Link copied!
Sign in / Sign up
0
Shares

నిండు గర్భవతిని 7 కి.మీ దుప్పటితో హాస్పిటల్ కు మోసుకెళ్లిన గ్రామస్థులు : ఫోన్ చేస్తే అంబులెన్స్ రాదని చెప్పారు, వైరల్ అయిన ఫోటోలు

మనిషి అడవుల్లో జీవనం సాగించడం నుండి అంతరిక్షంలో స్పేస్ సిటీలు నిర్మించే స్థాయి వరకూ అభివృద్ధి చెందాడు. టెక్నాలజీ లో ఎంతో ముందుకు పోతున్నాం కానీ మానవత్వం మాత్రం అంతకంతకూ దిగజరిపోతూనే ఉన్నాం. కానీ ఇప్పటికీ కొన్ని ప్రాంతాల ప్రజలకు కనీస సౌకర్యాలు కూడా అందట్లేదు. సరైన రోడ్లు ఉండవు, హాస్పిటల్స్ ఉండవు అయినా వారు కూడా మనం బ్రతుకున్న ఈ సమాజంలోనే ఉంటున్నారు. కేరళలో అత్తపడి అనే గ్రామంలో కన్నీరు పెట్టించే సంఘటన ఒకటి జరిగింది.

నిండు గర్భంతో ఉన్న ఒక స్త్రీని దుప్పటిలో ఉంచి కర్రల సాయంతో నలుగురు మగవాళ్ళు 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న హాస్పిటల్ తీసుకెళ్లారు. అంబులెన్స్ కోసం హాస్పిటల్ కి ఫోన్ చేయగా అక్కడికి రోడ్లు లేవు అని చెప్పి వాహనాన్ని పంపలేదు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందులో నలుగురు మగవాళ్ళు రాళ్లురప్పలు మధ్య నుండి అసలు కాలి బాట కూడా సరిగ్గా లేని దారిలో ఆమెను తీసుకెళ్తున్నారు. వారికి తోడుగా ఇంకో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లోనే వారు దారిలో చిన్నపాటి నదిని కూడా దాటుకుని వెళ్లారు. కొంత దూరం వెళ్ళాక ఒక ప్రైవేట్ వాహనాన్ని సమకూర్చుకుని దగ్గర్లో ఉన్న గిరిజన ప్రభుత్వ హాస్పిటల్ కి చేరుకున్నారు. వెళ్ళీ వెళ్ళగానే పురిటి నొప్పులతో అవస్థలు పడుతున్న మహిళ ఆడబిడ్డకి జన్మనిచ్చింది.

దీని తర్వాత హాస్పిటల్ సిబ్బంది మాట్లాడుతూ "అంబులెన్స్ పంపుదాం అనుకునే లోపే వారు వేరే వాహనాన్ని మాట్లాడుకున్నారని తెలిసింది" అని వారి తప్పును కప్పిపుచ్చుకునేందుకు చూస్తున్నారు. సరే ఇవన్నీ ఎలా ఉన్నా కానీ కేరళ లాంటి అభివృద్ధి చెందిన మరియు అత్యధిక అక్షరాస్యత కలిగిన రాష్ట్రంలో ఇంకా ఇలాంటి ప్రాంతాలు ఉన్నాయంటే నమ్మశక్యంగా లేదు.

ఏదేమైనా అభివృద్ధి సంగతి పక్కన పెడితే కనీసం అప్పటి అవసరాన్ని, ఆమె పరిస్థితిని చూసి స్పందించాలి అనిపించని వారిని చూస్తే మనిషి విలువలు, మానవత్వం ఎందుకింత పతనం అవుతున్నాయి అనిపిస్తుంది.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon