Link copied!
Sign in / Sign up
5
Shares

ప్రెగ్నన్సీ సమయంలో మీరు, మీ బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే ఏమి చేయాలి?


ఈ విధానాలను అలవాటు చేసుకోవడం వలన మీరు గర్భవతి గా ఉన్నపుడు ఆరోగ్యంగా ఉండగలరు. గర్భవతి గా ఉన్నపుడు ఆరోగ్యంగా ఉండటం కూడా ఎంతో కీలకమైనది. దానివల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. వాటిలో కొన్ని మంచి నిద్ర, తక్కువ ఒత్తిడి, ఆత్మ విశ్వాసం పెరగడం. ప్రెగ్నన్సీ తరువాత మీ బరువు పెరగకుండా కాపాడుతుంది. అందుకు మీరు చేయాల్సిన పనులు ఇవే...

1. స్వీట్స్ మరియు చిరుతిండ్లకు దూరంగా ఉండాలి

ఇటువంటి సమయం లోనే ఇంటికి వచ్చే అతిధులు స్వీట్స్ లాంటి వాటిని ఎక్కువగా ఇస్తూ ఉంటారు. కానీ వాటికీ దూరంగా ఉండటమే మంచిది. మీ శరీరం లో కొవ్వు ఉత్పత్తి పెరుగుతుంది. దాని వలన మీకు ప్రెగ్నన్సీ తరువాత బరువు తగ్గడం కష్టం అవుతుంది.

2. నీళ్లు తాగండి

నీళ్లు తాగడం వలన హైడ్రాటెడ్ గాను మరియు ఆరోగ్యవంతంగాను ఉంటారు. తినేముందు ఒక గ్లాసు నీళ్లు తాగండి. అది మిమల్ని ఎక్కువ తినకుండా కాపాడుతుంది. స్వీట్స్ లాంటి పదార్ధాలను తినాలనే వాంఛను కూడా తగ్గిస్తుంది.

౩. నిద్రపోండి

మీ శరీరం లో ఎన్నో మార్పులు జరుగుతున్నాయి కనుక మీ శరీరానికి వాటికీ అలవాటు పాడటానికి కొంచెం సమయం తీసుకుంటుంది. నిద్రపోవడం అనేది మీ శరీరం లో జరిగే మార్పులు కి అది అలవాటే పాడటానికి ఇచ్చే వరం తో సమానం. పడుకునేటప్పుడు చీకటి గ ఉన్న ప్రదేశం లో పడుకోండి. అది మీకు కనీసం 6 నుండి 8 గంటల నిద్రను ఇస్తుంది. మధ్యాహ్నం వేళా మీరు కలిగే ఉన్న సమయం లో కూడా నిద్రపోండి.

4 . వ్యాయామం

మీరు గర్భవతి గ ఉన్నందువలన ఎప్పుడు విశ్రాంతి తీసుకుంటూ ఉండకూడదు. అప్పుడపుడు వ్యాయామం కూడా చేయాలి. ముందు గా స్ట్రెచెస్ తో ప్రారంభించి తరువాత మెల్ల మెల్లగా క్లిష్టమైన వ్యాయామాలు చేయండి. ఈ సమయం లో నిపుణుల సహాయం పొంది జాగర్తలు తీసుకుంటూ చేయండి.

5. నిటారు గా నిలుచోవాలి

భంగిమ ఆరోగ్యం కి ఎంతో కీలకమైనది. మంచి భంగిమ మీ లోపల ఉన్న బిడ్డ ను సౌకర్యవంతగా ఉండేలా చేస్తుంది. మంచి భంగిమ మీ నడుము నొప్పి  మరియు వెన్ను నొప్పిని తగ్గిస్తుంది. అంతే కాకుండ కటి కండరము ను బలపరుస్తుంది.

6. ప్రోటీన్లు

పెరుగు, జున్ను , పన్నీర్ , గుడ్లు, చికెన్ మరియు పాలు ఎక్కువగా తినండి. వీటిలో ప్రోటీన్లు మోతాదు ఎక్కువగా ఉంటుంది. ఇవి మీకు చిరు తిండ్లు తినాలనే వాంఛ తగ్గించి కడుపు నిండిన భావాన్ని మీకు ఇస్తుంది. ప్రోటీన్లు మీకు మరియు మిలో పెరుగుతున్న బిడ్డ కి ఎంతో కీలకమైనది.

7. ధ్యానం

యోగ మరియు ధ్యానం ప్రతిరోజు చేయండి. ఇది మీకు ప్రశాంతత ను ఇస్తుంది. అంతే కాకుండా జీవితం లో ఏ కష్టం వచ్చిన దానిని ఎదురుకునే ధైర్యాన్ని ఇస్తుంది. ధ్యానం మీకు మీ జీవితం పైన ఒక నియంత్రణ ను ఏర్పరుస్తుంది.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon