Link copied!
Sign in / Sign up
6
Shares

ప్రెగ్నెన్సీ సమయంలో సెక్స్ గురించి నమ్మకూడని 5 అపోహలు


చాలా మంది ప్రెగ్నెన్సీ సమయంలో సెక్స్ చేయకూడదని అంటారు. ప్రెగ్నెన్సీ సమయంలో మహిళ ఎక్కువ సెక్స్ కావాలని కోరుకుంటుందట. మగవారు కూడా ఆ సమయంలో భార్య ఏమి అడిగినా చేస్తూ ఎంతో అనుకూలంగా ఉంటూ సెక్స్‌ను ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇంకో విషయం ఏమిటంటే, ప్రెగ్నెన్సీ మొదటి మూడు నెలల్లో మరియూ చివరి 4 వారాల్లో భార్యభర్తలు ఎక్కువ సెక్స్‌లో పాల్గొంటారట.

అయితే వీటి గురించి కొన్ని అపోహలు ఉన్నాయి అవేంటో చూద్దాం.

ప్రెగ్నెన్సీ అప్పుడూ స్కలనం జరిగితే

ప్రెగ్నెన్సీ అప్పుడు స్కలనం జరిగితే ప్రెగ్నెన్సీ మిస్ క్యారేజ్ అయ్యే అవకాశం ఉందని అంటారు. అందులో ఎంత మాత్రం నిజం లేదు. సెక్స్ చేసేటప్పుడు మీ యుటెరస్ భాగం సంకోచం వ్యాకోచం చెంది చురుకుగా అవుతుంది కానీ ఎటూవంటి డ్యామేజ్ జరగదు.

బేబి తలకు

మీరు సెక్స్ చేసేటప్పుడు బేబీ తలకు ఇబ్బంది జరిగే అవకాశం ఉందని చాలా మంది అంటూ ఉంటారు. కానీ అందులో ఎంతమాత్రం నిజం లేదు. ఎందుకంటే, మీ బిడ్డ లోపల ఎంతో జాగ్రత్తగా రక్షణ వలయంలో ఉంటాడు. అతనికి ఎటువంటీ ఇబ్బందీ జరగదు.

బేబీలు గుర్తిస్తారా

మీరు సెక్స్ చేసుకొనేటప్పుడు మీ బేబీకి తెలుస్తుందని చాలా మంది అంటుంటారు. అది నిజం కాదు. ఆ విషయాలు గుర్తించేంత స్థాయిలో బేబీ ఉండదు. మీరు మీ అమ్మ కడుపులో ఉన్నప్పుడు కూడా మీ నాన్న సెక్స్ చేసింటారు. ఇది చాలా కామన్ విషయం.

సెక్స్ అసాధ్యం

ప్రెగ్నెన్సీ సమయంలో సెక్స్ చేయడం సాధ్యం కాదని చాలా మంది అంటారు. కానీ అందులో నిజం లేదు. అయితే ఆ సమయంలో సెక్స్ కొంచెం నిదానంగా చేయడం మంచిది. భార్య కడుపు మీద, బ్రెస్ట్స్ మీద ఎటువంటి ఒత్తిడి లేకుండా నిదానంగా చేయడం వల్ల మంచి సెక్స్‌ను మీరు ఆస్వాదించవచ్చు.

ఓరల్ సెక్స్

ప్రెగ్నెన్సీ సమయంలో ‘ఓరల్ సెక్స్ అన్నది చాలా హానికరం’ అని చాలా మంది అభిప్రాయం. అయితే ఓరల్ సెక్స్ చేయడం హానికరం కాదు. పైపెచ్చు ఈ సెక్స్ చేయడం వల్ల మహిళలు రిలీఫ్ పొందుతారు. అయితే సెక్స్ చేసేటప్పుడు వెజినాలోకి గాలి ఊపడం మాత్రం మంచిది కాదని గుర్తు పెట్టుకోండి.

 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon