Link copied!
Sign in / Sign up
11
Shares

ప్రెగ్నన్సీ సమయంలో మెట్లు ఎక్కడం ప్రమాదమా?

ప్రెగ్నన్సీ సమయంలో మిమ్మల్ని, మీ కడుపులోని బిడ్డను కాపాడుకోవడానికి మీరు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు. ప్రతి విషయంలో ఆచి తూచి నిర్ణయం  తీసుకుంటారు. కడుపుతో ఉన్నప్పుడు ఏ పని చేయతగినదో..,ఏ పని చేయకుడనిదో పది మందిని అడిగి మరి తెలుసుకుని చేస్తారు. అలాంటి పనులలో మెట్లు ఎక్కడం కూడా ఒకటి. ప్రెగ్నన్సీ తో ఉన్న మహిళలకు మెట్లు ఎక్కడం మీద అనేక అనుమానాలు ఉంటాయి... వాటికి సమాధానాలు ఇక్కడ చూడండి..

మెట్లు ఎక్కడం ప్రమాదమా?

కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకుంటే ప్రెగ్నన్సీ సమయంలో మెట్లు ఎక్కడం ప్రమాదమేమీ కాదు. ప్రెగ్నన్సీ మొదటి రోజులలో మెట్లు ఎక్కే సమయంలో ఏదైనా ప్రమాదం జరిగితే, గర్భం పోయే అవకాశం ఉంటుంది. అదే ప్రమాదం నెలలు నిండిన తరువాత జరిగితే కాన్పు ముందే జరిగిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే ప్రెగ్నన్సీ సమయంలో మెట్లు  ఎక్కుతున్నప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకోండి…

ప్రెగ్నన్సీ సమయంలో మెట్లు ఎక్కేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు…
1. చేపట్టు పట్టుకోండి

Image result for pregnant climbing stairs

ప్రెగ్నన్సీ సమయంలో ఎప్పుడైనా మెట్లు ఎక్కేటప్పుడు చేపట్టును పట్టుకుని ఎక్కండి. ఇది మీకు మెట్లు ఎక్కే సమయంలో ఆధారంగా ఉంటుంది. ఒకవేళ మెట్లు ఎక్కే సమయంలో మీ చేతిలో ఏదైనా ఉంటే, దానిని ఒక చేత్తో పట్టుకుని ఇంకో చేతిని చేపట్టు పట్టుకోడానికి ఉపయోగించండి.

2. వెలుతురు ఉండాలి

ఎప్పుడైనా వెలుతురుగా ఉన్న మెట్ల మార్గాన్నే ఎంచుకోండి. మెట్లు ఎక్కే సమయంలో లైట్లు ఆన్ చేయడం మర్చిపోకండి. వెలుతురులో మీరు ఎక్కుతున్న మెట్లను చూడచ్చు. మెట్ల మీద నుండి జారిపడే ప్రమాదాలు తప్పుతాయి.

3. కార్పెట్ తో జాగ్రత్త

కొన్ని చోట్ల మెట్ల మీద కార్పెట్ వేసి ఉంటుంది. ఇలాంటి మెట్ల మార్గం ద్వారా వెళ్తున్నప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండండి. వీలున్నంత వరకు ఆ మెట్లను ఉపయోగించకండి. ఒకవేళ తప్పని సరైతే చాలా నిదానంగా, జాగ్రత్తగా ఎక్కండి.

4. చీర

మీరు మెట్లు ఎక్కే సమయంలో మీరు వేసుకున్న బట్టలు ప్రమాదానికి కారణం కావచ్చు. చీర లేదా నైటీ లాంటివి మీరు మెట్లు ఎక్కే సమయంలో కళ్ళకు అడ్డం పడచ్చు. వాటితో జాగ్రత్తగా ఉండండి. మెట్లు ఎక్కే సమయంలో వాటిని ఎత్తి పట్టుకుని ఎక్కడానికి ప్రయత్నించండి.

ప్రెగ్నన్సీ సమయంలో మెట్లు ఎక్కకూడని సందర్భాలు…

Image result for pregnant climbing stairs

1. మీరు కవలలతో గర్భం దాలిస్తే మెట్ల ఎక్కకుండా ఉండేలా చూసుకోండి

2. మీకు కళ్ళుతిరగడం లాంటి సమస్యలు ఉన్నప్పుడు.

3. మీకు ఇంతక ముందు గర్భస్రావం జరిగి ఉంటే 

4. మీకు రక్త పోటు అధికంగా ఉంటే

5. మీరు గర్భంతో ఉన్నప్పుడు మీ వయసు 35 కన్నా ఎక్కువ ఉంటే

6. మీకు రక్త శ్రావం జరుగుతున్నప్పుడు 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon