Link copied!
Sign in / Sign up
0
Shares

ప్రెగ్నెన్సీ సమయంలో, తర్వాత వాక్సింగ్ చేయించుకోవచ్చా?

ఓ మహిళకు తల్లి కావడం కంటే అదృష్టం ఇంకేముంటుంది చెప్పండి. మహిళ తల్లి అయినప్పుడే తన జన్మకు సార్థకత అని నమ్ముతుంది. అందుకే ప్రెగ్నెన్సీ సమయంలో.. తర్వాత ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. దాని కోసమే కొంత మంది మహిళలు.. తమ చర్మాన్ని కాపాడుకోవడానికి వాక్సింగ్ చేయించుకుంటారు. చాలా మంది.. ప్రెగ్నెన్సీ సమయంలో, ప్రెగ్నెన్సీ తర్వాత కూడా వాక్సింగ్ చేయించుకుంటుంటారు. కాని.. కొంతమందిలో దీనిపై లేనిపోని అపోహలు, సందేహాలు వస్తుంటాయి. మరి.. గర్భిణిగా ఉన్నప్పుడు, బిడ్డను కన్న తర్వాత ఓ మహిళ వాక్సింగ్ చేయించుకోవచ్చా? చేయించుకుంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

గర్భిణిగా ఉన్నప్పుడు

చాలా మంది మహిళలు తమ చర్మాన్ని తాజాగా, మెరిసేలా ఉంచుకోవడం కోసం తమ శరీరం మీద ఉన్న వెంట్రుకలను ఎప్పటికప్పుడు తీసేస్తుంటారు. అయితే.. మామూలు స్థితి వేరు, ప్రెగ్నెన్సీ టైమ్ వేరు. గర్భిణిగా ఉన్నప్పుడు చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. ఆ సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోకపోతే చర్మానికి గీతలు పడే అవకాశం ఉంటుంది. గర్భిణిగా ఉన్నప్పుడు అవే గీతలు పెరిగే ప్రమాదం ఉంది.

ఒకవేళ మీ చర్మం అంత స్మూత్‌గా లేకున్నా... చర్మం పొలుసులు రాలినట్లు అనిపించినా తప్పనిసరి పరిస్థితిలోఅయితే...వాక్సింగ్ చేసుకోండి. కాని ఆసమయంలో పలు జాగ్రత్తలు తీసుకోవడం మాత్రం మరిచిపోకండి. ఒకవేళ మీరు సొంతంగా చేసుకోకపోయినా.. మంచి బ్యూటీ పార్లర్ కు వెళ్లండి. అయితే.. మామూలు వ్యక్తుల కంటే.. గర్భిణీగా ఉన్న వ్యక్తుల చర్మం చాలా సున్నితంగా ఉంటుందనే విషయాన్ని మాత్రం అస్సలు మరవొద్దు. అందుకే.. ఇంటి వద్ద ఇటువంటి సాహసాలకు పూనుకోకండి. ముఖ్యంగా బికినీ వాక్సింగ్ చేసుకునేటప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ప్రైవేట్ పార్ట్స్ దగ్గర వాక్సింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే ఎటువంటి సమస్యా ఉండదు. లేకపోతే.. మీ ప్రైవేట్ పార్ట్స్ కు మీరే బాధ కలిగించే వాళ్లవుతారు. అందుకే.. గర్భిణీగా ఉన్నప్పుడు అటువంటి సాహసాలకు పూనుకోకండి. జస్ట్.. ఓ మంచి సెలూన్ ను సంప్రదిస్తే చాలు.. వాళ్లే ఎంతో జాగ్రత్తగా మీకు వాక్సింగ్ చేస్తారు.

ప్రెగ్నెన్సీ తర్వాత

ఓ మహిళకు ఇదే ఛాలెంజింగ్ రోల్. ప్రెగ్నెన్సీ తర్వాత ఓ మహిళ తల్లిగా ఎన్నో బాధ్యతలను నిర్వర్తించాల్సి ఉంటుంది. అయితే... ఓ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత చర్మం మొత్తం లూజ్ అవుతుంది. చర్మానికి గీతలు పడతాయి. ప్రెగ్నెన్సీ ముందు ఉన్న శరీరం.. ప్రెగ్నెన్సీ తర్వాత ఉండకపోవచ్చు. అలాగని టెన్షన్ పడాల్సిన పనిలేదు. చాలా మంది సెలబ్రిటీలు.. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత తమ శరీరాన్ని మళ్లీ పూర్వస్థితికి తీసుకురావాలన్న ఆతృతలో రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. నిజానికి అంత తొందర పడకూడదు. నెమ్మదిగా అంతా సర్దుకుంటుందనే విషయాన్ని తల్లులు తెలుసుకోవాలి. అయితే.. తొందరపడి తమకు తాము వాక్సింగ్ చేసుకోవడం మాత్రం చాలా ప్రమాదం. ఓ మహిళ తల్లి అయిన తర్వాత చర్మం చాలా వదులుగా ఉంటుంది. దాన్ని బిగుతుగా చేయడం కోసం వెంటనే వాక్సింగ్ చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే.. డెలివరీ సమయంలో ఓ మహిళ ఎన్నో నొప్పులను భరిస్తుంది. అంత నొప్పిని ఒకేసారి భరించినప్పుడు శరీరంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి.

వాటన్నింటికీ తట్టుకునేలా శరీరం అడ్జస్ట్ అయినప్పుడు మాత్రమే ఎటువంటి టెక్నిక్స్ అయినా వాడొచ్చు. ఆ సమయంలో బికినీ వాక్సింగ్ కూడా చాలా డేంజర్. డెలివరీ తర్వాత జనాంగాల దగ్గర అంతా పచ్చిగానే ఉంటుంది. అందుకే.. డెలివరీ తర్వాత కనీసం 8 నుంచి 9 నెలలు వేచి చూడాల్సిందే. ఆ తర్వాత వాక్సింగ్ చేయించుకుంటే.. డెలివరీ ద్వారా చర్మంపై వచ్చిన గీతలను తగ్గించుకోవడంతో పాటు వదులుగా ఉన్న చర్మాన్ని కూడా బిగుతుగా చేసుకొవచ్చు.

.....................................................................................................

మహిళలందరికీ ఓ మంచి శుభవార్త..

Tinystep మీరు సురక్షితంగా ఉండటానికి ఎటువంటి కెమికల్స్ లేని సహజమైన ఫ్లోర్ క్లీనర్ ఉత్పత్తిని ప్రారంభించింది. మీ పిల్లల ఆరోగ్యకోసం, మీ ఇంట్లోకి ఎటువంటి క్రిములు చేరకుండా ఈ ఫ్లోర్ క్లీనర్ ఉపయోగపడుతుంది.

ఒక్కసారి మీ ఇంట్లో ఈ ప్రాడక్ట్ ను ఉపయోగించి, మీ విలువైన అభిప్రాయాన్ని తెలియపరచండి.

Tinystep ఫ్లోర్ క్లీనర్ ఆర్డర్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon