Link copied!
Sign in / Sign up
17
Shares

ప్రెగ్నన్సీ సమయంలో మార్నింగ్ సిక్ నెస్ పోగొట్టడం ఎలా? ఈ ఆహారాలు తీసుకుంటే చాలు

!{ad_unit_600_200}!}

భయాలు- కారణాలు - తరుణోపాయాలు

మనలో కొంతమందికి ఉదయం లేవగానే నీరసంగా, బద్ధకంగా, అలసటగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఏదో అనారోగ్యం ఆవరించిన ఫీలింగ్ కలుగుతుంది. ఇక గర్భవతుల్లో అయితే కొంతకాలం వరకూ ఉదయం లేవగానే వాంతి వస్తున్నట్టు, వికారంగానూ ఉంటుంది. దీన్ని మార్నింగ్ సిక్ నెస్ అంటారు. ఈ నీరసం దానంతట అదే పోతుందిలే అనుకుంటాం కానీ పోదు. గర్భం ధరించిన ఆరో వారంలో ప్రారంభమయ్యే ఈ మార్నింగ్ సిక్ నెస్ 14వ వారందాకా ఉంటుంది. ఈ సిక్ నెస్ పొద్దుటపూట మాత్రమే వస్తుందని అనుకోడానికి వీల్లేదు. రోజులో ఏ సమయంలోనైనా రావచ్చు.

భయాలు :

1. మార్నింగ్ సిక్ నెస్ మహిళల్ని భయపెడుతుంది. కడుపులో పెరిగే పిండం విచ్ఛిన్నమవుతుందేమోనని ఆందోళన చెందుతారు. కానీ అలాంటిదేం జరగదు. అయితే తరచు వాంతులవుతుంటే మాత్రం డాక్టర్ ను సంప్రదించాలి.

2. మందకొడిగా ఉండడం, ద్రవాహారం లేదా ఘనపదార్థాలు తీసుకున్నా జీర్ణం కాకపోవడం, మూత్రం చిక్కగా, తక్కువగా రావడం, ఒక్కోసారి కొద్దిగా రక్తం పడడం –ఈ మార్నింగ్ సిక్ నెస్ లక్షణాలు.

3. గర్భిణుల్లో ఈ లక్షణాల తీవ్రత చాలా అరుదు. అయితే ఏదోక సమయంలో కేవలం ఒక శాతం గర్భవతుల్లో మాత్రం ఈ మార్నింగ్ సిక్ నెస్ లక్షణాలు అధికంగా కనిపిస్తాయని పరిశోధనల్లో తేలింది. గర్భం ధరించిన అయిదో నెలకల్లా మార్నింగ్ సిక్ నెస్ దానంతట అదే దూరమవుతుందని 90 శాతం కేసుల్లో తేలింది.

4. ఈ సమయంలో మహిళలు కాస్త బరువు తగ్గడం మామూలే. తీసుకున్న ఆహారం సరిగా జీర్ణం కాకపోవడమే ఇందుకు కారణం. కానీ, సడెన్ గా ఎక్కువ బరువు తగ్గితే మాత్రం డాక్టర్ కు చూపించుకోవడం మంచిది.

కారణాలు :

1. గర్భం ధరించిన తర్వాత శరీరంలో హార్మోన్లు ఎక్కువ కావడంవల్లే కొన్ని రోజులవరకూ వికారంగా ఉండి, వాంతులు అవుతాయి. ఈస్ట్రొజెన్, ప్రొజెస్టెరోన్ హార్మోనుల ప్రభావం వల్ల ఇలా జరుగుతుంది. ముందే కాన్పు రాకుండా ప్రొజెస్టెరోన్ హార్మోనులు ఆపుతాయి. అయితే అదే సమయంలో కడుపులో కండరాలు వ్యాకోచం చెందడంవల్ల గ్యాస్ట్రిక్ యాసిడ్స్ అధికంగా ఉత్పత్తి అవుతాయి.

2. గర్భం ధరించిన తర్వాత ఆడవాళ్లకు రుచికరమైనవి తినాలనిపిస్తుంది. వికారం కలగడానికి ఇది కూడా ఒక కారణం.

3. కడుపుతో ఉన్న సమయంలో స్త్రీలు ఏదైనా కలుషితాహారం తీసు కుంటే అది పిండాన్ని చేరకుండా ఉండేందుకే ఇలా మార్నింగ్ సిక్ నెస్ ఉంటుందని కొందరు డాక్టర్లు చెబుతారు.

4. కడుపులో ఒకటి కంటే ఎక్కువ పిండాలు పెరుగుతుంటే మార్నింగ్ సిక్ నెస్ ప్రభావం కూడా పెరుగుతుంది.

5. గర్భవతులు తీసుకునే ఆహారసారాన్ని చాలావరకు పిండం గ్రహిస్తుంది. అందువల్ల మహిళల శరీరంలో గ్లూకోజ్ శాతం తక్కువవుతుంది. ఇందువల్ల కూడా మార్నింగ్ సిక్ నెస్ అనిపిస్తుంది.

పరిష్కార మార్గాలు:

1. మార్నింగ్ సిక్ నెస్ ఉన్నట్టు అనిపించినప్పుడు డాక్టర్ని సంప్రదించడం ఉత్తమం. ఎక్కువ వాంతులైతే అది డీ హైడ్రేషన్ కు  దారితీయవచ్చు. ఒకేసారి ఎక్కువ నీళ్లు తాగకుండా... నిర్ణీత సమయాల్లో క్రమబద్ధంగా తక్కువ మోతాదులో నీళ్లు తాగడం మంచిది. ఆహారం తీసుకోవడానికి ముందు లేదా తర్వాత నీళ్లు తాగాలి. తినేసమయంలో నీళ్లు తాగకూడదు.

2. ఆకలి వేసినప్పుడు తినాలి. అంతేకానీ తర్వాత తిందాంలే అని వాయిదా వేయకూడదు. ద్రవాహారం, ఘనాహారం తక్కువ తక్కువగా ఎక్కువసార్లు తీసుకోవాలి. వేడి పదార్థాలు కాకుండా కాస్త చల్లారిన ఆహారం తీసుకోవడం మంచిది. తీపి, స్పైసీ ఫుడ్ పదార్థాలు కాకుండా డ్రై ఫుడ్ తీసుకుంటే మంచిది.

3. కాస్త తీపి కలిపి కొద్దిగా అల్లం తింటే వికారం తగ్గుతుందని కొన్ని పరిశోధనల్లో తేలింది. పుచ్చకాయ కూడా తినవచ్చు. ఉదయం పూట కాస్త ఉప్పు కలిగినవి తింటే మార్నింగ్ సిక్ నెస్ ను నివారించవచ్చు.

4. పగటిపూట తిన్న వెంటనే పడుకోకూడదు.  తిన్న తర్వాత తేలికపాటి వ్యాయామం మంచిది.

5. మిమ్మల్ని చికాకు పరిచే ప్రదేశాలకు వెళ్లడం మానండి. వేడిగా లేదా వెచ్చగా ఉండే, గాలీ వెలుతురు లేని చోట్లకు వెళ్లకండి. వేడి వాతావరణం మరింత వికారపెడుతుంది.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon