Link copied!
Sign in / Sign up
1
Shares

ప్రెగ్నన్సీ సమయంలో మీరు తినే ఈ 4 ఆహారాలు మీ పిల్లలపై జీవితాంతం ప్రభావం చూపిస్తాయి


ప్రేగ్నన్ట్  అయ్యాక మీ ఆహార అలవాట్లలో అనేక మార్పులు చేసుకోవాలి. ఇది మీకు మీ బిడ్డకు చాలా అవసరం. పోషకాహారాలతో పాటు ఐరన్, ఫోలేట్ అధికంగా ఉండే ఆహరం తీసుకోవాలి. మీరు ఈ సమయంలో తీసుకునే ఆహరం మీ కడుపులోని బిడ్డ ఎదుగుదలకు తోడ్పడుతుంది. అలాగే మీరు ప్రెగ్నన్సీ సమయంలో  తీసుకునే కొన్ని రకాల ఆహారాలు మీ బిడ్డ పై జీవితాంతం ప్రభావం చూపిస్తాయి. కొన్ని మంచి ప్రభావం చూపిస్తే మరికొన్ని చెడు ప్రభావం చూపిస్తాయి. అవేంటో ఇక్కడ చూడండి…

1. ప్రొబిఒటిక్స్ మరియు పోలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ ఆసిడ్స్ - Probiotics and Polyunsaturated Fatty Acids

ప్రొబిఒటిక్స్ మరియు పోలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ ఆసిడ్స్ కలిగిన ఆహరం ప్రెగ్నన్సీ సమయంలో తీసుకోవడం వలన పిల్లలు అలెర్జీల బారిన పడకుండా కాపాడవచ్చు. బిడ్డ కడుపులో వున్నా సమయంలో ప్రొబిఒటిక్స్ మరియు పోలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ ఆసిడ్స్ ఒక రకమైన బ్యాక్టిరియాను ఉత్పత్తి చేస్తాయి. ఇవి పిల్లలకు రోగ కారకాలను ఎదురుకునే రోగ నిరోధక శక్తిని అందిస్తాయి. పిల్లలు పుట్టిన తరువాత, యెల్లర్జీలు, రోగాలు బారిన పడకుండా వుంటారు.ఫ్ల్యాక్స్ సీడ్స్ (అవిసె గింజలు), వాల్నట్ ఆయిల్, పెరుగు లాంటి పదార్ధాలలో ఇవి అధికంగా ఉంటాయి.

2. అసహజ చక్కరలు

ప్రెగ్నన్సీ సమయంలో వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ప్రెగ్నన్సీ సమయంలో వీటిని తీసుకోవడంవలన భవిష్యత్తులో మీకు పుట్టబోయే పిల్లలు అధిక బరువు సమస్యతో బాధపడుతారు. ఈ అసహజ చక్కెరలు శరీర జీవ క్రియ రేటును మందగింప చేస్తాయి. ఇది కడుపులోని బిడ్డ మీద కూడా ప్రభావం చూపిస్తుంది. పిల్లలు పుట్టిన తరువాత అధిక బరువవుతారు.

3. స్పైసెస్

జీలకర్ర, వెల్లుల్లి, అల్లం, ఆవాలు, సోంపు, పసుపు, శొంఠి, లవంగం లాంటి స్పైసెస్ మీరు ప్రెగ్నన్సీ సమయంలో తీసుకోవడం చాలా మంచిది. అధ్యయనాల ప్రకారం ఇవి తీసుకోవడం వలన కడుపులోని బిడ్డ ఎక్కువ ఆహరం తీసుకుంటుంది. బిడ్డ పుట్టిన తరువాత కూడా వారి జీర్ణ వ్యవస్థలో ఏ విధమైన సమస్యలు రావు. అరుగుదల శక్తి పెరుగుతుంది. వీటిని మీకు ముందున్న అలవాటును బట్టి కొంచెం కొంచెం గా తీసుకోండి.

4. కొలిన్ - Choline

ప్రెగ్నన్సీ సమయంలో మీరు తీసుకునే అనేక పోషకాలతో పాటు కొలిన్ ను కూడా మీ ఆహారంలో భాగం చేసుకోండి. కొలిన్ కడుపులోని బిడ్డ మెదడు ఎదుగుదలకు తోడ్పడుతుంది. తెలివితేటలను, బుద్ధి కుశలత పెరగడానికి సహాయపడుతుంది. గుడ్లు, మాంసం, వేరుశనగ లాంటి ఆహారాలలో కొలిన్ అధికంగా ఉంటుంది. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon