటప్పుడు తీసుకోవాల్సిన 8 జాగ్రత్తలు
యోని ప్రాంతం చాలా సున్నితంగా ఉంటుంది. ఆ ప్రాంతంలో జుట్టును తొలిగించే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. అజాగ్రత్త వలన ఇన్ఫెక్షన్ లేదా చర్మం తెగడం లాంటివి జరగచ్చు. అందుకే ఆ ప్రాంతంలో జుట్టును తొలిగించే సమయంలో ఈ విషయాలను గుర్తుంచుకోండి.
1. వేరొకరిది వాడద్దు
రేజర్ తో జుట్టును తొలిగించేటప్పుడు, సహజంగా అంతర్గత భాగాలలో క్రిములు అధిక శాతం ఉండడం వలన అవి రేజర్ కు అంటుకుంటాయి. అలా వేరొకరు వదిన రేజర్ ను మళ్ళి మీరు వాడడం వలన ఆ క్రిముల ద్వారా మీకు ఇన్ఫెక్షన్ వ్యాపించచ్చు.
2. వాడినదే వాడద్దు
మీ ప్రైవేట్ భాగాలు చాలా సున్నితంగా ఉంటాయి. మీరు జుట్టును తొలిగించడానికి రేజర్ ను వాడే కొద్ది అది పదును తగ్గిపోతుంది. అలాంటి రేజర్ ను వాడడం వలన చర్మం తెగే అవకాశాలు ఉంటాయి.
3. క్రీమ్ లేదా సోప్
షేవ్ చేసే ముందు తప్పకుండా క్రీమ్ లేదా సోప్ వాడండి. అది మీరు షేవ్ చేసుకోడాన్ని సులభం చేస్తుంది. త్వరగా ఏ గీతాలు పడకుండా షేవ్ చేసుకోవచ్చు.
4. రివర్స్ లో వద్దు
ప్రైవేట్ భాగాలలో షేవ్ చేసేటపుడు ఎప్పుడు కూడా, జుట్టు ఎదుగుతున్న వైపే షేవ్ చేయాలి. రివర్స్ లో వెనక వైపుకు షేవ్ చేయకూడదు. అలానే చేయడం షేవింగ్ తరువాత ఆ ప్రాంతంలో మంటగా ఉంటుంది.
5. తెగినప్పుడు
షేవింగ్ చేసుకునేటప్పుడు తెగితే, దాని గిల్లడం, లేదా చేతులతో రుద్దడం చేయద్దు. ముందుగా చల్ల నీటితో కడగండి. గాయానికి హైడ్రోకార్టిసోన్ క్రీమ్ (hydrocortisone cream) వాడండి.
6. పీరియడ్స్ సమయంలో
పీరియడ్స్ సమయంలో ప్రైవేట్ భాగాలు చాలా సున్నితంగా ఉంటాయి. ఆ సమయంలో షేవింగ్ చేయడం కష్టంగా, ఇబ్బందిగా ఉంటుంది. ఆ సమయంలో షేవ్ చేయకపోవడం మంచిది.
7. కత్తిరతో అయితే
షేవింగ్ కాకుండా జుట్టును తొలిగించడానికి కత్తిరను వాడుతున్నటైతే, కొన్ని జాగ్రతలు తీసుకోవాలి. తుప్పుపట్టకుండా శుభ్రంగా ఉండే కత్తిరను ఎంచుకోండి. ఎప్పుడు కూడా కత్తిరతో జుట్టును తొలిగించేటప్పుడు సరైన వెలుతురు ఉండేలా చూసుకోండి.
