Link copied!
Sign in / Sign up
30
Shares

ప్రెగ్నన్సీ సమయంలో ప్రశాంతంగా నిద్రపోవడం ఎలా?

తల్లి అవడం ఎంత సంతోషాన్ని ఇస్తుందో, ప్రెగ్నెన్సీ సమయంలో అన్ని ఇబ్బందులు కూడా పడాల్సి వస్తుంది. మరో జీవిని సృష్టించడమంటే మామూలు విషయం కాదు. ఈ క్రమంలో మహిళ ఎన్నో శారీరక, మానసిక ఇబ్బందులకు గురి అవుతుంది. తినడం, పడుకోవడం, మరియూ ఇతర కార్యక్రమాలు చేయడం అంత సులభమైన విషయం కాదు. మరీ ముఖ్యంగా నిద్ర విషయంలో గర్బిణీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ 9 నెలలూ నిద్ర సరిగ్గా ఉండకపోవచ్చు.  అంతేకాక, నిద్రా-వలయాలు(స్లీప్ సైకిల్స్) కూడా ఉంటాయి. ఈ నిద్రా-వలయాలు రావడానికి ముఖ్య కారణం హార్మోన్స్ అసమతుల్యం.

హార్మోన్స్ కీలకం

బిడ్డ కడుపులో ఉన్నప్పుడు, శరీరంలో చాలా మార్పులు వస్తాయి. అవేంటంటే, భౌతికంగా మార్పు రావడం, మీ జీవక్రియ రేటు పెరగడం, ఎమోషన్స్‌ను అదుపులో పెట్టుకోలేకపోవడం వంటీవి జరుగుతాయి. దీనికి కారణం ఏంటంటే, మహిళల శరీరంలో సాధారణంగా విడుదల అయ్యే ప్రొజెస్టరాన్, ఈస్ట్రోజన్, మెలటోనిన్, ప్రొలాక్టిన్, ఆక్సీటోసిన్ వంటి హార్మోన్స్ గర్భవతిగా ఉన్నప్పుడు అత్యంత ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. వీటి ప్రభావం మహిళల నిద్రపై ఎక్కువగా ఉంటుంది.

ప్రొజెస్టరాన్ వల్ల మీ కండరాలు బలహీనంగా మారి ఎక్కువగా యూరిన్‌కు వెళ్ళవలసి రావచ్చు, మీ గుండెలో కొంత మంటగా అనిపించవచ్చు, జలుబు చేయవచ్చు. వీటన్నిటి వల్ల మీకు సరిగ్గా నిద్ర పట్టకపోవచ్చు. ఈస్ట్రోజన్ వల్ల ముక్కు రంద్రాలు మూసుకుపోతాయి, మీ శరీరంలోని రక్తనాళాలు వ్యాకోచం చెంది తద్వారా కాళ్ళు వాపు వచ్చే అవకాశం ఉంది. ఎక్కువ మోతాదులో మెలటోనిన్, ప్రొలాక్టిన్ విడుదల అవడం వల్ల శరీరంలో పాల ఉత్పత్తి పెరుగుతుంది దీని వల్ల మీ బ్రెస్ట్ పెరిగి మీరు నిద్రపోయేటప్పుడు ఇబ్బంది కలిగిస్తాయి. ఆక్సిటోసిన్ వల్ల కూడా కండరాలు వ్యాకోచం చెంది మీకు నిద్రాబంగం కలిగిస్తాయి.

గర్భిణీగా ఉండే సమయంలో కలిగే నిద్రాభంగ వలయాలను 3 త్రైమాసికాలుగా విభజించారు. అవి,

మొదటి త్రైమాసికం

మొదటి మూడు నెలల సమయంలో పగటిపూట మీకు ఎక్కువగా ఆవులింతలు వస్తుంటాయి కానీ నిద్ర రాదు. రాత్రిపూట బాగా నిద్ర వస్తుంది కానీ మధ్యలో మెలుకువ వచ్చే అవకాశం ఉంది.

మొదటి త్రైమాసికంలో బ్రెస్ట్ పెరగడం, ఎక్కువగా యూరిన్‌కు వెళ్ళడం, వెన్నునొప్పితో బాధపడటం, ఎక్కువ ఆకలికి గురవడం వంటివి జరుగుతాయి. ఐరన్ లోపం ఎక్కువ ఉన్న మహిళలలో ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

రెండవ త్రైమాసికం

గర్బిణీ సమయంలోని 13 వారం నుండి 28వ వారం వరకు ఉండే సమయాన్ని 2వ త్రైమాసికం అంటారు. ఈ దశలో రాత్రిపూట ఎక్కువ నిద్ర వస్తుంది దీంతో మీకు మునుపటి కన్నా కొంచెం బాగా నిద్రపోతారు.

రెండవ త్రైమాసికంలో నిద్రపోవడానికి కొంచెం ఎక్కువ ఆస్కారం ఉన్నప్పటికి, కండరాలు వ్యాకోచించడం, ముక్కుదిబ్బడ ఎక్కువ అవడం, నిద్రలో గురక పెట్టడం వంటివి జరుగుతాయి.

మూడవ త్రైమాసికం

29వ వారం నుండి చివరి వరకు ఉండే సమయాన్ని  మూడవ త్రైమాసికం అంటారు. ఈ సమయంలో లోపల బిడ్డ కదలికలు ఎక్కువగా ఉండటంతో రాత్రిపూట ఎక్కువగా మెలుకువ వచ్చే అవకాశం ఉంది. దీని వల్ల మీకు పగలు ఎక్కువ నిద్ర వచ్చే అవకాశం ఉంది. ఈ దశలో ఎక్కువగా నిద్రలేమికి గురవుతారు.

మూడవ త్రైమాసికంలో కాళ్ళు వాపులు రావడం, బ్రెస్ట్ వ్యాకోచించడం, బ్రెస్ట్ దురద పెట్టడం, వెన్నునొప్పి రావడం, కీళ్ళ నొప్పులు రావడం, ఎక్కువగా కలలు రావడం వంటివి జరుగుతాయి.

అయితే అవన్నీ అందరికీ అనుభవం అవ్వకపోవచ్చు. ఎందుకంటే, హార్మోన్స్ సమతుల్యత సరిగ్గా ఉంటే ఇవి మీదరి చేరకపోవచ్చు. మీకు నిద్రపోవడానికి అనువుగా దిండును పెట్టుకోవడం మంచిది. క్రమం తప్పకుండా వాకింగ్ చేయడం, మెడిటేషన్ చేయడం, సంగీతం వినడం వంటివి చేయడం వల్ల ఎక్కువసేపు నిద్రపోవడానికి ఆస్కారం ఉంటుంది.

వీటన్నిటితో పాటూ, మీ భర్త, మీ కుటుంభం యొక్క సపోర్ట్ మీకు ఉండటం వల్ల మీ ఇబ్బందులన్ని మీరు సులభంగా అధికమిస్తారు. మీరు ఎన్ని ఇబ్బందులు పడినా మీకు పుట్టిన పాప/బాబును చూస్తే అవన్నీ మర్చిపోతారు. అలాగే నిద్ర వలన కలిగే 10 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇది క్లిక్ చేసి చూడండి..

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon