Link copied!
Sign in / Sign up
3
Shares

ప్రెగ్నన్సీ తరువాత బరువు తగ్గడానికి మీ జీవన శైలిలో చేసుకోవాల్సిన మార్పులు


తొమ్మిది నెలల ప్రెగ్నన్సీ లో బరువు పెరుగుతారు. ఇది సహజంగా జరిగేదె. దీన్ని నుండి ఎవరు తప్పించుకోలేరు. ప్రెగ్నన్సీ తరువాత అందరూ బరువు తగ్గాలనుకుంటారు. ఎక్కువ బరువు ఉండటం వలన ఆరోగ్య సమస్యలు వస్తాయి. చాలామంది మహిళలు వారి రోజువారీ జీవనశైలి లో పెద్దగా మార్పులు చేయకుండానే బరువు తగ్గాలనుకుంటారు. కానీ అది సాధ్యం కాదు. తప్పకుండా కొన్నిటికి దూరంగా ఉండాలి. జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటో ఇక్కడ చూడండి. 

1. ఆహారం 

ఆరోగ్యం గా మంచి ఆకారం లో ఉండటానికి డైట్ కొనసాగించడం మంచిది. అవసరమైన పోషక పదార్ధాలు మరియు విటమిన్స్ ఏవి తగ్గకుండా తీసుకునే ఆరోగ్యవంతమైన డైట్ ఉండాలి.  ఎక్కువ పండ్లు , కూరగాయలు ,గ్రైన్స్, చేప ,గుడ్లు ,పాలు మరియు ఆలివ్ నూనే లాంటివి తీసుకోవాలి.

2. వ్యాయామం 

తరువాత వచ్చేది వ్యాయామం. వ్యాయామం చేయడం వల్ల ప్రెగ్నన్సీ ముం దు తరువాత మీరు ఆక్టివ్ గా ఉండటమే కాకుండా కాంప్లికేషన్స్ ని అవోయిడ్ చేయవచ్చు. చురుక్కు గా ఉంటూ బ్రిస్క్ వాకింగ్ చేయటం ప్రెగ్నన్సీ అప్పుడు మంచిది.

3. ఒబేసిటీ చెక్ 

ప్రెగ్నన్సీ తరువాత వెయిట్ తగ్గాలనుకునేముందు ఒక సారి ఒబేసిటీ చెక్ చేయించుకోవడం మంచిది. ఇది మీకు మీరు బరువు తగ్గడానికి కావాల్సిన ఒక అంచనా ఇస్తుంది. దీనిని అనుసరించి మీరు బరువు తగ్గడానికి ఒక ప్లాన్ ను తయారు చేసుకోవచ్చు. 

 4.వాకింగ్ 

ప్రెగ్నన్సీ తరువాత బరువు తగ్గడానికి వాకింగ్ ఒక మంచి ఉపాయం. ముందు కొంత దూరం తో మొదలు పెట్టి తరువాత మెల్లగా మీరు నడిచే దూరాన్ని పెంచండి. ఒకేసారి ఎక్కువ దూరాలు నడవడం అంత మంచిది కాదు. జాగింగ్,సైక్లింగ్,స్విమ్మింగ్ కూడా ఒక మంచి  వ్యాయామాలే. ఎన్నో 

5. ఆహ్లాలదంగా 

మీరు ఇంట్లో ఒంటరి గా లేదా మీ ఆయనతో  ఉన్నట్లు అయితే డాన్స్ చేయడానికి ట్రై చేయండి. దానివల్ల కూడా మీరు బరువు తగ్గుతారు. ఈ మార్గం జిం జాయిన్ అవ్వటం కన్నా మెరుగైనదే కాకుండా ఎన్నో టన్నుల కలెరీలను బర్న్ చేస్తుంది. మీ పార్టనర్ తో రీ కనెక్ట్ చేస్తుంది డాన్స్. మీరు కూడా రిలాక్స్డ్ గా కాన్ఫిడెంట్ గా ఫీల్ అవుతారు.

6. ఇంటి పనులు 

ఇంటి పనులు చేస్తూ కూడా మీరు బరువు తగ్గవచ్చు. ఇల్లు క్లీన్ చేయడం , వంట చేయడం, గ్రోసరీ తీసుకురావడం లాంటివి ప్రతి రోజు చేయడం వల్ల జిం లాంటివి వెళ్లకుండానే సులభంగా బరువు తగ్గవచ్చు.

7. నిద్ర 

అన్నిటికన్నా ముఖ్యమైనది సరిపడా నిద్రపోవడం. నిద్ర అనేది మీకు మానసిక మరియు శారీరిక బలాన్ని ఇస్తుంది ఏ డైట్ ఫాలో అవ్వడానికి.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon