Link copied!
Sign in / Sign up
6
Shares

ప్రెగ్నన్సీతో ఉన్న మహిళలకు ఎంత నిద్ర అవసరం?

ప్రెగ్నన్సీ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అందరికి తెలిసే ఉంటుంది. ఆహరం నుండి మీరు వేసుకోవాల్సిన బట్టలు వరకు ప్రతి చిన్న విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ మీరు అంతగా  శ్రద్ధ  పెట్టని ఒకే ఒక్క విషయం నిద్ర. ప్రేగ్నన్ట్ అయ్యామనే ఆనందంలోనో లేదా ఇంకేదో సమస్య వలన నిద్రను నిర్లక్ష్యం చేస్తారు. కానీ అలా చేయడం మీకు, మీ కడుపులోని బిడ్డకు మంచిది. ప్రెగ్నన్సీ సమయం లో నిద్ర ఎందుకు కీలకపాత్ర పోషిస్తుంది. అది ఎలానో ఇక్కడ తెలుసుకోండి...

1. ఏమి చేయలేరు

గర్భవతులు అనే కాదు ఎవ్వరికైనా సరే నిద్ర అనేది చాలాప్రసవం మిమ్మల్ని శారీరకంగా చాలా కృశింపచేస్తుంది. దీనిని ఎదురుకోవాలంటే ప్రెగ్నన్సీ సమయంలో తగినంత నిద్ర పొందడం ఉత్తమమైన మార్గం అవసరం. మనుషులు నీరసంగా ఉన్నపుడు ఊరికే చికాకు పడుతారు మరియు ఏ పని సరిగ్గా చేయలేరు.

2. రక్త పోటు 

నిద్రలేమి రక్తపోటు ని పెంచుతుంది. గర్భిణీ స్త్రీలకు విశ్రాంతి చాలా అవసరం. ఎందుకంటే రానున్న పరిస్థితులను ఎదురుకునే శక్తీ ని విశ్రాంతి కలిగిస్తుంది. ప్రసవం మిమ్మల్ని శారీరకంగా చాలా కృశింపచేస్తుంది. దీనిని ఎదురుకోవాలంటే ప్రెగ్నన్సీ సమయంలో తగినంత నిద్ర పొందడం ఉత్తమమైన మార్గం. పరిశోధనలు రోజుకి ఐదు గంటల కన్నా తక్కువ నిద్రపోతే ప్రసవ సమయం ఎక్కువగా ఉంటుంది లేదా సిజేరియన్ చేయవలసి వస్తుంది.

3. అలవాటు చేసుకోండి

అప్పుడే పుట్టిన పిల్లలతో ఇంటికి వచ్చిన సమయము లో ఎంతో అలసటగా ఉంటుంది. అందువలన ఆఖరి ట్రైమిస్టర్ నుండే సరిగ్గా నిద్రపోవడం అలవాటు చేసుకుంటే పిల్లలు పుట్టి ఇంటికి వచ్చాక పెద్దగా ఇబ్బందిగా అనిపించదు. ఒకసారి మీ శిశువు ఇంటికి వచ్చాక రోజుకి 8-12 సార్లు అయినా పాలు ఇవ్వాల్సి వస్తుంది, అది మీ నిద్రను ప్రభావితం చేస్తుంది. పాలు ఇవ్వడం తో పాటు డైపర్ మార్చడం మరియు ఇతరపనులన్ని చేసుకుంటే ఇంక మీరు నిద్రపోయినట్లే.

తప్పకుండా మీ కుటుంబ సభ్యులు మీకు సహాయాన్ని అందిస్తారు కానీ ఎందుకైనా ముందు గానే అన్నిటికి తయారు అయ్యి ఉండటం మంచిదే కదా. అలాగే ప్రగ్నన్సీతో ఉన్నప్పుడు చేయకూడని మరియు చేయవల్సిన 14 పనుల గురించి తెలుసుకోండి..

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon