Link copied!
Sign in / Sign up
4
Shares

ప్రగ్నన్సీ సమయంలో మునగ కాయలు తింటే ప్రసవ సమయంలో నొప్పులు తగ్గుతాయా..?

గర్భం దాల్చిన తర్వాత ఏ ఆహారం తీసుకోవాలి, ఎటువంటి ఆహారాన్ని తీసుకుంటే తల్లికీ, బిడ్డకు మంచిది అని చాలామంది మహిళలకు ఉన్న అనుమానం. అలాగే ప్రగ్నన్సీ సమయంలో మునగ తీసుకోవడం ప్రమాదమా..! అని ఓ మహిళ అడిగిన ప్రశ్నకు వివరంగా ఇక్కడ సమాధానం తెలుసుకోండి. మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి..

భయపడాల్సిన అవసరం లేదు

గర్భం దాల్చిన తర్వాత మీరు తినాల్సిన ఆరోగ్యకరమైన ఆహారంలో ములక్కాడ ఒకటి. మునగకాయలను లేదా మునగ ఆకుతో గానీ మునగ సూప్ ను తీసుకోవడం వలన ప్రెగ్నన్సీ సమయంలో నొప్పులను తగ్గిస్తుంది. రక్తస్రావం జరగకుండా కాపాడుతుంది. బిడ్డ సులభంగా ప్రసవం అయ్యేలా తోడ్పడుతుంది. ప్రసవానికి ముందు మరియు తర్వాత వచ్చే సమస్యలు మునగ వలన దూరం అవుతాయి.

తల తిరగడం వికారం

గర్భం దాల్చిన తర్వాత చాలామంది మహిళలలో ఉండే సమస్య ఉదయం నిద్రలేవగానే వికారం, వాంతులు, తల తిరగడం, యాక్టివ్ గా ఉండకపోవడం, అలసట ఉంటాయి. ఐతే మునగను (డ్రమ్ స్టిక్) తీసుకోవడం వలన ఈ సమస్యలు ఉండవు.

పాలు బాగా పడతాయి

ప్రగ్నన్సీ సమయంలోనే కాకుండా ప్రసవం తర్వాత కూడా నిరభ్యంతరంగా మునగను తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. బాలింతలు మునగను తీసుకోవడం వలన పాలు బాగా పడతాయి. ఇందులో విటమిన్ సి ఉండటం వలన ఇన్ఫెక్షన్స్ దరిచేరకుండా ఆపుతుంది మరియు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.

రక్తాన్ని శుద్ధి చేస్తుంది

ప్రెగ్నన్సీ సమయంలో చాలావరకు మహిళలు బలహీనంగా ఉంటారు కాబట్టి మునగను తీసుకోవడం వలన ఎముకలు దృఢంగా, బలంగా ఉండేలా తోడ్పడుతుంది మరియు రక్తాన్ని శుద్ధి చేస్తుంది ఇందులో అధిక మోతాదులో కాల్షియం, విటమిన్, ఐరన్ ఉండటం వలన ఎముకలు బలంగా తయారవుతాయి. అలాగే మునగ ఆకులను పాలతో కలిపి తీసుకోవడం వలన మీ ఆరోగ్యానికే మంచిది.

డయాబెటిస్ ఉన్నవారు మునగ తీసుకోవచ్చా..

మధుమేహ బాధితులు మునగ ఆకు, మునగ కాయలు తీసుకోవచ్చా అని భయపడుతూ ఉంటారు. ఎటువంటి భయం లేకుండా మీ డైలీ ఆహారంలో మునగ ఆకును భాగంగా చేసుకోవడం వలన రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు కంట్రోల్ లో ఉంటాయి. డయాబెటిస్ తో బాధపడుతున్న గర్భిణీ మహిళలు కూడా తీసుకోవచ్చు.

ఆ సామర్థ్యం

మునగ పూలను ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో కలుపుకుని తాగడం వలన ఆ  సామర్థ్యం పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మగ, ఆడ ఇద్దరూ ఈ పదార్థాన్ని తీసుకోవచ్చు. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon