ప్రెగ్నన్సీ సమయంలో రక్తస్రావం జరిగితే కడుపులోని బిడ్డకు ప్రమాదమా? వెంటనే ఏం చేయాలి..!
మొదటి మూడు నెలలలో రక్తస్రావం అనేది మాములు విషయమే. రక్తస్రావం కావడానికి అనేక కారణాలు ఉన్నాయి. ప్రెగ్నన్సీ సమయంలో రక్తస్రావం ఎందుకవుతుంది అందుకు గల కారణాలు ఏంటో ఇక్కడ తెలుసుకోండి…
రక్తస్రావం సాధారణంగా కడుపు నొప్పి, వికారం మరియు వాంతులు తో కలిపి వస్తుంది. ఇది గర్భధారణ సమయంలో సంభవించవచ్చు మరియు వివిద నెలలలో భిన్న కారణాలు వలన సంభవిస్తుంది.
మొదటి మూడు నెలలలో రక్తస్రావం స్పాట్టింగ్ వల్ల వస్తుంది. స్పాట్టింగ్ కు కారణాలు ఇవే…
1. ఇంప్లాంటేషన్
2. ఇన్ఫెక్షన్
3. సెర్వికల్ పోలీప్స్
ప్రెగ్నన్సీ అపుడు స్పాట్టింగ్ సహజమే. ఇది వేరే రక్తస్రావాలు కన్నా భిన్నమైనది. ఏదైనా ఇన్ఫెక్షన్ లాంటిది వస్తే డాక్టరు ను సంప్రదించండి. డాక్టర్ ఆంటిబయోటిక్ మందులు వాడమని సూచిస్తారు.
ఒకవేళ రక్తస్రావం గనక ఎక్కువగా ఉంటె , ఇది ఒక తీవ్రమైన సమస్య కావచ్చు.
మొదటి ట్రైమిస్టర్(3 నెలలు) లో రక్తస్రావానికి గల కారణాలు ఈ క్రింది ఉన్నవి కావచ్చు:
1. మోలార్ ప్రెగ్నన్సీ
ఈ పరిస్థితిలో ఒక అసాధారణ కణజాల పెరుగుదల ఉంటుంది. ఇది చాలా అరుదు, మరియు కొన్ని సందర్భాల్లో మహిళలు మోలార్ ప్రెగ్నన్సీ
అభివృద్ధి చెంది , అసాధారణ కణజాలం క్యాన్సర్ గా మారుతుంది , శరీరం యొక్క ఇతర భాగాలకు కూడా ఇది వ్యాపిస్తుంది. ఇటువంటి పరిస్థితి లో వెంటనే డాక్టర్ ని సంప్రదించాలి.
2. ఎక్టోపిక్ ప్రెగ్నన్సీ
ఎక్టోపిక్ ప్రెగ్నన్సీ వచ్చిన సందర్భాల్లో శిశువు పిండం బయట అమర్చబడి ఉంటుంది.ఇది సాధారణంగా ఫెలోపియన్ ట్యూబ్లో అమర్చబడుతుంది, ఇది గుర్తించబడకపోతే, ఫెలోపియన్ ట్యూబ్ ప్రేలుటకు కారణమవుతుంది, ఇది తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు కారణమవుతుంది.
రెండవ మరియు మూడవ ట్రైమిస్టర్ అప్పుడు రక్తస్రావం ఇంకా ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. దీనిని నిర్లక్ష్యం చేయకూడదు. రెండవ మరియు మూడవ ట్రిమ్స్టెర్స్ సమయంలో రక్తస్రావం కలిగించే అనేక కారణాలు ఉన్నాయి.
1. ప్లాసెంటా ప్రీవియ
ఇటువంటి సమయము లో ప్లాసెంటా శిశు జన్మమార్గము ను అడ్డుకుంటుంది. ఇది చాలా అరుదు కానీ తీవ్రమైనది ఎన్నో సమయసలను తెచ్చిపెడుతుంది. ఇలాంటి సమయములో వెంటనే డాక్టర్ ను సంప్రదించ వలసిన అవసరం ఉంది .
2. ప్లాసెంటాల్ అబ్రుప్షన్
ఈ సందర్భం లో ప్లాసెంటా బిడ్డ పుట్టకముందే గర్భాశయం నుండి విడిపోతుంది. దీని వలన ప్లాసెంటా మరియు గర్భాశయం మధ్యలో రక్తస్రావం అవుతుంది. ఇది తల్లి మరియు బిడ్డ ఇద్దరికీ ప్రమాదకరం వెంటనే డాక్టరును సంప్రదించి చికిత్స చేయాలి.
3. కాన్పు నొప్పులు ముందే రావడం
కొన్ని సార్లు రక్త స్రావం ప్రీమెచ్యూర్ లేబర్ వల్ల కూడా రావొచ్చు. ప్రెగ్నన్సీ మొదట్లో రక్తస్రావం అనేది చాలా మాములు విషయం. కానీ ప్రెగ్నన్సీ చివరి లో వచ్చినట్లు అయితే తగిన జాగర్తలు తీసుకోవలసిన అవసరం ఉంది. ప్రెగ్నన్సీ చివర్లో వచ్చే రక్తస్రావం వలన తల్లి మరియు బిడ్డ ఇద్దరికీ ప్రమాదం పొంచి ఉంది. అంతే కాకుండా డెలివరీ అప్పుడు ఇబ్బందులు కలిగిస్తుంది.