Link copied!
Sign in / Sign up
1
Shares

ప్రెగ్నన్సీ సమయంలో పైన్ ఆపిల్ తినవచ్చా? తినకూడదా..!!

ప్రగ్నన్సీతో ఉన్నప్పుడు మీకు అనేక మంది అనేక సలహాలు ఇస్తూవుంటారు. వాటిలో మీకు ఉపయోగపడేవి కొన్ని అయితే మిమ్మల్ని భయపెట్టేవి కొన్ని. ఇది చేయకూడదు, ఇది తినకూడదు అని చాలా మంది చెప్తూవుంటారు. అలానే ప్రెగ్నన్సీ సమయంలో పైన్ ఆపిల్ తినకూడదని చాలా మంది చెప్తూవుంటారు. అందులో నిజమెంతో ఇక్కడ చూద్దాం…

ప్రెగ్నన్సీ సమయంలో పైన్ ఆపిల్ తినొచ్చా…

ప్రెగ్నన్సీ సమయంలో పైన్ ఆపిల్ తినడంలో ఏ ప్రమాదం లేదు. ప్రెగ్నన్సీ సమయంలో పైన్ ఆపిల్ తింటే ప్రమాదం అని చెప్పడానికి ఏ శాస్త్రీయ ఆధారాలు లేవు. సహజంగా పైన్ ఆపిల్ తింటే నొప్పులు ముందే వస్తాయని చాలా మంది అనుకుంటారు. సహజంగా గర్భం పోడానికి కానీ, నెలలు నిండకుండానే నొప్పులు రాడానికి కారణం బ్రోమిలైన్ అనే పదార్ధం. అందుకే బ్రోమిలైన్ టాబ్లెట్స్ ను ప్రెగ్నన్సీ సమయంలో తీసుకోవద్దని డాక్టర్లు చెపుతారు. కానీ పైన్ ఆపిల్ లో ఉండే బ్రోమిలైన్ చాలా తక్కువ మోతాదులో వుంటూ ఉంటుంది. అది మీకు ఏ విధమైన గర్భ నిరోధకాన్ని కలిగించదు. నిజంగా పైన్ ఆపిల్ ద్వారా ప్రమాదం జరగాలంటే మీరు ఒకేసారి 7 పైన్ ఆపిల్స్ తినాలి. అలాంటిది జరగదు కాబట్టి, ప్రెగ్నన్సీ సమయంలో పైన్ ఆపిల్ తినడం ప్రమాదం ఏమి కాదు.                       

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon