Link copied!
Sign in / Sign up
1
Shares

ప్రెగ్నన్సీ సమయంలో తినాలనుకునే 5 ఆహారాలు : వీటివలన ఎటువంటి ఇబ్బందులు ఎదురవుతాయి..!

అందరికి తమకు ఇష్టమైన ఆహరం తినాలని కోరిక ఉంటుంది. అలానే మహిళలకు ప్రెగ్నన్సీ సమయంలో కొన్ని ఆహారాల మీద ప్రత్యేకమైన ఇష్టం ఉంటుంది. ఆ ఆహారాలు తినాలని చాలా కోరిక ఉంటుంది. అందుకు అనేక కారణాలు ఉంటాయి. ఆ ఆహారాలు ఏంటి వాటిని ప్రెగ్నన్సీ సమయంలో తినడం మంచిదేనా? ఇక్కడ తెలుసుకుందాం.

1. ఐస్

ప్రెగ్నన్సీతో ఉన్న చాలా మంది మహిళలకు ఐస్ తినాలనిపిస్తుంది. అది ఏ విధమైన ఆహరం కాకపోయినా నోటి మంటను తగ్గించుకోడానికి ఐస్ తినాలనిపిస్తుంది. రక్త హీనతతో బాధపడుతున్న వారికి ఎక్కువగా ఇలా అనిపిస్తుంది. ఎక్కువ ఐస్ తినద్దు, నోటి మంట తగ్గడానికి మంచి నీరు ఎక్కువగా తీసుకోండి.

2. చాక్లేట్

ప్రేగ్నన్ట్ మహిళలు ఎక్కువగా తినడానికి ఇష్టపడే వాటిలో చాక్లేట్ కూడా ఉంది. చాక్లేట్ మాత్రమే కాదు ఏ విధమైన స్వీట్స్ అయినా సరే ఇష్టంగా తినాలనిపిస్తుంది. అందుకు కారణం చాక్లేట్ లో ఉండే పదార్ధాలు మనసుకు ప్రశాంతతను సంతోషాన్ని ఇస్తుంది. డార్క్ చాక్లేట్లు తినడం మంచిది, అందులో చక్కర తక్కువగా ఉంటుంది.

3. కారం

ప్రెగ్నన్సీ సమయంలో ఎక్కువగా కారంగా ఉండే ఆహారాలు, పచ్చళ్ళు తినాలనిపిస్తుంది. అలా తినడం వలన శరీరానికి చమట పట్టి చల్ల బడుతుంది. కానీ ఎక్కువ కారం తీసుకోవడం మంచిది కాదు. కడుపులో మంట కలిగిస్తుంది.

4. పులుపు

ఇది అందరికి తెలిసిందే ప్రేగన్సీతో ఉన్న మహిళలకు పులుపు ఎక్కువగా తినాలనిపిస్తుంది. వికారం, వాంతులు తగ్గించుకోవడానికి పులుపు తినాలనిపిస్తుంది.

5. కాఫీ

ప్రెగ్నన్సీ ముందునుంచి మీకు కాఫీ అలవాటు ఉంటే, ప్రెగ్నన్సీ సమయంలో ఎక్కువ కాఫీ తాగాలనిపిస్తుంది. ప్రెగ్నన్సీ సమయంలో ఉండే తలనొప్పి, వత్తిడి కాఫీ తాగితే తగ్గుతాయి అనే భావన ఉంటుంది. కానీ ప్రేగన్సీ సమయంలో ఎక్కువ కాఫీ తాగడం మంచిది కాదు. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon