Link copied!
Sign in / Sign up
7
Shares

ప్రెగ్నన్సీ సమయంలో మీకు ఎవ్వరు చెప్పని 10 ఫన్నీ విషయాలు

గర్భధారణ కాలం అనేది అపూరూపమైనది మరియు సున్నితమైనది. ఈ సమయంలో ఏమి చేయాలి ఏమి చేయకూడదు అనేవి అనేకంగా విని ఉంటారు. కానీ, ఈ ఆర్టికల్లో చెప్పేది మీరు ఇంతముందు ఎప్పుడూ వినుండని విషయాలు. ఇప్పుడవేంటో చూద్దామా…

ప్రెగ్నన్సీ సమయంలో ఎదురయ్యే హాస్యాస్పద విషయాలు మీకోసం…

1. సుస్సు 

మీరు నాలుగు నెలల గర్భవతి అయినప్పుడు, మీ శిశువు మీ కడుపులో సుస్సు పోస్తుంది. శిశువు రోజుకు సుమారు లీటరు సుస్సు పోస్తుందని మీకు తెలుసా!.

2. పరిమాణం పెరుగుతుంది

నెలలు పెరిగే కొద్దీ, మీ గర్భాశయం ఒక చిన్న సైజు పుచ్చకాయ పరిమాణం వరకు విస్తరిస్తుంది. అది మీ సాధారణ గర్భాశయ పరిమాణానికి 500 రేట్లు. ఆశ్చర్యంగా ఉంది కదా….

3. ఓస్ట్రోజెన్

గర్భిణీ స్త్రీ ప్లాసెంటా ఉత్పత్తి చేసే ఓస్ట్రోజెన్ సాధారణ స్త్రీ 3 సంవత్సరాలలో ఉత్పత్తి చేసిన మొత్తానికి సమానంగా ఉంటుంది. వావ్! అది చాలా ఎక్కువ.

4. నొప్పి

గర్భంలో ఉన్నప్పుడు మీ శిశువు నొప్పి కూడా కలుగుతుందని మీకు తెలుసా. గర్భం లోపల పిల్లలు అనేక విషయాలు చేస్తారు; మీ తదుపరి అల్ట్రాసౌండ్ లో మీ కడుపులో చిన్నారి ఏమి చేస్తున్నాడో చూడండి.

5. చర్మపు రంగు

పరిశోధన ప్రకారం, గర్భధారణ సమయంలో 10 మందిలో 9 మంది చర్మపు రంగు మార్పు చెందుతున్నారు.

6. గుండె పెరుగుతుంది

గర్భధారణ సమయంలో మీ గుండె పెరుగుతుంది, పెరుగుతున్న శిశువు కోసం రక్తం పంపడానికి మీ గుండె ఇంకా ఎక్కువ కష్టపడుతుంది. పాపం… చిన్నారి అంటే ఎంత ప్రేమో మరి

7. 375 రోజులు

ఒక సంవత్సరం మొత్తం గర్భవతిగా ఉండటం సాధ్యమేనని మీకు తెలుసా? పొడవైన గర్భంధారణ 375 రోజులుగా నమోదు చేయబడింది.

8. కవల శిశువులు 

జన్యుశాస్త్రం మరియు కుటుంబం యొక్క చరిత్ర కాకుండా, పొడవైన మరియు అధిక బరువు గల తల్లులు ఒకేసారి కవల శిశువులకు జన్మనివ్వడానికి అధిక అవకాశాలు ఉన్నాయి.

9. వాసన పీల్చగలిగే శక్తి

మీరు గర్భవతిగా ఉన్నప్పుడు వాసన పీల్చగలిగే శక్తి పెరుగుతుందని మీకు తెలుసా? అవును! మీ బిడ్డకు హాని కలిగించే కొన్ని ఆహార పదార్థాలను నివారించడానికి మీ శరీరం సిగ్నల్ చేస్తున్నందున అది జరుగుతుంది. కాబట్టి మీకు ఏమైనా ఆహారం వాసన చూడంగానే చిరాకు వస్తే దాని జోలికి వెళ్ళకండి.

10.అండం

ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయం ఒకటి. ఆడ శిశువు పుట్టగానే ప్రత్యుత్పత్తి చేయగల అండం ఉత్పత్తి చేసి గర్భాశయంలో ఉంచుకుంటారు. కానీ యుక్తవయస్సును తాకినప్పుడు కానీ మగ పిల్లలు స్పెర్మ్ను అభివృద్ధి చేయరు.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon