ప్రెగ్నెన్సీ టైంలో అందరూ చెప్పే ఈ మాటలు నిజమా? కాదా?
సాధారణంగా ప్రెగ్నెన్సీ సమయంలో మీకు చాలా మంది చాలా సలహాలు ఇస్తారు. వాటిలో కొన్ని నిజం ఉంటాయి కొన్ని అబద్ధాలు ఉంటాయి. అయితే, ప్రెగ్నెన్సీ సమయంలో మీరు చేసే పనులను బట్టి బిడ్డ గురించి కొన్ని విషయాలు చెప్పవచ్చు. అందులో చాలా వరకు నిజం కూడా!! అవేంటంటే,
ఇష్టాలు
మీరు ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఏ ఆహారాన్ని ఇష్టంగా తింటారో మీ పిల్లలు పెరిగి పెద్ద అయిన తర్వాత అదే ఆహారాన్ని ఇష్టంగా తింటారు. ఇది పిల్లలకు పాలు పట్టించే విషయంలో కూడా వర్తిస్తుంది. కాబట్టి మీ ఆహారపు అలవాట్లను తెలివిగా ఎంచుకోవడం ద్వారా మీ పిల్లలకు కూడా మంచి చేసిన వారవుతారు.
జుట్టు
ప్రెగ్నెన్సీ సమయంలో ఎవరైతే ఎక్కువ జుట్టును కోల్పోతారో వారికి పుట్టబోయే బిడ్డ ఎక్కువ జుట్టుతో పుడుతుంది. కాబట్టి మీకు జుట్టు రాలుతోందని బాధపడకండి ఎందుకంటే అది తిరిగి మీ బిడ్డకే వస్తుంది.
వేడినీళ్ళ స్నానం
ప్రెగ్నెన్సీ సమయంలో మహిళలు వేడి నీళ్ళతో స్నానం చేయకపోవడం మంచిది. ఎందుకంటే, నీళ్ళు 102 డిగ్రీల కన్నా ఎక్కువ వేడిగా ఉంటే కడుపులో ఉన్న పిండానికి ప్రమాదం అయ్యే అవకాశం ఉంది.
ఒత్తిడి
ప్రెగ్నెన్సీ కలిగిన మహిళలు ఎక్కువగా ఒత్తిడికి లోనైతే వారికి పుట్టబోయే బిడ్డ కూడా ఒత్తిడికి లోనై సరైన పెరుగుదల ఉండదు. అంతేకాక, ఒక్కోసారి హార్మోన్ అసమతుల్యం వల్ల బిడ్డ పుట్టడానికి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది.
చాక్లెట్
మీకు చాక్లెట్ తినే అలవాటు ఉంటే దాన్ని నిరభ్యంతరంగా కొనసాగించవచ్చు. ఎందుకంటే మంచి చాక్లెట్ తినడం వల్ల మీ మూడ్ బాగుండే అవకాశం ఉంది. ఇది బిడ్డకు కూడా మంచి చేస్తుంది.
నో వ్యాయామం
మీకు వ్యాయామం చేసే అలవాటు ఉంటే చేయకపోవడం మంచిది. ఎందుకంటే మీరు చేసే కఠినమైన వ్యాయమం వల్ల బిడ్డ పైన ప్రభావం చూపవచ్చు. అయితే కొద్దిపాటి నడక చేయవచ్చు.
అంత్యక్రియలకు దూరంగా
ప్రెగ్నెన్సీ సమయంలో మీరు అంత్యక్రియలకు మరియు రోగులకు దూరంగా ఉండటం మంచిది. ఒకవేళ వాటిని ఫేస్ చేస్తే మీకు తెలియకుండానే మీరు ముభావంగా ఉంటారు. ఇది బిడ్డపై ప్రభావం చూపుతుంది.
మతిమరుపు
ప్రెగ్నెన్సీ సమయంలో మహిళలు చాలా విషయాలు మర్చిపోతారు. దీనికి గల కారణం ఏంటంటే, మెదడులో విడుదల అయ్యే కొన్ని హార్మోన్స్ వల్ల కొన్ని మర్చిపోతుంటారు. అయితే ఇది కేవలం కొన్ని రోజులు మాత్రమే.
మంచి వాతావరణం
మీరు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంటే ఆ ప్రభావం బిడ్డ మీద కూడా ఉంటుంది. బిడ్డ ఎదుగుదలకు ఇది తోడ్పడుతుంది. అందుకే శబ్ధాలు లేకుండా ప్రశాంతమైన వాతావరణం ఉండేలా చూసుకోండి.
నో కాఫీ
మీరు ప్రెగ్నెన్సీ సమయంలో కాఫీకి నో చెప్పండి. ఎందుకంటే మీరు ఎక్కువ కాఫీ తీసుకోవడం వల్ల బిడ్డ మెటబాలిజం దెబ్బ తినే అవకాశం ఉంది. కాబట్టి కాఫీ తాగకపోవడం మంచిది. అయితే ఒక రోజుకు కేవలం 200 మిల్లీ గ్రాములకు మించకుండా కాఫీని తీసుకుంటే బిడ్డకు ఎలాంటి ముప్పూ ఉండదు.
పైవిషయాలన్నిటినీ కూడా మీరు ప్రెగ్నెన్సీ సమయంలో చాలామంది ద్వారా వినే ఉంటారు. ఇవన్నీ నిజమని వైద్యశాస్తం చెప్తోంది.
ఈ ఆర్టికల్ అందరికీ ఉపయోగపడుతుంది అని మీకు అనిపిస్తే వెంటనే LIKE చేయండి SHARE చేయండి. మరిన్ని విషయాలు తెలుసుకోవాలన్నా, ఈ ఆర్టికల్ పై మీరు COMMENT చేయవచ్చు.
ఇవి కూడా చదవండి.
భార్యల స్ట్రెచ్ మార్క్స్ గురించి భర్తలు ఏమనుకుంటారు : 8 మంది భర్తలు మాతో పంచుకున్న విషయాలు
