Link copied!
Sign in / Sign up
106
Shares

ప్రెగ్నన్సీతో ఉన్నప్పుడు చేయాల్సిన మరియు చేయకూడని 14 పనులు..

image credits : Asweetlife

మీరు తల్లి కాబోతున్నారని డాక్టర్ లేదా మీ చేయి పట్టుకుని ఎవరైనా పెద్దవారు చెప్పిన ఉంటే పట్టరాని సంతోషం కలుగుతుంది. ఇది ఏ ఒక్క మహిళకు మాత్రమే కాదు, దాదాపు ప్రతి మహిళకు వారి కుటుంబ సభ్యులకు ఎంతో ఆనందాన్ని కలిగించే విషయం. త్వరలో మన ఇంట్లోకి వారసుడు/వారసురాలు రాబోతుందంటూ సంబరాలు జరుపుకుంటారు. అయితే మీతో పాటు మీ కడుపులో ఒక బిడ్డను మోస్తున్న మీరు, తల్లిగా ఎన్నో జాగ్రత్తలను తీసుకోవలసి ఉంటుంది. డాక్టర్లు చెప్పిన విషయాలను ఫాలో అవుతూనే, ఇక్కడ మీ కడుపులోని బిడ్డకోసం మరియు మీకోసం కొన్ని జాగ్రత్తలను చెప్పడం జరిగింది. ప్రెగ్నన్సీతో ఉన్న మహిళలు ఎటువంటి పనులు చేయాలి, ఎటువంటి పనులు చేయకూడదో తెలుసుకోండి.. అలాగే గర్భంతో ఉన్నప్పుడు ఎటువంటి ఆహారాలు తీసుకోవాలి, బిడ్డ పెరుగుదలకు ఉపయోగపడుతూ మీకు ఆరోగ్యాన్నిచ్చే విషయాల గురించి కూడా తెలుసుకోండి..

1.నిద్ర

2.ధూమపానం 

3.వర్కౌట్స్ 

4.మద్యపానం, కూల్ డ్రింక్స్

5.మాంసం 

6.సీ ఫుడ్ 

7.భర్తతో కలవడం 

8.పాల ఉత్పత్తులు 

9.వ్యాయామాలు, ధ్యానం, యోగా 

10.స్నానం 

11.కాఫీ 

12.బరువు 

13.పెంపుడు జంతువులు 

14.కుంకుమపువ్వు 

1.నిద్ర

ప్రెగ్నన్ట్ అయ్యారని తెలిసిన వెంటనే ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సిన జాగ్రత్తలలో విశ్రాంతి చాలా ముఖ్యమైనది. ఏ విషయానికీ పెద్దగా టెన్షన్ పడకూడదు, ఏదైనా సరే భయం, కంగారు లేకుండా ప్రశాంతంగా తీసుకోవాలి. వీటిన్నటితో పాటు ఎక్కువ సమయం నిద్ర చాలా అవసరం. నిద్ర మిమ్మల్ని మరింత ఆరోగ్యంగా ఉండేలా చేస్తోంది. మీరు నిద్రించే సమయం మీ ఆరోగ్యం మరియు మీ బిడ్డ పెరుగుదల ఆరోగ్యంగా జరుగుతుందా లేదా అనే విషయాలపై ఆధారపడి ఉంటుంది కూడా. చాలామంది మహిళలకు ఉన్న అనుమానాలలో ఇది ఒకటి. ప్రెగ్నన్సీతో ఉన్నప్పుడు మహిళలకు ఎన్ని గంటల నిద్ర అవసరమో ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోగలరు.. 

2.ధూమపానం 

ఈ విషయం గురించి ప్రగ్నన్సీతో ఉన్న మహిళలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ కొన్ని సమయాలలో తెలిసో తెలియకో ఇలా ధూమపానం చేయడం వలన మీ కడుపులోని బిడ్డకు ప్రమాదకరమే అని చెప్పాలి. ఎందుకంటే తక్కువ బరువుతో పిల్లలు పుట్టడం, డయాబెటిస్ సమస్యలు ఎదుర్కునే అవకాశం ఉంటాయని డాక్టర్లు సూచిస్తున్నారు. అంతేకాకుండా టీనేజ్ వయస్సులోనే పిల్లలు త్వరగా ధూమపానం చేయడానికి అలవాటు పడతారని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. 

3.వర్కౌట్స్ 

ప్రగ్నన్సీతో ఉన్నప్పుడు ఎప్పుడు ఒకేచోట కూర్చోవటం, పడుకోవడం మాత్రమే చేయకుండా అప్పుడప్పుడు లేచి నడుస్తూ అటుఇటు తిరగడం, ఉదయం సూర్యకిరణాలు తాకేలా బయట నిల్చోవడం, గర్భంతో ఉన్నప్పుడు మరీ బరువులు ఎత్తకుండా చిన్న చిన్న వర్కౌట్స్ చేయడం చేయాలి. ఇలా చేయడం వలన డెలివరీ సమయంలో మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఎక్కువ ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. అలాగే చాలామంది మహిళలు గర్భంతో ఉన్నప్పుడు కొన్ని విషయాల పట్ల అవగాహన లేకపోవడం వలన కడుపులోని బిడ్డకు నచ్చని ఈ విషయాలు చేస్తుంటారు. అవేంటో తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. మీరు గర్భంతో ఉన్నప్పుడు కడుపులోని బిడ్డకు నచ్చని 5 విషయాలు 

4.మద్యపానం, కూల్ డ్రింక్స్ 

ప్రెగ్నన్సీతో ఉన్న మహిళలు చేయకూడని పనులలో మరో ముఖ్యమైనది కూల్ డ్రింక్స్ మరియు మధ్యపానంకు దూరంగా ఉండటం. ఎందుకంటే వీటిలో ఆల్కహాల్, కెఫీన్ ఎక్కువ మోతాదులో ఎక్కువగా ఉండటం వలన మీ కడుపులోని బిడ్డకు ప్రమాదకరంగా మారుతాయి. కొన్నిసార్లు వీటివలనే మిస్ క్యారేజ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అందుకని వీటిని తాకకుండా ఉండటం బెటర్. కడుపుతో ఉన్నప్పుడు కూల్ డ్రింక్స్ సేవిస్తే తల్లికీ, బిడ్డకు ఏమవుతుందో ఇక్కడ క్లియర్ గా చూడండి

5.మాంసం 

గర్భం దాల్చిన తర్వాత మీరు సాధారణంగా కంటే మీతోపాటు ఇంకొకరిని మీరు మోస్తున్నారని గుర్తు పెట్టుకోండి. అందుకని తీసుకునే ఆహారం నుండి ప్రతి ఒక్కటీ జాగ్రత్తగా తీసుకోవాలి. అలా తీసుకునే ఆహారాలలో మాంసం ఒకటి. సరిగ్గా ఉడకని మాంసం తీసుకోవడం, బాగా ఉడకని గుడ్లు తినటం వలన ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే బిడ్డ మిస్ క్యారేజ్ అయ్యే ఛాన్స్ లు లేకపోలేవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కేవలం ఒక్క మాంసం మాత్రమే కాదు, ఈ 5 ఆహారాలను కడుపుతో ఉన్నప్పుడు అస్సలు ముట్టుకోకూడదు..

6.సీ ఫుడ్ 

ప్రెగ్నన్సీ సమయంలో సీ ఫుడ్ తీసుకోవడం మంచిదనే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే సీఫుడ్ లో ఎక్కువగా ఒమేగా ఫ్యాటీ 3 యాసిడ్స్, ఐరన్ మరియు జింక్ సమృద్ధిగా ఉండటమే కారణం. ఇవి తల్లికీ, బిడ్డకు బాగా ఉపయోగపడతాయి. అలాగే సీఫుడ్ తీసుకునే పచ్చిగా ఉండే వాటిని, సరిగ్గా ఉడకని వాటిని అస్సలు తీసుకోకూడదు. అంతేకాకుండా మెర్క్యూరీ ఉన్నటువంటి చేపలకు దూరంగా ఉండాలి. షార్క్, టైల్ ఫిష్, స్వార్డ్ ఫిష్, కింగ్ మిల్ మేకర్ ఈ చేపలలో మెర్క్యూరీ అధిక మోతాదులో ఉంటుంది. అందుకని వీటిని తినకూడద్దు. 

7.భర్తతో కలవడం 

ప్రెగ్నన్సీతో ఉన్నప్పుడు ఆ విషయంలో భర్తకు దూరంగా ఉండాలి అనేది నిజం కాదు. ఒకరినొకరు దగ్గరగా కలుసుకోవచ్చు. అయితే మొదటి మూడు నెలలు మరియు బిడ్డ పుట్టబోయే ఒక నెల ముందు ఏకాంతంగా గడపకపోవడం మంచిది. ఇద్దరూ కలుసుకున్నప్పుడు ఎక్కువ వేగంగా, ఒత్తిడితో చేయకుండా నెమ్మదిగా చేసుకోవాలి. మీ కడుపులో బిడ్డ ఉన్నారు అనే సంగతి మర్చిపోకూడదు. అందుకని గర్భంతో ఉన్నప్పుడు భర్తతో ఆ విధంగా కలవడం తప్పేమీ కాదు. 

8.పాల ఉత్పత్తులు 

పాలు, పెరుగు వంటి పాల ఉత్పత్తుల ఆహారాన్ని తీసుకుంటున్నప్పుడు ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. బిడ్డ ఎదుగుదలకు కాల్షియం బాగా ఉపయోగపడుతుంది, కానీ తల్లిగా మీరు తీసుకుంటున్నటువంటి పాల ఉత్పత్తులలో కాల్షియం ఏ మోతాదులో అందుతుందో చూసుకోవాలి. వేడి చేయని పాలను, మిక్స్ చేసినటువంటి పాలను అస్సలు తీసుకోకూడదు. ఎందుకంటే ఇందులో బాక్టీరియా ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణం. ఇది మిస్ క్యారేజ్, అనారోగ్యం మరియు గర్భస్రావాన్ని కలిగించవచ్చు. 

9.వ్యాయామాలు, ధ్యానం, యోగా 

ఇదివరకే పైన చెప్పుకున్నట్లు ప్రగ్నన్సీ సమయంలో ఎప్పుడూ ఒకేచోట కూర్చోవడం, ఎప్పుడూ పడుకోవడం చేయకుండా గర్భంతో ఉన్నప్పుడు మాత్రమే చేయాల్సిన చిన్న చిన్న వ్యాయామాలు, ఎటువంటి టెన్షన్ లేకుండా ప్రశాంతతను ఇచ్చే ధ్యానం చేయడం, యోగా చేయడం చాలా ఉత్తమం. ఎందుకంటే గర్భంతో ఉన్నప్పుడు చాలా రకాల భయాలు ప్రతి ఒక్కరిలోనూ ఉండటం సహజమే. అందుకని వీటి నుండి రిలీఫ్ గా ఉండటానికి, మీ మెదడులో ఎటువంటి భయాందోళనలు లేకుండా ఉండటానికి ఇలా చేస్తే మంచిది. 

10.స్నానం 

కడుపుతో ఉన్నప్పుడు చాలామంది మిస్ క్యారేజ్ సమస్యతో బాధపడుతూ ఉంటారు. మిస్ క్యారేజ్ కావడానికి కారణాలలో వేడిగా ఉన్నటువంటి టబ్ బాత్ లో ఎక్కువసేపు కూర్చోవడమే అంటున్నారు. అధికంగా ఉండే వేడి నీటితో స్నానం చేయడం వలన మిస్ క్యారేజ్ అవుతుంది. అందుకని మరీ గోరు వెచ్చని నీరు, చల్లగా ఉండే నీరు కాకుండా గోరు వెచ్చగా ఉండే నీటితో స్నానం చేయడం మంచిది. ప్రతిరోజూ స్నానం చేయడం వలన బాక్టీరియా చేరకుండా కాపాడుకోవాలి. ఈ సమయంలో ఎక్కువగా బాక్టీరియా చేరే అవకాశం ఉంది కాబట్టి..

11.కాఫీ 

ప్రతి ఒక్కరికీ కాఫీ తాగే అలవాటు ఉండే ఉంటుంది. ఎప్పుడైతే మీరు గర్భం దాల్చారు అని తెలిసిన వెంటనే కాఫీ, టీ లకు దూరంగా ఉండటం చాలా బెటర్. ఎందుకంటే ఇందులో కెఫీన్ అధిక మోతాదులో ఉండటం వలన గర్భస్రావం అయ్యే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరీ కాఫీ తాగాలి అంటే రోజుకి 200 మి. గ్రా. మించకుండా చూసుకోవాలి. ప్రెగ్నన్సీతో ఉన్నప్పుడు కాఫీకి బదులుగా ఏం తీసుకుంటే మంచిదో ఇక్కడ చూడండి. కాఫీ ప్రగ్నన్సీ సమయంలో ప్రమాదమా..! ఏం తీసుకుంటే మంచిది..

12.బరువు 

ప్రగ్నన్సీ సమయంలో బరువు పెరగడం కడుపులోని బిడ్డకు ఎంతవరకు ఆరోగ్యకరం అనేది చాలామందిలో ఉన్నటువంటి ప్రశ్న. అవును, గర్భంతో ఉన్నప్పుడు బరువు పెరగడం సర్వసాధారణమే కానీ ఎక్కువగా బరువు పెరగడం మీకు కాస్త ఇబ్బందికరం. ఎక్కువగా నడవడానికి మీ పని మీరు చేసుకోవడానికి కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకని మీరు తినాలి అనుకున్న ఆహారాన్ని తినకుండా ఉండకండి. అందుకు బదులుగా ఒకేసారి తినాలి అనుకున్న ఆహారాన్ని రెండుసార్లుగా తినడం, వ్యాయామాలు చేస్తూ బరువు పెరగకుండా చూసుకోవడం చేయాలి. 

13.పెంపుడు జంతువులు 

పెంపుడు జంతువులంటే ప్రతి ఒక్కరికీ ఇష్టమే. వాటితో ప్రేమగా ఎక్కువ సమయాన్ని గడుపుతూ ఉంటారు. అయితే గర్భంతో ఉన్నప్పుడు మాత్రం పెంపుడు జంతువులకు కాస్త దూరంగా ఉండటం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే వీటి నుండి వచ్చే బాక్టీరియా, ఇన్ఫెక్షన్స్ మీ శరీరాన్ని త్వరగా చేరుతాయి. మీకు ఇవి అనారోగ్యాన్ని కలిగించవచ్చు. మీరు ఎంతో జాగ్రత్తలు తీసుకుంటున్నప్పుడు ఒక చిన్న కారణంగా ఇబ్బంది పడటం కరెక్ట్ కాదు కదా..

14.కుంకుమపువ్వు 

బిడ్డ అందంగా, ఎర్రగా, ఆరోగ్యంగా పుట్టాలంటే కుంకుమపువ్వు తీసుకోవాలని ప్రతి ఒక్కరూ సూచిస్తూ ఉంటారు. నిజమే గానీ ఎంత మోతాదులో తీసుకోవాలని ప్రతి ఒక్కరికీ ఉండే అనుమానం. ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో 10 గ్రాముల కుంకుమపువ్వును బాగా కలుపుకుని సేవించాలి. ఎక్కువ మోతాదులో అస్సలు తీసుకోకూడదు. అయితే కుంకుమపువ్వును గర్భవతులు ఏ నెల నుండి తీసుకోవడం మొదలు పెట్టాలి, ఎలా తీసుకోవాలి? అనే విషయాల గురించి మరింత వివరంగా ఇక్కడ చూడండి. గర్భంతో ఉన్నప్పుడు ఏ నెల నుండి కుంకుమపువ్వు తీసుకోవాలి? 

ఇవండీ ప్రెగ్నన్సీ సమయంలో చేయాల్సిన మరియు చేయకూడని పనులు. ఈ విషయాలు గర్భంతో ఉన్న ప్రతి మహిళకు, తల్లి కాబోతున్న వారికి తెలిసేలా SHARE చేయండి. మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మీ విలువైన అభిప్రాయాన్ని COMMENT లో తెలుపగలరు.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon