Link copied!
Sign in / Sign up
4
Shares

ప్రెగ్నన్ట్ గా ఉన్నప్పుడు మీ అందం పెరుగుతుందని మీకు తెలుసా?

ప్రెగ్నన్సీ అనేది ఆడవారు మాత్రమే అనుభూతి చందే ఒక అందమైన ప్రయాణం. ఈ ప్రయాణంలో ఒడిదుడుకులు ఉండచ్చు కానీ ఒక్క సారి మన బిడ్డ పుట్టి వారిని చూడగానే ఒడిదుడుకులు కూడా మధుర జ్ఞాపకంగా మారిపోతాయి.  అంతే కాకుండా ప్రెగ్నన్సీ సమయములో మీరు మరింత అందంగా తయారు అవుతారు. మీ అందం ఎలా పెరుగుతుందో ఇక్కడ చూడండి.

1. ముఖ వచ్చస్సు, కాంతి పెరుగుతుంది

రెండవ త్రైమాసికంలో, మీ ముఖం లో కాంతి మరియు కల పెరగడం మీరు గమనించవచ్చు. చూసిన ప్రతి ఒక్కరు మీ అందాన్ని అభినందించకుండా ఉండలేరు. శరీరంలో ఉత్పత్తి అవుతున్న హార్మోన్స్ ఈ ముఖ కంతికి కారణం.

2. ధృడమైన మరియు నల్లటి జుట్టు

మీరు గర్భం దాల్చిన తరువాత, శరీరంలో పెరిగే ఈస్ట్రోజెన్ హార్మోన్లు జుట్టు రాలడాన్ని పూర్తిగా నివారిస్తాయి. అందువలన మీ జుట్టు నల్లగా మరియు ధృడంగా మారుతుంది.

3. గోర్లు వేగంగా పెరుగుతాయి

మీకు గోర్లు పెంచుకునే అలవాటు ఉందా, గోర్లని అలంకరించుకోవడమంటే ఇష్టమే? అయితే ప్రెగ్నన్సీ సమయంలో మీరు చాలా ఆనందిస్తారు. ఎందుకంట ఈ టైం లో గొర్ల పెరుగుదల అమోఘంగా ఉంటుంది. అంతే కాకుండా గోర్లు మంచి రూపంలో ఆకర్శణీయంగా అవుతాయి. ఇంకెందుకు ఆలస్యం మీ గొర్ల మీద పలు డిజైన్స్ తో ప్రయోగం చేయండి.

4. పాల బుగ్గలు, రోజా పువ్వు రేకుల్లాంటి పెదాలు

ఒక వేళ మీరు చిన్నపట్నుండి సన్నగా ఉన్నారు మీకు బుగ్గలు లేవు అనుకోండి, ప్రెగ్నన్సీ సమయంలో వచ్చేస్తాయి. మిమల్ని మీరే నమ్మలేరు అంత బాగా ఉంటాయి. ముట్టుకుంటే కందిపోయేలా అని సినిమాల్లో అంటారే ఆలా అనమాట. పెదాలు కూడా చాలా మృదువుగా, ఆకర్శణీయంగా మారుతాయి.

5. శరీరాకృతి

అదేంటి శరీరాకృతి అనుకుంటున్నారా. అదేనండి, పొట్ట తప్ప మిగిలిన శరీరం అంతా తాజాగా ఫిట్ గా ఉంటుంది. నమ్మండి, మొదటి సారి మీ శరీరం అంతా జీవం ఉన్న భావన కలిగి ఎంతో సంతోషంగా ఉంటుంది. డాక్టర్లను చెప్పిన చిన్న చిన్న వ్యాయామాలు చేస్తూ ఉంటె మీ శరీరం మరింత అందంగా మారుతుంది.

6. మృదువైన చర్మం

అదేదో సోప్ యాడ్ లో చెప్పినట్టు మీ చర్మాన్ని మీ భర్త తాకుతూనే ఉండిపోతారు. ఎందుకంటే, మీ చెర్మం అంత మృదువుగా, లేతగా మారుతుంది. మీరు కూడా ఈ మార్పుని చూసి ఆనందిస్తారు.

7. ఎద అందాలు 

ఒక్క సారి పాలు పట్టడం అర్రంభమైన తరువాత ఎదభాగం గుండ్రంగా, నిండుగా మారుతాయి. ఎలాంటి బట్టలు వేసుకున్నా శరీరాకృతి వలన అందముగా కనపడుతారు.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon