Link copied!
Sign in / Sign up
32
Shares

గర్భంతో ఉన్నప్పుడు ప్రతి మహిళకు ఎదురయ్యే 5 సమస్యలు : ఈ సులువైన పరిష్కారాలు గుర్తుపెట్టుకోండి..

గర్భవతిగా ఉన్నప్పుడు ఎన్నో అనుమానాలు మరెన్నో అపోహలు. అందుకే కనిపించిన ప్రతి ఒక్కరిని సలహాలు అడుగుతుంటారు.  శరీరంలో జరిగే మార్పుల వల్ల చాలా సమస్యలు రావచ్చు. కొన్ని సమస్యలు ఎవరికీ చెప్పను కూడా లేరు. వాళ్ళల్లో వల్లే మధనపడుతుంటారు. కాని భయపడకండి, ఇది చాలా సాధారణం, ప్రతి  గర్భిని స్త్రీ కి ఉంటాయి. అవేంటో తెలుసుకుంటే, అనవసరంగా భయపడాల్సిన అవసరం రాదు.

గర్భం దాల్చిన సమయములో ఎదురయ్యే 11 ఇబ్బందికర సమస్యలు
 1.గ్యాస్ సమస్య

ఈ సమస్యతో ఎక్కువశాతం గర్భిని స్త్రీలు బాధపడుతుంటారు. గర్భం దాల్చినప్పుడు గ్యాస్ని ఆపలేరు, దాని వల్ల అనుకోని సమయాల్లో, అనుకోని ప్రదేశాల్లో, ఇబ్బందులు జరుగుతుంటాయి. ఇది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది.  అవతలి వాళ్ళు ఏమనుకుంటారో అని అలోచించి బాధపడుతుంటారు. కానీ బాధ పడాల్సిన అవసరంలేదు. గర్భవతికి ఇది సహజం అని అందరు అర్థం చేసుకోగలరు.

 2.చమట సమస్య

శరీరం అధిక శ్రమకు గురి అవుతుండడంతో , వేడి పెరిగి చమట ఎక్కువుగా రావచ్చు. అది మీ వంటిమీద పేరుకుపోయి అసహ్యంగా కనపడొచ్చు. ఇది కూడా సహజమే, అనవసరంగా అలోచించి కంగారుపడకండి

 ౩. మూత్రం - ఆపుకోలేకపోవటం

ఇది మరొక ఇబ్బందికరము అయిన సమస్య. మూత్ర౦ తన ప్రమేయం లేకుండానే కారిపోతుంటుంది. ముఖ్యంగా తుమ్మినప్పుడు, తగ్గినప్పుడు, ఇలా జరగవచ్చు. లోదుస్తులు వేసుకుంటే ఈ సమస్యనుండి బయటపడొచ్చు.గర్భవతిగా ఉన్నప్పుడు అందరిలోకి వెళ్ళాల్సి వస్తే కచ్చితంగా లోదుస్తులు వేసుకోవడం మంచిది.

 4.అధిక ఉమ్మినీరు

గర్భాం దాల్చిన సమయంలో ఉన్నినీరు ఎక్కువుగా ఉత్పత్తి అవుతుంది. దీనితో గర్భవతులు ఎక్కువ సార్లు ఉమ్మల్సి వస్తుంది. అప్పుడు చూసే వాళ్ళు ఏమనుకుంటారో అనుకోని బాధపడుతుంటారు. అవసరం లేదు, మీ సమస్య వాళ్ళకి తెలుసు, భయపడకండి, అస్సలు ఆలోచించకండి.

 5.అవాంచిత రోమాలు - జుట్టు పెరగడం

గర్భవతిగా ఉన్నపుడు మన శరీరంలో అదికంగా జుట్టు పెరుగుతుంది, అందువల్లే బుల్లి బుల్లి మీసాలు రావడం లాంటివి జరుగుతుంటాయి. కంగారుపడకండి. ఈ రోజుల్లో అవాంచిత రొమాలను తొలగించుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి కదా.

 6.మూలవ్యాధి

ఇది ఇబ్బందికరము అయిన సమస్య మాత్రమే కాదు, చాలా నొప్పిని కలిగించేది కూడా. కాబట్టి, దీన్ని దరికి రాకుండా చూసుకోవడం మంచిది. ఎక్కువ నీళ్లు తాగడం వల్ల ఈ సమస్యను దరికి రాకుండా చేయవచ్చు. ఒక వేల మీరు ఈ సమస్యతో బాధపడుతుంటే మాత్రం, యాంటి ఇంఫ్లిమేటరి క్రీమ్ వాడండి. అది కొ౦తవరకు ఉపశమనం కలిగిస్తుంది.

 7.మొటిమలు

గర్భవతిగా ఉన్నప్పుడు మీకు యుక్తవయ్సులోల ముఖము నిండా మొటిమలు రావచ్చు. ఇది హార్మోన్లు ఎక్కువ మోతాదులో విడుదల కావడం వలన జరుగుతుంది. ఈ సమస్యను కుడా ఎక్కువ నీరు తాగడం ద్వారా నివారించవచ్చును.

 8.ముఖవచ్చస్సు తగ్గడం

సాధారణంగా గర్భవతుల ముఖం నల్లగా మారుతుంది. అధిక మోతాదులో ఈస్త్రోజన్ విడుదల దీనికి కారణం. మంచి విషయం ఏమిటంటే, కాన్పు తర్వాత మీ రంగు, ముఖవచస్సు తిరిగి వచేస్తాయి. కాబట్టి బాధపడకండి.

 9.మల బద్ధకం

అసలే గ్యాస్ సమస్యతో బాధపతున్న వారికి మల బద్ధకం తోడితే చాలా ఇబ్బందిగా ఉంటుంది. కొన్ని సార్లు బాత్రూంలో గంటలు గడపాల్సివస్తుంది, అయినా ప్రయోజనం ఉండకపోవచ్చు. చాలా చిరాకు తెప్పించే ఈ సమస్యని బాగా పీచు పదార్థం కలిగిన ఆహారం తీసుకుంటే నివారించవచ్చు.

 10.పాలు కారడం

అదేంటి అనుకుంటున్నారా, అవునండి, ఒక్కోసారి కాన్పుకు ముందే పాలు రావడం మొదలవుతుంది. చాలదనట్టు, పాలు కారడం కూడా జరగొచ్చు. అందరిలో ఉన్నప్పుడు ఇలా జరిగితే, ఆ ప్రదేశం లో తడి అయ్యి వికారముగా కనిపిస్తుంది. అందువలన, ఈ సమస్య మీకు ఉన్నట్టు అయితే లోదుస్తులు తప్పక ధరించండి.

 11.భర్తతో అలా.. 

కడుపుతో ఉన్నప్పుడు కోరికలు తగ్గొచ్చు లేదా పెరగొచ్చు. కొన్ని సార్లు వింత వింత కోరికలు కూడా రావొచ్చు. భయపడకండి. ఇది సహజమే. మీ భర్తతో మాట్లాడితే అన్నీ సర్దుకుంటాయి.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon