Link copied!
Sign in / Sign up
2
Shares

ప్రెగ్నన్సీ తరువాత మచ్చలేని నిగ నిగలాడే చర్మాన్ని పొందటానికి 8 చిట్కాలు

ప్రతి మహిళ అందమైన చర్మాన్ని కోరుకుంటుంది కాని అది అన్ని వేళల సాధ్యం కాదు. ప్రెగ్నన్సీ మన చర్మం యొక్క రంగు పైన ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంది.  ఒత్తిడి, నిద్ర లేకపోవడం, చర్మాన్ని కాంతివిహీనం చేస్తాయి. మునపటి లాగా చర్మం అందంగా మారడానికి ఒక రోజు వారి విధానాన్ని ఏర్పాటు చేసుకోవాలి.

ఈ 8 చిట్కాల ద్వారా మీ మునుపటి చర్మాన్ని మీరు పొందగలరు

1. వేడి టవల్

వేడి టవల్ లో మీ ముఖాన్ని కప్పి పెట్టండి. మీకు వెచ్చని మరియు సుఖకరమైన అనుభూతి కలిగించడం తో పాటు బ్యూటీ ప్రొడక్ట్స్ మీ చర్మం పై పైనే కాకుండా లోతు గా చేరుకొని పని చేసేలా చేస్తుంది. ముఖం-పరిమాణ అంత ఉన్న మస్లిన్ వస్త్రం (లేదా కేవలం ఒక సాధారణ టవల్) మరియు కొన్ని వేడి నీళ్లు చాలు ఇది ఇంట్లో చేయడానికి.

2 . డాండ్రఫ్ షాంపూతో మీ ముఖాన్ని కడగాలి

మీ చర్మం పొడిగా, ఫ్లాకీతో, ఎర్రబడి ఉంటే, దానికి పరిష్కారం షవర్ లోనే ఉంది.మీ సాధారణ పేస్ వాష్‌ను వారానికి ఒకసారి చుండ్రు షాంపూతో కలిపి వాడండి, మీ చర్మం కి అది సూట్ అయినట్లు అయితే ఇంకా తరచుగా వాడండి.మీ చర్మం రకం ప్రకారం ప్రభావాలు మారవచ్చు, కాబట్టి మీ చర్మం ఎలా స్పందిస్తుందో చూడటానికి మొదట చిన్న మొత్తంలో వాడి చుడండి.

3 . పాలను క్లీన్సర్ గా వాడండి

మీరు మృదువైన, యవ్వనంగా కనిపించే చర్మం కోసం చూస్తున్నట్లయితే, మీరు పాలు గయోగించాల్సిందే. పాలు చాలా సమర్ధవంతనమైన క్లీన్సర్.లాక్టిక్ యాసిడ్ ముడుతలను తగ్గిస్తుంది మరియు కొల్లాజెన్‌ను పెంచుతుంది. ఇది రోజువారీ రొటీన్ లో ఒక క్లీన్సర్, ఏక్సఫోలియాటర్ , టోనర్ మరియు స్పాట్ చికిత్సగా ఉపయోగపడుతుంది.

4 . ఐస్ క్యూబ్ ఫేషియల్

ముఖం ని వాష్ మరియు ఏక్సఫోలియాట్ చేసాక సింక్ ని చన్నీరు తో నింపండి. అందులో ఐస్ క్యూబ్స్ కూడా వేయండి.మీ ముఖాన్ని నీటిలో ముంచండి లేదా మీ ముఖం మీద 10 సెకన్లపాటు స్ప్లాష్ చేయండి. అనేక సార్లు రిపీట్ చేయండి. చల్లదనం రంధ్రాలను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. మీరు జిడ్డుగల చర్మం కలిగి ఉంటే, నిమ్మ రసం యొక్క ఒక టీస్పూన్ జోడించండి.

5 . ఇంకా మెరుగుపరచండి

చర్మాన్ని ఇంకా మెరుగుపరచడానికి ప్రొఫెషనల్ క్లీన్సర్ ని వాడండి. ఇది చర్మాన్ని ఎక్స్ఫోలియాట్ చేయడమే కనకుండా నచ్యురల్ మరియు యూత్‌ఫుల్ లుక్ ఇస్తుంది.

6 , నిద్రపోండి

తగినంత నిద్రాన్ని మీ రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది మరియు మీకు ఎనర్జిటిక్ ఫీల్ ఇవ్వడానికి సహాయపడుతుంది. అంతే కాకుండా మీ చర్మం పునరాదిద్దుకోడానికి తగినంత సమయం ఇస్తుంది. మీకు గనక సరిగ్గా నిద్ర పట్టకపోతే డాక్టర్ ను సంప్రదించండి.

7 . నూనె వాడండి.

మీ ముఖం ని మీరు స్కర్బ్ చేసినపుడు క్లియర్ గా అనిపిస్తుంది కానీ అది మీ చర్మానికి హానికరం కావొచ్చు ప్రత్యేకించి కళ్ళ క్రింది భాగం లో. సహజమైన , సున్నితమైన తేమ కోసం, ఆర్గానిక్ కొబ్బరి నూనె వాడి చుడండి. మీ కళ్ళ చుట్టూ లేదా పూర్తిగా ముఖం చుట్టూ ఉన్న ప్రాంతానికి నూనె రాసి పది నిముషాలు తరువాత కడిగేయండి,

8 . ఇంట్లోనే డిటాక్స్

మీ పరిసరాలలో మరియు మీరు తినే ఆహారంలో, మీ చర్మం కి హాని కలిగించే టాక్సిన్లు ఉన్నాయి . మంచి అనుభవం కోసం, ఒక వార్మ్ బాత్ లో కొంచెం ఎప్సోమ్ ఉప్పు, సముద్ర ఉప్పు మరియు బేకింగ్ సోడా, నచ్యురల్ క్లీన్సర్ ను వేసి కలపండి . దీన్ని 20-నిమిషాలు పాటు ఉంచి తీసేయండి. ఇలా చేసినట్లు అయితే రిఫ్రెష్ మరియు అందమైన ఫీలింగ్‌ను చర్మం పొందుతుంది.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon