Link copied!
Sign in / Sign up
4
Shares

ప్రెగ్నన్సీ సమయంలో అందరికి వచ్చే 5 విచిత్రమైన కలలు వాటి అర్ధాలు

నిద్రలో కలలు రావడం చాలా సహజం. కానీ మనకు తెలియని విషయం ఏంటంటే మనకు వచ్చే ప్రతి కల మన జీవితం గురించి మనకు ఏదో చెప్తుంది. అది జరగబోయేది కావచ్చు లేదా జరిగినది కావచ్చు. సాధారణ సమయంలో కన్నా మీరు ప్రేగ్నన్ట్ గా ఉన్న సమయంలో మీకు వచ్చే కలలు చాలా విచిత్రంగా ఉంటాయి. అయితే ఆ కలలన్ని మీ మనసు మీకు ఏదో చెప్పడానికి ప్రయత్నించడమే. ప్రెగ్నన్సీ సమయంలో ఎలాంటి కలలు వస్తాయో వాటి అర్ధలేంటో ఇక్కడ తెలుసుకోండి…

1. ఆడ లేదా మగ

ప్రెగ్నన్సీతో ఉన్న చాలా మందికి వచ్చే సాధారణమైన కల, తమకు పుట్టబోయే బిడ్డ ఆడ, మగ తెలియచేసేవి అయి ఉంటాయి. దీనికి కారణం మీ ప్రెగ్నన్సీ సమయంలో మీరు ఆడ బిడ్డ పుడుతుందా, లేదా మగ బిడ్డ పుడుతాడా అని ఎక్కువగా ఆలోచించడం వలన ఎలాంటి కలలు వస్తాయి.

2. రక్తం

ప్రేగన్సీ సమయంలో మీకు వచ్చే కలలలో ఎక్కువగా రక్తం కనిపిస్తే అది మీరు గర్భ స్రావం గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు అని అర్ధం. ఇంతక ముందు మీకు గర్భస్రావం జరిగివుంటే ఆ భయం మీలో ఉండడం వలన, ఈ సారి కూడా మీకు గర్భ స్రావం జరుగుతుందేమోనని ఎక్కువ ఆలోచించడం వలన ఈ కలలు వస్తాయి.

3. కాన్పు

ప్రెగ్నన్సీ సమయంలో కాన్పు జరుగుతున్నట్టు కలలు రావడం సహజం. మీకు త్వరగా కాన్పు జరగాలనే కోరిక ఉన్నప్పుడు, మీకు కంపు జరిగినట్టు కలలు వస్తుంటాయి. కాన్పు గురించి మీరు అతిగా భయపడిన కాన్పు కలలు రావచ్చు.

4. జంతువులకు జన్మనివ్వడం

అవును కొంతమంది ప్రెగ్నన్సీతో ఉన్న మహిళలకు జంతువులకు జన్మనిచ్చినట్టు కలలు వస్తుంటాయి.  దీనికి కారణం ప్రెగ్నన్సీ గురించి అనేక అపోహలు కలిగి ఉండడం, లేదా ఎక్కువగా భయపడడం. మీ భయాలు అపోహలు అలాంటి భయంకరమైన కలలుగా వస్తాయి.

5. బిడ్డకు ప్రమాదం

మీరు బిడ్డను ఎత్తుకుని ఉన్నారు, తెలియకుండా మీ బిడ్డ మీ చేతుల నుండి జారీ కింద పడిపోయింది లేదా బిడ్డ ఉయ్యాల నుండి కింద పడిపోవడం. ఇవన్నీ మీ కలలలో మీకు కనిపిస్తూ ఉంటే మీకు బిడ్డను పెంచడంలో అనుమానాలు ఉన్నాయి అని అర్ధం. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon