Link copied!
Sign in / Sign up
0
Shares

ప్రెగ్నన్సీ సమయంలో పొడి చర్మం నుండి రక్షించుకోడానికి 6 చిట్కాలు


పొడిచర్మం అనేది గర్భధారణ సమయాలలో స్వల్ప సమస్యలలో ఒకటి. సరైన చికిత్స లేదా జాగర్తలు తీసుకుంటే ఈ సమస్య బారి నుండి సులువుగా బయట పడవచ్చు. మీ చర్మాన్ని జాగర్తగా చూసుకోండి లేదా అది ఎన్నో చర్మసమస్యలు దారి తీస్తుంది. ఒక మోయిస్తూరిజింగ్ రొటీన్ పొడి చర్మం రాకుండా కాపాడుతుంది.

ఈ క్రింది ఉన్న చిట్కాలు పాటించుటకు ఎంతో సులభం మరియు గర్భధారణ సమయం లో మీ చర్మాన్ని కాంతివంతంగాను చేస్తాయి.

1. విటమిన్ 'ఈ' నూనె ( Vitamin E oil )

ఇది తరచూ అందరు సిఫారసు చేసే చిట్కా. ఈ నూనెను తరచూ ఉపయోగించినట్లు అయితే అది పొడిచర్మం మరియు దురద నుండి నివారణకు సహాయపడుతుంది.

2. పెరుగు

పెరుగు మీ చర్మంకు ఒక మృదువైన మిణుగురును తెచ్చే తేమను కలిగి ఉంటుంది. ఫలితాలను పొందడానికి రోజుకు ఒకసారి ప్రభావిత ప్రాంతంలోని పెరుగును రుద్దండి.

3. స్నానం చేసే సమయం

ఎక్కువ సేపు స్నానం చేయడం నెప్పిలు వంటి వాటిని తగ్గించవచ్చేమో కానీ అది పొడి చర్మానికి దారి తీస్తుంది. స్నానం చేయడానికి ఎక్కువ సమయం కేటాయించకండి. స్నానం చేస్తున్నప్పుడు, సబ్బులు మీ చర్మంని లేతగా ఉంచే వాటిగా చూసి ఉపయోగించండి.

4. ఆవిరిని నివారించండి

ఆవిరి తీసుకోవడం మీ చర్మంలో ఉన్న చనిపోయిన కణాలను మరియు మురికిను శుభ్రం చేస్తుంది కానీ అదే సమయంలో పొడి చర్మానికి దారి తీస్తుంది. గర్భధారణ సమయంలో ఆవిరిని నివారించండి.

5. పీల్ మరియు స్కర్బ్స్  ఉపయోగించవద్దు

పీల్ మరియు స్కర్బ్స్ సాధారణ చర్మానికి వారానికి రొండు సార్లు సిఫార్సు చేస్తారు. కానీ గర్భధారణ సమయంలో చర్మం మరీ సున్నితంగా ఉండటం వలన అవి మీ చర్మాన్ని పొడిగా చేస్తాయి. ఇప్పటికే మీకు దురద వంటివి ఉంటాయి ఇవి వాటిని ఇంకా పెంచుతాయి. ఇలాంటి చర్మాన్ని శుభ్రపరిచే విందనాలు కాకుండా తేనే మరియు పెరుగు కలిపి ఉన్న ప్యాక్ ని ఉపయోగించండి.

6. నీళ్లు త్రాగండి

నీళ్లు త్రాగడం గర్భధారణ సమయంలోనే కాదు మాములు సమయంలో కూడా మీ చర్మం యొక్క తేమను సంరక్షిస్తుంది. ఇది మీకు మరియు మిలో ఉన్న మీ బిడ్డకు కూడా ఎంతో మంచిది. తగినంత నీరు తాగుతూ మోయిస్తూరిజర్ ఉపయోగించినట్లు అయితే మంచి ఫలితం లభిస్తుంది. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon