Link copied!
Sign in / Sign up
10
Shares

ప్రగ్నన్సీ సమయంలో ప్రతి మహిళకు వచ్చే 4 సమస్యలు ఇవే : అవేంటో తెలుసుకుని జాగ్రత్తపడండి

గర్భం దాల్చడం అనేది అత్యుత్తమమైన విషయం. ఆ సమయంలో మీరు మీకు నచ్చినట్లు ఉండవచ్చు, మీకు నచ్చిన డ్రెస్ వేసుకోవచ్చు, మీకు నచ్చిన ఆహారాన్ని తీసుకోవచ్చు, మీరు ఎంతసేపు కావాలంటే అంతసేపు పడుకోవచ్చు. ఇలా మీకు ఆ సమయం అంతా సంతోషంగానే ఉంటుంది. అయితే ఆ సమయంలో కొన్ని ఇబ్బంది కలిగించే విషయాలు కూడా ఉన్నాయి. అవేంటంటే

మార్నింగ్ సిక్‌నెస్

చాలా మంది గర్భవతులలో మార్నింగ్ సిక్‌నెస్ అనేది చాలా కామన్. వికారంగా ఉండటం, వాంతి వచ్చేలా ఉండటం, పైత్యం లాగా ఉండటం వంటివి గమనించవచ్చు. దీటిని తగ్గించుకోవడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి.

- రోజులో ఎక్కువగా పానీయాలు తీసుకోవడం పుల్లని పళ్ళ రసం తీసుకోవడం, అల్లం టీ తాగడం చేయాలి.

- సులభంగా జీర్ణం అయ్యే ఆహారాన్ని తీసుకోండి, మసాలాల జోలికి వెళ్ళకపోవడం మంచిది.

- వికారంగా ఉంటే వగరు పదార్థాలను తీసుకోండి.

మలబద్ధకం

చాలా మంది గర్భవతుల్లో మలబద్ధకం ఒక సమస్యలా ఉంటుంది. నరాలు వాయడం, పెల్విక్ భాగలో ఒత్తిడి ఉండటం, ప్రొజెస్టిరాన్ హార్మోన్ ఎక్కువ మోతాదులో విడుదల అవడం వల్ల ఈ సమస్య వస్తుంది. దీనిని తగ్గించుకోవడానికి,

- ఫైబర్ ఎక్కువ ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి,

- నీరు వీలైనంత ఎక్కువగా తీసుకోవాలి

- ప్రతిరోజూ వేడినీటి స్నానం చేయాలి.

తలనొప్పి

ప్రగ్నెన్సీ మహిళల్లో కనిపించే మరో సాధారణ సమస్య తలనొప్పి. మీకు ఆకలి అయినప్పుడు లేదా మీ మూడ్ బాగోలేనప్పుడు తలనొప్పి వస్తుంది. దీన్ని మీరు కోపం రూపంలో ప్రదర్శిస్తారు. దీనిని తగ్గించుకోవాలంటే,

- మీ శరీరంలో ఉన్న ఉష్ణోగ్రతను తగ్గించుకోవాలి

- అప్పుడప్పుడు తలకు  మసాజ్ చేసుకోని రిలాక్స్ అవ్వాలి

- కొద్దిసేపు మెడిటేషన్ చేయడం ద్వారా కూడా తలనొప్పికి చెక్ పెట్టవచ్చు.

మంట లేదా నొప్పి
చాలా మంది మహిళలకు చెస్ట్ దగ్గర లేక గొంతులో మంటగా ఉంటుంది. దీని వల్ల మీరు చాలా అసౌకర్యానికి గురవుతారు. దీనికి పరిష్కారం ఏమిటంటే,

- చల్లని పానీయాలు తీసుకోండి

- తిన్న తర్వాత వెంటనే నిద్రపోకుండా కాస్త సమయం తీసుకొని నిద్రపోవడం వల్ల మీకు మంట తగ్గే అవకాశం ఉంటుంది

పై సమస్యలకు ఇచ్చిన పరిష్కారాలను ఫాలో అవడం వల్ల చాలా వరకు వాటిని నియంత్రించి ఆనందమైన ప్రెగ్నెన్సీ జీవితాన్ని ఎంజాయ్ చేయవచ్చు.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon