Link copied!
Sign in / Sign up
2
Shares

ప్రెగ్నన్సీతో ఉన్నప్పుడు, ఆ తరువాత, జరిగే వాజినల్ డిశ్చార్జ్ (యోని స్రావాలు): కారణాలు, లక్షణాలు, నివారణ


ప్రెగ్నన్సీ తో ఉన్న సమయంలో, డెలివరీ తరువాత యోని నుండి ద్రవాలు(వాజినల్ డిశ్చార్జ్) రావడం సహజం. కానీ అవి ఎందుకు వస్తున్నాయి, ఎన్ని రకాల ద్రవాలు యోని నుండి స్రవిస్తున్నాయి, వాటి గురించి వివరాలు చాలా మందికి తెలీదు. యోని నుండి స్రవించే కొన్ని రకాల ద్రవాలు, ప్రమాదకరమైన జబ్బులకు లక్షణాలు కావచ్చు. అందుకే వాజినల్ డిశ్చార్జ్ కారణాలు, పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి…

1. ఈస్ట్ ఇన్ఫెక్షన్ (Yeast infection)

దీని గురించి మీరు కూడా వినివుంటారు. చాలా వరకు యోని నుండి ద్రవాలు రావడానికి ఇదే కారణం. ఈ ద్రవం వాసన రాదూ, తెలుపు రంగులో ఉంటుంది. దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు. హార్మోన్ల అసమానతలు (harmonal imbalances) వలన ఇలా జరుగుతుంది. సరైన వైద్యంతో దీన్ని పూర్తిగా నయం చేయచ్చు.

2. లైంగికంగా వ్యాపించిన వ్యాధులు (STDs - Sexually Transmitted Diseases)

మహిళల్లో జరిగే వాజినల్ డిశ్చార్జ్ కి రెండవ సహజమైన కారణం లైంగికంగా వ్యాపించిన వ్యాధులు (STDs - Sexually Transmitted Diseases). దీని కారణంగా యోని నుండి స్రవించే ద్రవం పసుపు లేదా పచ్చ రంగులో ఉంటుంది. భయంకరమైన వాసన వస్తుంది. మహిళల్లో సహజంగా వచ్చే త్రైచోమోనియాసిస్ (trichomoniasis) అనే STD వ్యాధి ఈ డిశ్చార్జ్ కి కారణం. ఈ లక్షణాలు ఉన్నప్పుడు మీ గైనకాలజిస్ట్ ను వెంటనే కలవండి

3. బ్యాక్టీరియల్ వాజినోసిస్ (BV - Bacterial Vaginosis)

యోని లో బాక్టీరియా ప్రభావం తీవ్రమైనప్పుడు, ఈ సమస్య వస్తుంది. దీని కారణంగా యోని నుండి స్రవించే ద్రవం, బూడిద తెలుపు రంగులో ఉంటుంది. నీచు వాసన వస్తుంది. దీనిని ముందే గుర్తించి, సరైన వైద్యం పొందక పోతే, గర్భాశయ సమస్యలు వస్తాయి.

4. అమ్నియోటిక్ ద్రవాలు (Amniotic fluids)

గర్భాశయంలో అమ్నియోటిక్ ద్రవాలు ఉంటాయి. గర్భంతో ఉన్నప్పుడు శిశువుకు కావాల్సిన పోషకాలను, రోగనిరోధక శక్తిని, అందిస్తాయి. ప్రెగ్నన్సీ తో ఉన్న 36 వరాల వరకు, ఈ ద్రవం డిశ్చార్జ్ అవుతుంది. ఆ తరువాత కూడా డిశ్చార్జ్ అవుతుంటే దానిని ఒలిగోహైడ్రమ్నియోస్ (oligohydramnios) అంటారు. ఇలా జరిగితే మీ గైనకాలోజిస్ట్ను కలవండి.

5. లోచియా (Lochia)

డెలివరీ అయిన తరువాత, యోని నుండి ఈ ద్రవం వస్తుంది. ఇది లేత ఎరుపురంగులో ఉంటుంది. డెలివరీ అయిన 10 రోజుల తరువాత పసుపు రంగులో స్రవిస్తుంది. తరువాత పూర్తిగా ఆగిపోతుంది. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon