Link copied!
Sign in / Sign up
132
Shares

ప్రెగ్నన్సీతో ఉన్నప్పుడు ప్రతి భార్య తన భర్త నుండి కోరుకునే 7 విషయాలు ఇవే...

ప్రగ్నెన్సీ అనేది కీలకమైన ఘట్టం. ఆ సమయంలో మీ పాత్ర ఎంత ఉందో మీ భర్త పాత్ర కూడా అంతే  ఉంటుంది. ఆ సమయంలో మిమ్మల్ని అతను పూర్తిగా అర్థం చేసుకోవాలి మరియూ మద్ధతునివ్వాలి. కొన్ని విధాల ద్వారా మీ భర్త మీకు సహయం చేస్తూ మీకు మద్ధతుగా నిలవవచ్చు. అవేంటంటే,

మిమ్మల్ని అర్థం చేసుకోవడం ద్వారా

ప్రగ్నెన్సీ సమయంలో మహిళల శరీరంలో హార్మోన్ల సమతుల్యం లోపిస్తుంది. దీని ద్వారా ఆమె మూడ్ తరచూ మారుతుంది దీనిని భర్తలు అర్థం చేసుకోవాలి. ఇన్నీ రోజులు ఆమెకు ఇష్టమైన ఫుడ్ ఇప్పుడు ఇష్టం లేనిదిగా అవ్వచ్చు, కాబట్టి ఆమెకు ఏ ఆహారం ఇష్టమో తెలుసుకొని సమకూర్చడం భర్తల కర్తవ్యం.  ఈ సమయంలో ఆమె శరీరంలో, ఆమె ప్రవర్తనలో చాలా మార్పులు వస్తాయి వీటన్నిటినీ కూడా భర్తగా మీరు అర్థం చేసుకోవాలి.

ఓపిక కలిగి ఉండాలి

ఆమె మూడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేము కాబట్టి, దానికి తగ్గట్లుగా మీరు నడుచుకోండి. ఆమె ప్రవర్తనలో మార్పు కనిపించినా ఒపైకగా ఉండండి. ఆమె ఏదైనా అడిగితే కాదనకుండా చేయడం ద్వారా ఆమెకు మీరు నైతిక మద్ధతు ఇచ్చిన వారు అవుతారు. ఈ సమయంలో ఆమెను ఎక్కువగా అర్థం చేసుకోవాల్సిన మనిషి మీరే అని గుర్తించండి.

ఆమెకు భరోసాగా ఉండండి

ప్రగ్నెన్సీ సమయంలో ఆమె శరీరంలో విపరీతమైన మార్పులు వస్తాయి తద్వారా ఆమె ముందులాగా ఆకర్షణీయంగా ఉండలేదు. కాబట్టి ఒక భర్తగా మీరు ఆమెను చాలా అందంగా ఉన్నావని, ముందు కన్నా ఇప్పుడే బాగున్నావని అనడం వల్ల ఆమెలో ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. అందం తగ్గుతోందన్న భావనను ఎట్టి పరిస్థితులోనూ రానివ్వకపోవడం కూడా మగవారి బాధ్యతే.

మరింత సన్నిహితంగా ఉండండి

ప్రగ్నెన్సీ సమయంలో వచ్చే మార్పుల వల్ల మహిళలు ఎక్కువ సెక్స్ కావాలని కోరుకుంటారు. దీనిని భర్తగా మీరు అర్థం చేసుకొని ఆమెతో శృంగారాన్ని కొనసాగించండి. అయితే వైద్యుల సలహాలను తప్పక పాటించండి. శృంగారం చేయడం వల్ల ఆమెలో చురుకుదనం వచ్చే అవకాశం కూడా ఉంది.

ఆమెను ప్రోత్సహించండి

ప్రగ్నెన్సీ సమయంలో ఆమెకు ప్రోత్సాహం అవసరం ఉంటుంది. ఒక భర్తగా మీరు ఆమెను ప్రోత్సహించాలి. మిమ్మల్ని ఆమె బాగా చూసుకున్నప్పటి ఙ్ఞాపకాన్ని గుర్తు చేయడం, నువ్వో గొప్ప అమ్మ అవ్వబోతున్నావవి ఆమెతో తరచూ అనడం వంటివి చేయడం వల్ల ఆమెలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించవచ్చు. అంతేకాక, ఆమెకు ఇష్టమైన పనులు చేయడానికి ఆమెను ప్రోత్సహించండి.

ప్రణాళికలు వేయండి

ప్రగ్నెన్సీ సమయంలో మహిళలకు కొంత దిగులు ఉంటుంది. ఒక భర్తగా మీరు ఆమె విచారణను పోగొట్టాలి. తరచుగా డాక్టర్ దగ్గరకు వెళ్ళడం, పరీక్షలు చేయించడం వంటివి చేయడం ద్వారా ప్రసవం సుఖంగా జరుగుతుందని ఆమె బావిస్తుంది. ఆమె కోసం అదేపనిగా షాపింగ్ చేయడం, పుట్టబోయే బిడ్డ కోసం ఏ పేరు పెట్టాలని ముందే నిర్ణయించుకోవడం వంటి ప్రణాళికలు వేస్తే ఆమె మీద మీరు చూపిస్తున్న ప్రేమకు చాలా ఆనందపడుతుంది.

మీ సంపూర్ణ మద్ధతు ఇవ్వడం

చివరగా, ప్రసవ సమయంలో ఆమెకు మీరు సంపూర్ణ మద్ధతు ఇవ్వాలి. ఆమె డెలివరీ సమయంలో మీరు ఆమె దగ్గర కచ్చితంగా ఉండేలా చూసుకోండి. ఆ సమయంలో ఆమె ఏది అడిగినా చేయండి. ఆ సమయంలో ఆమె నిస్సహాయురాలిగా మారుతుంది కాబట్టి మీ అండ ఆమెకు ధైర్యాన్ని కలిగిస్తుంది. ఆమె ఒక మనిషికి జన్మనిస్తోందన్న విషయం గుర్తించి ఆమెకు తగ్గట్లుగా మీరు నడుచుకోండి.

ప్రగ్నెన్సీ సమయంలో ఒక భర్తగా మీరు ఇవన్నీ చేయాలని గుర్తించుకోండి.

.....................................................................................................

మహిళలందరికీ ఓ మంచి శుభవార్త..

Tinystep మీరు సురక్షితంగా ఉండటానికి ఎటువంటి కెమికల్స్ లేని సహజమైన ఫ్లోర్ క్లీనర్ ఉత్పత్తిని ప్రారంభించింది. మీ పిల్లల ఆరోగ్యకోసం, మీ ఇంట్లోకి ఎటువంటి క్రిములు చేరకుండా ఈ ఫ్లోర్ క్లీనర్ ఉపయోగపడుతుంది.

ఒక్కసారి మీ ఇంట్లో ఈ ప్రాడక్ట్ ను ఉపయోగించి, మీ విలువైన అభిప్రాయాన్ని తెలియపరచండి.

Tinystep ఫ్లోర్ క్లీనర్ ఆర్డర్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon