Link copied!
Sign in / Sign up
2
Shares

ప్రగ్నన్సీతో ఉన్నప్పుడు మీరు కనపడేదాన్ని బట్టి మీ కడుపులోని బిడ్డ ఆడ, మగ అనేది చెప్పవచ్చు

అమ్మ అనే పదానికి అర్థం బిడ్డకు జన్మను ఇచ్చినప్పుడు, బిడ్డను తనకంటే ప్రాణంగా చూసుకున్నప్పుడే సంపూర్ణ మహిళ అని అంటుంటారు మన పెద్దలు. అయితే గర్భం పొందగానే ప్రతి భార్యభర్తలకు తమకు ఎవరు పుట్టబోతున్నారో తెలుసుకోవాలనే కుతూహలం ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం ఈ విషయాలు వైద్యుల సమక్షంలో చెకప్ చేయించి తెలుసుకోవడం చట్ట విరుద్ధం అయినా మన పూర్వీకులు చెప్పిన ఈ 5 విషయాల ప్రకారం మీకు బాబు పుట్టబోతున్నాడో, పాప పుట్టబోతుందో సులభంగా తెలుసుకోవచ్చు. అదెలాగో మీరే చూసి తెలుసుకోండి.

మీ శరీర చర్మం ప్రకారం

తల్లిగా ఒక బిడ్డకు జన్మను ఇస్తున్నప్పుడు గర్భంతో ఉండే మహిళ ప్రవర్తన, ఆమె శరీర తీరును బట్టి అబ్బాయి పుడతాడా, అమ్మాయి పుడుతుందా అని చెప్పేవారు మన పెద్దలు. దాని ప్రకారం మీ శరీర చర్మం పొడిగా ఉన్నట్లయితే మీకు అబ్బాయి పుడతాడని, అదే మీ చర్మం ప్రకాశవంతంగా, సున్నితంగా, మృదువుగా ఉంటే అమ్మాయి పుడుతుందని చెబుతున్నారు.

వెంట్రుకలు

గర్భిణీ మహిళ యొక్క తల జుట్టు ప్రకారం కూడా ఎవరు పుడతారో తెలుసుకోవచ్చట. గర్భంతో ఉన్న మహిళ జుట్టు ప్రకాశవంతంగా, దట్టంగా ఉంటే బాబు పుట్టబోతున్నట్లు, అదే తల జుట్టు పొడిగా ఉంటే అమ్మాయికి జన్మను ఇవ్వబోతున్నట్లుగా సూచిస్తున్నారు.

వక్షోజాలు

సాధారణంగా వక్షోజాల సైజలో మార్పు ఉంటుంది. గర్భంతో ఉన్నప్పుడు మీరు అద్దంలో చూసుకున్నట్లయితే కుడివైపు ఎద భాగం ఎక్కువ సైజులో ఉంటే అమ్మాయి అని, అదే ఎడమవైపు ఎద భాగం ఎక్కువ మోతాదులో ఉంటే మాత్రం అబ్బాయి అని గుర్తించాలని పెద్దలు చెబుతున్నారు.

ప్రెగ్నన్సీతో ఉన్నప్పుడు ముఖం

మీరు మాములుగా ఉన్నప్పుడు ఎంతో అందంగా ఉండి, గర్భం సమయంలో ప్రకాశవంతంగా లేకుండా ఉంటే మాత్రం అమ్మాయి పుట్టబోతుందని అంటారు. ఎందుకంటే అమ్మాయి తల్లి అందాన్ని దొంగిలిస్తుందని చెబుతారు. అదే అబ్బాయికి జన్మను ఇస్తున్నట్లయితే ప్రకాశవంతంగా కాకపోయినా సాధారణంగానే ఉంటే అబ్బాయి పుట్టబోతున్నాడని అర్థం.

శరీరంపై వెంట్రుకలు

ప్రెగ్నన్సీ మహిళ యొక్క శరీరంపై త్వరగా వెంట్రుకలు వస్తున్నట్లయితే అబ్బాయి పుడతాడని, అదే అమ్మాయి పుడుతుంటే మాత్రం తల్లి యొక్క శరీరంపై వెంట్రుకలు రావడం తగ్గడం లేదా వెంట్రుకలు రాలిపోవడం జరుగుతుందని అంటారు.

ఇవి ఒకప్పుడు మన పెద్దలు ప్రెగ్నన్సీ మహిళను బట్టి చెప్పిన విషయాలు మాత్రమే. మీకు నచ్చితే SHARE చేయండి.   

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon