ప్రెగ్నన్సీతో ఉన్నపుడు వ్యాయామం చేయడం వలన కలిగే అద్భుతమైన 6 ప్రయోజనాలు
మాములుగా ఉన్నపుడు మీ శరీరానికి వ్యాయామం ఎంత అవసరమో...ప్రెగ్నన్సీతో ఉన్నపుడు ఇంకొంచెం ఎక్కువ అవసరం. మీరు ఆరోగ్యంగా ఉండడం కడుపులో శిశువును కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. కానీ చాలామంది ప్రెగ్నన్సీ తో ఉన్నపుడు వ్యాయామం చేయడానికి అంత ఇంట్రెస్ట్ చూపించరు. మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోడానికి ..... ప్రెగ్నన్సీతో ఉన్నపుడు వ్యాయాయం చేయడం వలన కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఏంటో తెలుసుకోండి….
1.ప్రెగ్నన్సీ తరువాత ఎక్కువ బరువు పెరగరు
సాధారణంగా ప్రెగ్నన్సీ తరువాత బరువు పెరుగుతారు. కానీ మీరు ప్రెగ్నన్సీతో ఉన్నపుడు వ్యాయామాన్ని కొనసాగిస్తే మరి అంత బరువు పెరగరు. అంతేకాకుండా ప్రెగ్నన్సీ తరువాత బరువు తగ్గడం కూడా సులభంగా ఉంటుంది.
2.కాన్పును సులభం చేస్తుంది
మీరు ప్రెగ్నన్సీ తో ఉన్నపుడు చిన్న చిన్న వ్యాయామాలు చేయడానికి ప్రయత్నించండి. అలా చేయడం వలన మీ స్టామినా, ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. దీని వలన మీ కాన్పు సులభంగా జరగడానికి వీలు ఉంటుంది.
3.పెరిగిన బరువు గురించి మర్చిపోతారు
స్విమ్మింగ్, ప్రెగ్నన్సీతో ఉన్నపుడు సులభంగా చేయకలిగిన ఒక మంచి వ్యాయామం. మీ జాయింట్స్ మీద, కడుపులో శిశువు మీద వత్తిడి ఉండదు. ఇలాంటి వ్యాయామాలు ప్రెగ్నన్సీతో ఉన్నపుడు చేయడం వలన బరువు పెరుగుతున్నట్టు అనిపించదు.
4.ప్రశాంతత కలుగుతుంది
ప్రెగ్నన్సీ సమయంలో శరీరంలో చాలా హార్మోన్స్ విడుదలవుతుంటాయి. వీటి వలన మీరు తీవ్రమైన భావవోద్వేగాలకు లోనవుతారు, వత్తిడికి గురవుతారు.ఇలాంటప్పుడు వ్యాయామం చేయడం మిమ్మల్ని చాలా ప్రశాంతంగా ఉంచుతుంది.
5.నొప్పులు తగ్గిస్తుంది
మీ కాళ్ళు, కండరాలు కదిలేలా చిన్న చిన్న వ్యాయామాలు చేయడం అంటే వాటిని నొప్పులకు సిద్దపరుస్తున్నాం అని అర్ధం. అందుకే వ్యాయామం చేయడం, డెలివరీ అప్పుడు మీరు ఎదురుకోవాల్సిన నొప్పులను తగ్గిస్తుంది.
6.మంచి నిద్ర
ప్రెగ్నన్సీ సమయంలో సరైన నిద్ర చాలా అవసరం. కానీ చాలా మందికి ప్రెగ్నన్సీ అప్పుడు నిద్ర పట్టక పోవడం పెద్ద సమస్య. ఈ సమస్యకు పరిష్కారం వ్యాయామం చేయడం.
గమనిక :
1.మీరు ప్రెగ్నన్సీతో ఉన్నపుడు వ్యాయామం మొదలు పెట్టె ముందు డాక్టర్ సలహా తప్పకుండా తీసుకోండి
2.కడుపులో బిడ్డ మీద భారం పడని తేలికైనా వ్యాయామాలు మాత్రమే ఎంచుకోండి