Link copied!
Sign in / Sign up
0
Shares

ప్రెగ్నన్సీ తరువాత సాగిపోయిన పొత్తి కడుపును బిగుతుగా చేయడానికి 5 చిట్కాలు

ప్రెగ్నన్సీ మీ శరీరంలో అనేక మార్పులను కారణమవుతుంది. ప్రసవం తరువాత కొన్ని మార్పుల నుండి తిరిగి కోలుకుంటాం. కానీ కొన్ని మార్పులు అలానే ఉండిపోతాయి. వాటిలో పోతి కడుపు సాగిపోవడం ఒకటి. ప్రెగ్నన్సీ సమయంలో పొత్తి సాగిపోతుంది. ప్రసవం అయిన తరువాత కూడా పొత్తి కడుపు అలానే సాగిపోయుంటుంది. దాన్ని తిరిగి బిగువుగా చేయాలంటే మీరు చేయాల్సిన 5 పనులు ఇవే…

1. నీరు ఎక్కువగా తీసుకోండి

రోజుకు సరిపడ నీరు ఎక్కువగా తీసుకోండి. ఇది మీ శరీర క్రియలను సక్రమంగా జరిగేలా చూడడం మాత్రమే కాకుండా, మీ చర్మాన్ని కూడా హైడ్రేట్ చేస్తుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచి, బిగుతుగా చేస్తుంది.

2. బ్రెస్ట్ ఫీడింగ్ తప్పనిసరి

బ్రెస్ట్ ఫీడింగ్ మీ బిడ్డకు పోషకాలు అందించడానికి చాలా అవసరం. అలాగే మీకు కూడా చాలా అవసరం. మీరు బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తున్న సమయంలో మీ శరీరంలోని క్యాలోరీలు పాలుగా మారుతాయి. ఈ విధంగా మీ శరీరంలో కొవ్వు తగ్గుతుంది.

3. వ్యాయామం

వ్యాయామం మీ పొత్తి కడుపుని బిగుతుగా చేయడానికి చాలా సహాయపడుతుంది. పొత్తి కడుపు మీద వత్తిడి పడేలా, స్ట్రేటచెస్ లేదా ఇతర వ్యాయామాలు చేయడానికి ప్రయత్నించండి. ఇది పొత్తి కడుపు భాగంలోని కొవ్వును తగ్గిస్తుంది. అక్కడి చర్మాన్ని బిగుతుగా చేస్తుంది.

4. ప్రోటీన్లు తీసుకోండి

ఎక్కువ మోతాదులో ప్రోటీన్లతో కూడిన ఆహారాన్ని తీసుకోండి. ప్రోటీన్లలో ఉండే, కొల్లాజెన్ చర్మాన్ని బిగుతుగా చేస్తుంది. రోజుకు కనీసం 50 గ్రాముల ప్రోటీన్లను మీ ఆహారంలో భాగంగా తీసుకోవాలి.

5. మసాజ్

మీ పొత్తి కడుపు భాగం దగ్గర రోజు బాడీ లోషన్ తో మాసాజ్ చేసుకోండి.  ఇప్పుడు మసాజ్ కోసం విటమిన్ C, E, A మరియు K ఉన్న బాడీ లోషన్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon