Link copied!
Sign in / Sign up
1
Shares

ప్రెగ్నన్సీ సమయంలో మీ వక్షోజాలలో వచ్చే 5 ప్రధానమైన మార్పులు : ప్రతి మహిళ తెలుసుకోవడం అవసరం

మీరు ప్రేగ్నన్ట్ అయిన తరువాత మీ శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. మీరు బరువు పెరగడం, పోతి కడుపులోని మార్పులు కాకుండా, ప్రెగ్నన్సీ సమయంలో ఇంకో ముఖ్యమైన మార్పు మీ వక్షోజాలలో జరుగుతుంది. కొన్ని బయటకు కనిపించేవి, మరికొన్ని లోపల జరిగే మార్పులు. అవేంటో తెలుసుకోండి.

1. సైజు పెరగడం

మీరు ప్రేగ్నన్ట్ అయిన 6 నుండి 8 వారాల తరువాత, మీ వక్షోజాల సైజు పెరగడం మొదలవుతుంది.  మీ ప్రెగ్నన్సీ సమయం మొత్తం వక్షోజాలు పెరుగుతుంటాయి. మీ వక్షోజాల మీద స్ట్రెచ్ మార్క్స్ ఏర్పడుతాయి, దురద కూడా వస్తుంది.

2. నరాలు కనపడుతాయి

మీ వక్షోజాల చర్మం కింద, నరాలు ఉబ్బినట్టు కనిపిస్తాయి. అంతే కాకుండా ప్రెగ్నన్సీ కొన్ని నెలలు గడిచాక, మీ నిపుల్స్ చుట్టు ఉండే నల్లని ప్రాంతం మరింత నల్లగా, పెద్దగా మారుతుంది.

3. నిపుల్స్ చుట్టు ఉండే

నిపుల్స్ చుట్టు ఉండే, చిన్న బొడిపెలను మీరు గమినించే ఉంటారు. అవి నూనె లాంటి పదార్ధాన్ని స్రవిస్తాయి. ప్రెగ్నన్సీ సమయంలో ఇవి కూడా సైజు పెరుగుతాయి.

4. కారుతాయి

3 నెలల ప్రెగ్నన్సీ తరువాత మీ వక్షోజాలలో కొలొస్టరమ్ (colostrum) రోగనిరోధక శక్తిని పెంచే పాలు ఊతపతి అవుతాయి. ఇవి పసుపు రంగులో ఉంటాయి. మీ ప్రెగ్నన్సీ చివరి నెలలో ఈ పాలు మీ వక్షోజాల నుండి కారుతుంది.

5. గడ్డలు

కొంతమంది మహిళలలో ప్రెగ్నన్సీ సమయంలో వక్షోజాలలో గడ్డలు ఏర్పడుతాయి. ఇవి ప్రమాదమైనవి కావు. పాలు గడ్డలు కడుతుంది. ప్రెగ్నన్సీ తరువాత ఇవి తొలిగిపోతాయి. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon