Link copied!
Sign in / Sign up
4
Shares

ప్రెగ్నన్సీ సమయంలోని వత్తిడి పుట్టబోయే పిల్లల మీద ఇంత చెడు ప్రభావం చూపిస్తుందా?


మీరు ప్రేగ్నన్ట్ అయ్యారా అయితే అది అత్యంత సంతోషకరమైన విషయం. కానీ మీరు ఆ సమయంలో ఎదురుకోవాల్సిన సమస్యలు కొన్ని ఉంటాయి. అవన్నీ మీకు వత్తిడిని కలుగచేస్తాయి. వైద్యులు ఈ వత్తిడి నుండి దూరంగా ఉండమని సలహా ఇస్తారు. ప్రెగ్నన్సీ సమయంలో కలిగే ఈ వత్తిడి మీ మీద మాత్రమే కాకుండా మీ పుట్తోబోయే బిడ్డ మీద కూడా ప్రభావం చూపిస్తుంది. ఆ ప్రభావం పుట్టబోయే బిడ్డ పై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో ఇక్కడ చూడండి…

1.నెల తక్కువ కాన్పు

ప్రెగ్నన్సీ సమయంలో మీరు తీవ్ర వత్తిడికి గురైతే మీకు నెలలు నిండకుండానే కాన్పు జరిగే ప్రమాదముంది. మీకు కలిగే వత్తిడి వలన మీరు మానసికంగా బలహీనంగా ఉన్నప్పుడు. నెలలు నిండకుండానే కాన్పు జరుగుతుంది.

2. తక్కువ బరువు

మీ అధిక వత్తిడి మీరు తీసుకునే ఆహారంలోని పోషకాలను మీకు అందకుండా చేస్తుంది. దీని కారణంగా కడుపులోని బిడ్డ ఎదుగుదలకు కావాల్సిన పోషకాలు బిడ్డకు అందవు. పూటబోయే బిడ్డ తక్కువ బరువుతో పూడుతారు.

3. నిద్ర

కొన్ని అధ్యాయనాల ప్రకారం ప్రెగ్నన్సీ సమయంలో మీరు వత్తిడికి అధికంగా గురయితే. పుట్టిన బిడ్డకు నిద్రలేమి సమస్యలు వస్తాయి.

4. వ్యక్తిత్వం

ప్రెగ్నన్సీ సమయంలో మీ మానసిక పరిస్థితికి అనుగుణంగా మీ పిల్లల మెదడు అందులోని భావనలు రూపుదిద్దుకుంటాయి. మీరు సంతోషంగా ప్రశాంతంగా ఉంటే, మీ వ్యక్తిత్వ లక్షణాలు అలానే ఉంటాయి. మీరు అధిక వత్తిడిని ప్రెగ్నన్సీ సమయంలో అనుభవిస్తే మీకు పుట్టబోయే బిడ్డ లో వ్యక్తిత్వ లోపాలు ఉండచ్చు.

5. ఎదుగుదల

మీరు ప్రెగ్నన్సీ సమయంలో వత్తిడికి గురవడం మీ బిడ్డ ఎదుగుదలకు కూడా మంచిది కాదు. ఎదుగుదల సరిగా లేకపోవడం వలన పుట్టే పిల్లలు లోపాలతో పుడతారు. వారికి సరైన పోషకాహారం అంది పూర్తిగా ఎదగాలంటే మీరు ప్రెగ్నన్సీ సమయంలో వత్తిడి లేకుండా ఉండాలి. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon