Link copied!
Sign in / Sign up
34
Shares

ప్రెగ్నన్సీ తరువాత రొమ్ములు బిగువుగా ఉండడానికి పాటించాల్సిన 5 విషయాలు

మీ జారిపోయిన రొమ్ములను అద్దంలో చూసుకున్న ప్రతిసారి బాధగా ఉంటుంది. స్త్రీ సౌందర్యాన్నీ పరిపుష్టం చేసేది, రొమ్ములు.  అవి అందంగా బిగువుగా ఉంటే మీరు అందంగా ఉంటారు. చాలా సార్లు ప్రెగ్నన్సీ ముందు ఉన్నట్టు, మీ రొమ్ములు బిగుతుగా అయిపోతే బావున్ను అనిపిస్తుంది కదా. కానీ ఎలా?  అసలు ప్రెగ్నన్సీ తరువాత రొమ్ములు ఎందుకు జారిపోతాయి? ఇక్కడ తెలుసుకోండి.

రొమ్ములు ఎందుకు జారిపోతాయి?

ప్రెగ్నన్సీ సమయంలో శరీర బరువుతో పాటు రొమ్ముల పరిమాణం కూడా పెరుగుతుంది. రొమ్ము కండరాలను, చాతి భాగానికి అతుక్కున్నేలా చేసే కూపర్ లిగ్మెంట్ ప్రెగ్నన్సీ  సమయంలో సాగిపోతుంది. తరువాత  బ్రెస్ట్ ఫీడింగ్ చేసే సమయంలో రొమ్ముల పరిమాణం అలాగే కొనసాగుతుంది. బ్రెస్ట్ ఫీడింగ్ ఆపేసిన కొంత కాలానికి, పరిమాణం తగ్గి, రొమ్ములు జారిపోవడం మొదలవుతుంది.

రొమ్ములు జారిపోకుండా ఉండాలంటే ఇలా చేయండి….
1. ఎల్లప్పుడూ బ్రా ధరించండి

జారిపోతున్న రొమ్ములను బిగుతుగా చేయడానికి మొదటి పరిష్కారం, బ్రా ధరించడం. బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తున్నప్పుడు కూడా బ్రా ధరించడం మంచిది. బ్రా ధరించడం వలన లిగ్మెంట్స్ సాగిపోవు. అయితే మీరు ఎంచుకునే బ్రా, మీ సైజుకు సరిపోయేట్టు, మీకు సౌకర్యవంతంగా ఉండేటట్టు చూసుకోండి.

2. బిడ్డకు పాలు ఇచ్చేటప్పుడు ఇలా చేయండి

మీరు బ్రెస్ట్ ఫీడింగ్ చేసే సమయంలో, బిడ్డకు పాలు ఇచ్చేటప్పుడు వంగిపోకండి. అలా చేయడం వలన రొమ్ములు జారిపోతాయి. అందుకే పాలు ఇచ్చేటప్పుడు, మీరు వంగిపోకుండా, బిడ్డనే రొమ్ముల దగ్గరకు ఎత్తుకోండి.

3. వ్యాయామం

ప్రెగ్నన్సీ తరువాత, డాక్టర్ సలహాతో వ్యాయామం చేయడం మొదలుపెట్టండి. అయితే తేలిక పాటి వ్యాయామాలు మాత్రమే చేయండి. బరువు దగ్గడం, వెనుక వైపు కండరాలు బలంగా తయారవడం వలన రొమ్ములను బిగుతుగా తయారవుతాయి.

4. ఆహారం

మీ ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోండి. పిండి పదార్ధాలు, ప్రోటీన్స్, పోషకాలు, ఆరోగ్యకరమైన క్రొవ్వులు, అధిగంగా ఉండే ఆహారాన్ని తీసుకోండి. బ్రెస్ట్ ఫీడింగ్ చేసే సమయంలో, విటమిన్ B, C, E అధికంగా ఉండే, కూరగాయలను, పండ్లను ఆహారంగా తీసుకోండి. ఇవన్నీ మీ బరువు తగ్గించి, రొమ్ములను బిగువుగా చేస్తాయి.

5. మసాజ్

మీరు స్నానం చేసేటప్పుడు, వేడి నీళ్ళతో లేదా చల్లని నీళ్ళతో, మీ రొమ్ములను మసాజ్ చేసుకోండి. ఇలా చేయడం వలన, మీ రొమ్ములలో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. రొమ్ములు బిగువుగా అవడమే కాకుండా చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
100%
Like
0%
Not bad
0%
What?
scroll up icon